Intinti Gruhalakshmi 9 May Today Episode : తులసి బెస్ట్ తల్లి కదా? అభి, ప్రేమ్, దివ్య తన గురించి ఏం చెప్పారు? తులసి గెలవకుండా లాస్య ఏం ప్లాన్ చేసింది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi 9 May Today Episode : తులసి బెస్ట్ తల్లి కదా? అభి, ప్రేమ్, దివ్య తన గురించి ఏం చెప్పారు? తులసి గెలవకుండా లాస్య ఏం ప్లాన్ చేసింది?

Intinti Gruhalakshmi 9 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 09 మే 2022, సోమవారం ఎపిసోడ్ 627 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏ తల్లి అయినా ఒకేసారి జన్మనిస్తుంది కానీ.. మా మామ్ మాత్రం నాకు మూడు సార్లు జన్మనిచ్చింది. ఒక సారి 9 నెలలు కడుపులో మోసి.. మరోసారి నేను చేసిన తప్పును తన నెత్తి మీద వేసుకొని, మూడోసారి నేనొక మర్డర్ […]

 Authored By gatla | The Telugu News | Updated on :9 May 2022,9:30 am

Intinti Gruhalakshmi 9 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 09 మే 2022, సోమవారం ఎపిసోడ్ 627 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏ తల్లి అయినా ఒకేసారి జన్మనిస్తుంది కానీ.. మా మామ్ మాత్రం నాకు మూడు సార్లు జన్మనిచ్చింది. ఒక సారి 9 నెలలు కడుపులో మోసి.. మరోసారి నేను చేసిన తప్పును తన నెత్తి మీద వేసుకొని, మూడోసారి నేనొక మర్డర్ కేసులో ఇరుక్కొని నా జీవితాన్నే వదిలేసుకున్న సమయంలో.. ఈ దేవత న్యాయదేవతలా పోరాడి నన్ను నిర్దోషిగా బయటపడేసింది. ఆ విధంగా నాకు మూడో సారి జన్మనిచ్చింది అని అంటాడు అభి. అందుకే మా అమ్మ గ్రేట్.. అంటాడు అభి. నందు, లాస్యకు అభి మాట్లాడటం అస్సలు నచ్చదు.

intinti gruhalakshmi 09 may 2022 full episode

intinti gruhalakshmi 09 may 2022 full episode

వీడిలో స్వార్థం ఉన్నా అమ్మ మీద ప్రేమ ఉంది అంటాడు పరందామయ్య. మరోవైపు దివ్య కూడా మాట్లాడుతుంది. ఏ కూతురు అయినా.. భరోసా కోసం తండ్రి వైపే చూస్తుంది. డాడీ ఉన్నాడనే భరోసాతో ఉంటుంది. కానీ.. నా విషయంలో మాత్రం అలా జరగలేదు.. అంటుంది దివ్య. నన్నెవరో కిడ్నాప్ చేసినప్పుడు మా డాడ్ స్థానంలో మా మామ్ నిలబడి నన్ను రక్షించుకుంది అంటుంది దివ్య. మామ్ కే సపోర్ట్ ఇవ్వని డాడ్.. ఇక మాకు ఏం ఇస్తారు అని అంటుంది దివ్య. అందుకే.. మా మామ్ ఎప్పటికీ గ్రేట్ అంటుంది దివ్య. వెక్కి వెక్కి ఏడుస్తుంది దివ్య. దీంతో అక్కడున్నవాళ్లు అంతా నిశ్శబ్ధంగా చూస్తుంటారు. ఇంతలో మైక్ తీసుకున్న ప్రేమ్ అమ్మ జన్మనిస్తే నా జీవితాన్ని ఇస్తాడు అంటారు. నాకు మాత్రం జన్మను ఇచ్చింది జీవితాన్ని ఇచ్చింది కూడా మా అమ్మే. నేను ఒక పనికిరాని వాడిని అని నా తండ్రితో సహా అందరూ నా మీద ముద్ర వేశారు అంటాడు ప్రేమ్.

కానీ.. మా అమ్మ మాత్రమే నన్ను నమ్మి అండగా నిలిచింది. ముందుకు నడిపిస్తోంది అంటాడు ప్రేమ్. అందుకే.. మా అమ్మ గ్రేట్ అంటాడు ప్రేమ్. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. మనసులో నా ప్రేమ్ గ్రేట్ అనుకుంటుంది తులసి. మరోవైపు లాస్య కొడుకు లక్కీ మాట్లాడుతాడు. మా మమ్మీ కూడా చాలా గ్రేట్ అంటాడు లక్కీ.

గోరు ముద్దలు తినిపించడం.. ఒడిలో కూర్చోబెట్టుకొని మాట్లాడటం.. ఒక్క నిమిషం కూడా వదలదు. కానీ.. ఇదంతా నిజం కాదు కలలో అంటాడు లక్కీ. దీంతో అక్కడున్నవాళ్లంతా షాక్ అవుతారు. ఏం తప్పు చేశానో తెలియదు. మా మమ్మీ నన్ను హాస్టల్ లో ఉంచి చదివిస్తోంది అంటాడు లక్కీ.

చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు. లోన్లీగా ఉంటుంది. హాస్టల్ రూమ్ జైలులా అనిపిస్తుంది. మమ్మీ కనిపించదు. మమ్మీ మాట వినపడదు. ఏడుపు వస్తూ ఉంటుంది. చెప్పుకోవడానికి ఎవ్వరూ ఉండరు. తినాలని ఉండదు. నిద్ర పట్టదు. పారిపోవాలనిపిస్తుంది అంటాడు లక్కీ.

Intinti Gruhalakshmi 9 May Today Episode : లాస్యకు షాకిచ్చిన తన కొడుకు లక్కీ

ఇంతలో వాడేదో తమాషాకు అలా అంటున్నాడు. కదా లక్కీ అంటుంది లాస్య. కానీ.. లేదు మమ్మీ నిజంగానే చెబుతున్నాను అంటాడు. నువ్వు కూడా నన్ను తులసి ఆంటీలాగా ప్రేమగా చూసుకోవచ్చు కదా మమ్మీ. నాకు అబద్ధం చెప్పడం చేతకాదు. అందుకే నిజం చెప్పేశా. సారీ మమ్మీ. ఎవ్వరికీ నా లాంటి లైఫ్ ఉండకూడదు అని చెప్పి మైక్ అక్కడ పెట్టేస్తాడు లక్కీ.

నాకు తెలుసు. లక్కీ మాటలు ఇక్కడున్న అందరి హృదయాలను టచ్ చేశాయని అంటుంది యాంకర్. ఇది కాంపిటిషన్. దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేయకూడదు. ఇక.. మూడు రౌండ్ కు వెళ్దాం. చూజ్ యువర్ ఆప్షన్. ఒక్కో పార్టిసిపెంట్ కు ఒక ప్రశ్న ఇస్తాం. అందులో రెండు సమాధానాలు ఉంటాయి. వాళ్లు రెండింట్లో ఒక సమాధానాన్ని మాత్రమే ఎంచుకోవాలి అంటారు.

లాస్యకు ఒక ప్రశ్న వస్తుంది. మీ అబ్బాయి మిమ్మల్ని నేను ఇష్టమా.. డాడీ ఇష్టమా అని అడిగితే మీరు ఏం చెప్తారు అని అంటుంది యాంకర్. దీంతో నువ్వే ఇష్టం అని చెబుతా అంటుంది కానీ.. జడ్జీలు మాత్రం తన ప్రశ్నకు కరెక్ట్ సమాధానం కాదు అని చెబుతారు.

ఇంతలో తులసికి ప్రశ్న వస్తుంది. మీ నాన్న గారికి యాక్సిడెంట్ అయి ఆసుపత్రిలో ఉన్నారు. మరోవైపు స్కూల్ లో మీ బాబు మీ కోసం ఎదురు చూస్తున్నారు. ముందు ఎవరి దగ్గరికి వెళ్తారు అని ప్రశ్నిస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్తావు అని అడుగుతుంది.

దీంతో హాస్పిటల్ లో ఉన్న నాన్న గారి దగ్గరికి అంటుంది. అదేంటి అంటే.. నా అవసరం లేకుండానే వాడు ఇంటికి వచ్చేలా నేను ముందే వాడికి దారి చెప్పాను కాబట్టి.. తల్లి ఎప్పుడూ వాళ్లకు తోడు ఉండాలి కానీ.. అలాగే వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా కూడా చేయాలి అంటుంది తులసి. దీంతో అందరూ చప్పట్లు కొడతారు.

తర్వాత చివరి ప్రశ్న.. అమ్మ కోసం పిల్లలు ఏం చేస్తారో చెప్పాలి అంటుంది యాంకర్. అందరూ చెబుతుంటారు. లాస్య కొడుకు కూడా చెబుతాడు. మమ్మీ హాపీనెస్ కోసం తను ఏం చెప్పినా వింటాను అంటాడు లక్కీ. ఇక.. తులసి వంతు వస్తుంది.

కానీ.. తులసి పిల్లలు మాత్రం ఏం చెప్పాలో అర్థం కాకుండా అలాగే కూర్చుండిపోతారు. ఇంతలో ముగ్గురూ నిలబడతారు. నడుచుకుంటూ స్టేజ్ మీదికి వస్తారు. ప్రేమ్ మైక్ తీసుకుంటాడు. ఇంక చెప్పడానికి.. మాట్లాడటానికి ఏం లేవు అంటాడు ప్రేమ్.

ఇన్నాళ్లు మా లైఫ్ లో మామ్ కోసం స్పెషల్ గా చేసిందంటూ ఏం లేదు అంటుంది దివ్య. కనీసం మామ్ బర్త్ డే రోజు కూడా గుర్తు పెట్టుకొని ఎప్పుడూ విష్ చేయలేదు అంటాడు అభి. మేము కూడా ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. మేము గిల్టీగా ఫీల్ అవుతున్నాం మామ్ అంటుంది దివ్య.

ఎప్పుడూ మా వైపు నుంచే ఆలోచించాం. నీ వర్క్ గురించి ఆలోచించలేదు మామ్. అమ్మగా నువ్వు గెలిచావు. పిల్లలుగా మేము ఓడిపోయాం మామ్. మమ్మల్ని క్షమించు మామ్ అని అందరి ముందు క్షమాపణలు కోరుతారు ముగ్గురూ.

దీంతో ఎందుకు మీరు ఓడిపోయారని అనుకుంటున్నారు అంటుంది తులసి. మీరు నాకు ఏం చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు అంటుంది. ఈరోజు అందరి ముందు నేను ఇలా తలెత్తుకొని నిలబడి ఉన్నానంటే దానికి కారణం మీరు కాదా అంటుంది తులసి.

ఒక మనిషిని నమ్మి నా జీవితాన్ని తన చేతుల్లో పెట్టాను. నన్ను, నా పిల్లలను ప్రేమగా చూసుకుంటాడు అని ఆశపడ్డాను మోసపోయాను అంటుంది తులసి. నన్ను కాదనుకొని తను మరోమనిషికి సొంతం అయ్యాడు అంటుంది తులసి.

జీవితాన్ని పోగొట్టుకున్నాను. ఒంటరిగా మిగిలిపోయాను అంటుంది తులసి. ఆ ఒంటరితనం నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి మేమున్నాం అంటూ నాకు అండగా నిలబడింది ఎవరో కాదు.. నా పిల్లలు అంటుంది తులసి. తను కూడా స్టేజ్ మీదికి వస్తుంది.

నా పేగు తెంచుకొని పుట్టిన నా పిల్లలు అంటుంది తులసి. దీంతో అందరూ తన మీద పడి ఏడుస్తారు. ప్రేమ్ మాత్రం తన దగ్గరికి వెళ్లడానికి సంకోచిస్తాడు. ఆరోజు వీళ్లు నాతో లేకపోతే.. ఈరోజు నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు. అందరూ అనుకుంటారు. తల్లే పిల్లలకు బలం అని. కానీ.. నా విషయంలో నా పిల్లలే నా బలం.. నా శక్తి అంటుంది తులసి.

ఇంతకన్నా వీళ్లు ఈ అమ్మ కోసం ఏం చేయాలి అంటుంది తులసి. ఇది నేను చప్పట్లు కొట్టించుకోవడం కోసం చెప్పడం లేదు. నా మనసులో నుంచి తన్నుకొస్తున్న మాటలు ఇవి. ఇన్నాళ్లు చెప్పలేదు. చెప్పే అవకాశాన్ని, అవసరాన్ని మీరు ఈరోజు నాకు ఇచ్చారు అంటుంది తులసి.

ఆడదాని జీవితంలో పరిపూర్ణత భార్యగా మారినప్పుడే రాదు. అమ్మ అని అనిపించుకున్నప్పుడే ఆ గెలుపు వస్తుంది. నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి. నేను ఈ పోటీల్లో గెలవడానికి నా పిల్లలు అది చేశాం.. ఇది చేశాం అంటూ అబద్ధం చెప్పొచ్చు. కానీ.. చెప్పలేదు. అదీ వాళ్ల నిజాయితీ అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది