Intinti Gruhalakshmi 1 Oct Today Episode : అక్షర, ప్రేమ్ ఎంగేజ్ మెంట్.. నిశ్చితార్థం కాగానే ప్రేమ్ ఇంటికి వెళ్లిపోయిన అక్షర.. శృతికి క్లోజ్ అయిపోయిన అక్షర
Intinti Gruhalakshmi 1 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 1 అక్టోబర్, 2021 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అక్షర, ప్రేమ్ ఎంగేజ్ మెంట్ కు అన్ని ఏర్పాట్లు జరుగుతుంటాయి. అందరూ రెడీ అవుతారు కానీ.. శృతి మాత్రం రెడీ కాదు. దీంతో శృతి నువ్వు కూడా రెడీ అవ్వు అని చెబుతుంది. తులసి ఆంటి అంటే నాకు ఇష్టం. తులసి ఆంటికి ఇష్టమైన వాళ్లు నాకూ ఇష్టమే అంటుంది. ఎంగేజ్ మెంట్ కు నువ్వు ఈ చీర కట్టుకో.. అని శృతికి అక్షర చెబుతుంది.

intinti gruhalakshmi 1 october 2021 episode
మొత్తానికి ఆ ఎంగేజ్ మెంట్ లో అక్షర.. శృతితో క్లోజ్ అవడంతో లాస్య షాక్ అవుతుంది. నువ్వు ఇంత అందంగా ఉన్నా.. ప్రేమ్ నీకు పడలేదు. నాకు పడ్డాడు.. అని జోక్ చేస్తుంది. ముహూర్తం టైమ్ అవుతుండటంతో వెంటనే వెళ్లి చీర కట్టుకొనిరా.. అంటుంది శృతి.

intinti gruhalakshmi 1 october 2021 episode
జీకే గారు ఇప్పటికీ నాకు ఇదంతా కలగానే ఉంది.. అంటాడు నందు. కొన్ని కొన్ని మనం ప్లాన్ చేసినా జరగవు. కొన్ని ప్లాన్ చేయకున్నా జరుగుతాయి. అక్షరకు ఎలాంటి వాడిని తీసుకురావాలా.. అని అనుకుంటున్నాను. కానీ.. ఇంతలో ప్రేమ్ లాంటి బ్రహ్మాండమైన కుర్రాడు దొరికాడు అని జీకే అనగానే.. అంతా బాగానే ఉంది కానీ.. ప్రేమ్ కు ఇంకొంచెం సమయం ఇచ్చి ఉంటే బాగుండేది అని అంటాడు పరందామయ్య.
Intinti Gruhalakshmi 1 Oct Today Episode : అక్షరను వదిలేసి శృతిని చూసిన ప్రేమ్
ఇంతలో అక్షరను శృతి తీసుకొని వస్తుంటుంది. దీంతో ప్రేమ్.. శృతినే చూస్తుంటాడు కానీ.. అక్షర మాత్రం.. ప్రేమ్ తననే చూస్తున్నాడేమో అని అనుకుంటుంది. కానీ.. ప్రేమ్ మాత్రం కళ్లార్పకుండా శృతినే చూస్తుంటాడు. నీ ప్రేమ్ నిజంగా ముద్దపప్పు అనుకుంటా.. పెళ్లి కాబోయే అమ్మాయి పక్కనే ఉంటే.. నన్ను చూడడు ఏంటి.. అని శృతితో అంటుంది అక్షర.

intinti gruhalakshmi 1 october 2021 episode
ఓవైపు ఎంగేజ్ మెంట్ జరుగుతున్నా.. ప్రేమ్ మాత్రం చాలా సీరియస్ గా కూర్చుంటాడు. దీంతో ప్రేమ్ ఏం చేస్తాడో అని లాస్య.. టెన్షన్ పడుతుంటుంది. ఇంతలో ఇద్దరూ రింగ్స్ మార్చుకుంటారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు.
అక్షరకు రింగ్ తొడుగుతూ కూడా.. ప్రేమ్.. శృతి వైపే చూస్తుంటాడు. దయచేసి నా వైపు అలా చూడకు. ఈరోజుతో ఆ ఆశ నాకు లేకుండా పోయింది. ఇక నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావన్న ఆశ ఈరోజుతో ముగిసిపోయింది.. అని శృతి అనుకుంటుంది.

intinti gruhalakshmi 1 october 2021 episode
నువ్వు ప్రేమించిన వాడితో నీ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇప్పుడు నువ్వు హ్యాపీనా అంటాడు జీకే. దీంతో అవును డాడీ.. నేను చాలా హ్యాపీ.. అంటుంది అక్షర. ఎంగేజ్ మెంట్ అయిపోయింది కదా.. నేను ఇక్కడే ప్రేమ్ తో ఉండిపోతా అంటుంది అక్షర. తప్పమ్మా.. పెళ్లి కాకముందే అత్తారింటికాడ ఉండకూడదు అంటాడు జీకే. కానీ.. నందు మాత్రం ఏం కాదు లేండి.. రెండు మూడు రోజులైతే.. అక్షర మా ఇంటి కోడలు కావాల్సిందే కదా అంటాడు. కానీ.. తులసి మీరు ఏమంటారు అంటాడు జీకే. మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అంటే.. అదేం లేదండి. అక్షర మా ఇంటి కోడలు అయిపోయినట్టే. ముందు వస్తే ఏముంది.. తర్వాత వస్తే ఏముంది. తను ఇప్పుడు మా ఇంటి బిడ్డ అయిపోయినట్టే.. అంటుంది తులసి. దీంతో వెళ్లి తులసిని హత్తుకుంటుంది అక్షర. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి ఎపిసోడ్ లో చూడాలి.

intinti gruhalakshmi 1 october 2021 episode