Intinti Gruhalakshmi 06 August 2022 Episode : సామ్రాట్ కి దండం పెట్టిన వెళ్ళిపోయిన తులసి.. నందు, లాస్యలచేత సారీ చెప్పించిన సామ్రాట్..!
Intinti Gruhalakshmi 06 August 2022 Episode : తులసి పాట విని పరవశించిపోయిన సామ్రాట్.. తులసిని ఇన్నాళ్లు మీరు ఎందుకు ఇంటికి బంధీ అయ్యారు అని అడుగుతాడు.. అంతే.. తులసి ఒక్కసారిగా గతంలోకి వెళుతుంది.. తులసి ఒకసారి గుడిలో శ్రీరామనవమి పాట పాడితే ఆ డైరెక్టర్ తనకి పాట పాడే అవకాశం ఇచ్చాడని అప్పుడు నందు తనపై కస్సుబుస్సు అంటాడు.. ఇక వెంటనే అనసూయమ్మ సామ్రాట్ తో నేను కూడా తులసి ఎదగకపోవడానికి తప్పు చేశానని […]
Intinti Gruhalakshmi 06 August 2022 Episode : తులసి పాట విని పరవశించిపోయిన సామ్రాట్.. తులసిని ఇన్నాళ్లు మీరు ఎందుకు ఇంటికి బంధీ అయ్యారు అని అడుగుతాడు.. అంతే.. తులసి ఒక్కసారిగా గతంలోకి వెళుతుంది.. తులసి ఒకసారి గుడిలో శ్రీరామనవమి పాట పాడితే ఆ డైరెక్టర్ తనకి పాట పాడే అవకాశం ఇచ్చాడని అప్పుడు నందు తనపై కస్సుబుస్సు అంటాడు.. ఇక వెంటనే అనసూయమ్మ సామ్రాట్ తో నేను కూడా తులసి ఎదగకపోవడానికి తప్పు చేశానని అంటుంది.. పాతకాలం అత్తలకు మల్లె తులసి ఎదగకుండా ఇంట్లో నేను చెప్పిన మాటే వినాలి అని అనుకున్నాను.. ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను.. ఇకమీదట ఆ తప్పు జరగదు అని సామ్రాట్ తో అంటుంది అనసూయమ్మ.. అభి వాళ్ళ నాన్నను సమర్థిస్తూ నానమ్మది తప్పు ఏం లేదు అని అంటాడు.. వెంటనే నానమ్మే తప్పు ఒప్పుకుంటే నువ్వేంటి రా సమర్థిస్తున్నావు అని అంటాడు.. నానమ్మదీ చాలా పెద్ద మనసు అందుకే తప్పు ఒప్పుకుంది..
వెంటనే సామ్రాట్ అదేంటో కానీ ఈరోజు పార్టీ పెట్టిన ముహూర్తం బాగోలేదు.. ఏ టాపిక్ డిస్కషన్ మొదలుపెట్టిన అది ఎక్కడికో వెళ్తుంది.. మీ మమ్మీ ఎంకరేజ్ చేసినట్లయితే గొప్ప సింగర్ అయి ఉండేది కదా అని అన్నాను అంతే టాపిక్ ఎక్కడికో వెళ్లిపోయింది అని సామ్రాట్ అంటాడు.. భార్య ఎదగాలి అంటే తప్పనిసరిగా భర్త సపోర్టు ఎంకరేజ్మెంట్ ఉండాలి.. లేకపోతే అది జరగదు అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అంటాడు.. ఏ భర్త ఏ భార్యను కావాలని అనగదొక్కకోవాలని అనుకోడు.. నేను అంతే నందుని అంతే ఎంకరేజ్ చేస్తాను.. నాకు ఏం కావాలో నందు అది ఇస్తాడు నందుకు ఏం కావాలో అది నేను ఇస్తాను .. అలాగే తులసి భర్త విషయంలో అతని ప్రాబ్లం ఏంటో ఎవరికి తెలుసు అని లాస్య అంటుంది.. అవును లాస్య నువ్వు చెప్పింది కూడా కరెక్టే.. బయట నుంచి మనం కామెంట్ చేయకూడదు నిజం ఏంటో చెప్పగలిగేది తులసి ఒక్కటే.. అమ్మ తులసి నీలాంటి మంచి మనసున్న భార్య దొరకడం నీ భర్త చేసుకున్న పుణ్యం..
నిన్ను వదిలేసుకోవడం అతని దురదృష్టం మీ మధ్య అసలు ఏం జరిగిందమ్మ.. ఎందుకు వదిలేశాడు అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అడుగుతాడు.. వెంటనే తులసి సామ్రాట్ గారూ మీరు మమ్మల్ని పార్టీకి పిలిచినందుకు ధన్యవాదాలు అని.. రెండు చేతులతో దండం పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత లాస్య నందు కూడా వెళ్ళిపోతారు.. తులసి ఇంటికి వెళ్లి ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది.. లాస్య అడిగిన ప్రశ్నకు నాకు ఎప్పటి వరకు సమాధానం దొరకలేదు మామయ్య.. దాని గురించే ఆలోచిస్తున్నాను అని తులసి అంటుంది.. ఇక నందు కూడా ఇంటికి వెళ్లి తులసి ఎందుకు సామ్రాట్ దగ్గర నన్ను ఓడిపోవాలి అని అనుకోలేదు..
సామ్రాట్ ను ఓడిపోమని ఎందుకు రిక్వెస్ట్ చేసింది అని ఆలోచిస్తూ ఉంటాడు.. అప్పుడే లక్కీ వచ్చి ఈ బొమ్మ నాకు సామ్రాట్ గారు నాకు కొనిచ్చాడు.. ఎంత కాస్ట్లీ బొమ్మ తెలుసా అంకుల్.. అంకుల్ చాలా మంచివారు అని లక్కీ అంటాడు.. కోపంతో ఆ బొమ్మను నందు విసిరి కొట్టాలని అనుకుంటాడు నందు.. అప్పుడే లాస్య వచ్చి చిన్నపిల్లడు నందు తన మీద ఎందుకు కోపం చూపిస్తున్నావు అని అడ్డుకుంటుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో మ్యూజిక్ స్కూల్ కి సంబంధించిన విషయంలో నందు నోరు జారుతాడు.. వెంటనే సామ్రాట్ కి నందు సారీ చెబుతుండగా.. సారీ చెప్పాల్సింది నాకు కాదు తులసికి అని అంటాడు.. ఇక నందు, లాస్య ఇద్దరు కలిసి తులసికి సారీ చెబుతారు..