Intinti Gruhalakshmi 12 March Today Episode : లాస్య బుట్టలో పడిపోయిన దివ్య.. ప్రేమ్ ను ఆదుకున్న ఫ్రెండ్స్.. ఇంతలో ట్విస్ట్
Intinti Gruhalakshmi 12 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 మార్చి 2022, శనివారం ఎపిసోడ్ 578 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవరి పంతాలు వారివి.. ఎవరి పట్టింపులు వారివి.. మేమేమైనా ఎవ్వరికీ పట్టడం లేదు అని నందుతో అంటుంది దివ్య. అలా ఏం లేదమ్మా అంటాడు నందు. మామ్ మాత్రం ప్రేమ్ అన్నయ్య మీద ధ్వేషం పెంచుకుంది. ప్రేమ్ అన్నయ్య వస్తేనే కానీ.. నేను భోం చేయను అంటుంది దివ్య. ఈ మాట మీ అమ్మకు చెప్పలేదా దివ్య అంటుంది లాస్య. దీంతో ఎందుకు చెప్పలేదు.. చెప్పినా వినడం లేదు. ఒప్పుకోవడం లేదు. కాకమ్మ కథలు చెప్పి నాకు తినిపించడానికి ప్రయత్నిస్తోంది అంటుంది దివ్య.
తులసి ఎందుకు ఇలా తయారైంది నందు. దివ్య.. ప్రేమ్ మీద బెంగ పెట్టుకుంది.. అంటుంది లాస్య. దివ్య.. నన్ను నమ్ము. నేను ఎలాగైనా మీ అమ్మను ఒప్పించి ప్రేమ్ ను ఇంటికి తీసుకొస్తాను అని దివ్యకు మాటిస్తాడు నందు. బయటికి తులసి.. తులసి అంటూ అరుస్తూ వస్తాడు నందు. నా మీద కోపాన్ని ఎందుకు పిల్లల మీద చూపిస్తున్నావు అంటాడు నందు. ప్రేమ్ ఎక్కడున్నాడో ఫోన్ చేసి కనుక్కొని పిలవచ్చు కదా అని అంటాడు నందు. ఆ పని మీరు చేయొచ్చు కదా. మీరు ప్రేమ్ కు ఫోన్ చేయొచ్చు కదా. మీరెందుకు ఆ పని చేయలేకపోయారు అంటుంది తులసి. దీంతో నందు షాక్ అవుతాడు.
అదేంటి తులసి.. ప్రేమ్ ను ఇంట్లో నుంచి పంపించింది నువ్వు.. ఇప్పుడు ప్రేమ్ ను పిలవాల్సింది కూడా నువ్వే అంటుంది లాస్య. దీంతో సరే.. పిలుస్తాను. ప్రేమ్ తో ఇక నుంచి గొడవలు పెట్టుకోను అని మాటిస్తారా అని అడుగుతుంది తులసి.
దీంతో సరే మాటిస్తాను అంటాడు నందు. కానీ ఒక కండిషన్ అంటాడు నందు. తిరిగొచ్చాక.. ప్రేమ్ ఎప్పుడూ నాతో గొడవ పెట్టుకోడని నువ్వు నాకు మాటివ్వాలి అంటుంది. దీంతో సరే.. నువ్వే ఫోన్ చేసి మాట్లాడు. నువ్వు ప్రేమ్ ను ఫోన్ చేసి రమ్మను అంటుంది తులసి.
దీంతో నేను ఎలా ఫోన్ చేస్తాను. వాడు నా షర్ట్ ను పట్టుకున్నాడు. నా ఆత్మాభిమానాన్ని దెబ్బ తీశాడు. నేను ఎందుకు ఫోన్ చేస్తాను అంటాడు నందు. దీంతో నేను ఫోన్ చేయను అంటుంది తులసి. అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది. పరందామయ్య కూడా తన నిర్ణయాన్నే సమర్థిస్తాడు.
Intinti Gruhalakshmi 12 March Today Episode : దివ్యకు జ్యూస్ తాగిపించిన లాస్య
మరోవైపు ప్రేమ్.. తన ఫ్రెండ్స్ ను కలుస్తాడు. దేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలని కోరుకోవాలని అడిగినా నేను ఏం ఆశ్చర్యపోను కానీ.. మీ అమ్మ ఇలా ఇంట్లో నుంచి గెంటేయడం ఏంటి అంటారు. తప్పు చేశాను.. శిక్ష వేసింది.. ప్రిపేర్ అయ్యాను అంటాడు ప్రేమ్.
నేను గతం గురించి కాదు.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను అంటాడు ప్రేమ్. ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నా నేను అంటాడు ప్రేమ్. ఇప్పుడు సీజన్ కూడా కాదు. ఈవెంట్స్ కూడా లేవు అంటారు తన ఫ్రెండ్స్.
మరి.. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు అని అడుగుతారు. దీంతో 3 వేల రెంట్ కు ఒక ఇల్లు తీసుకున్నాను అంటాడు. ఇంట్లో సామాన్లు ఏం లేవు అంటాడు. ప్రస్తుతానికి ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి అంటాడు ప్రేమ్. దీంతో తమ వద్ద ఉన్న డబ్బులను ఇస్తారు.
ఈ డబ్బుతో కావాల్సినవి కొనుక్కో అంటారు. మరోవైపు దివ్య.. ఇంకా ప్రేమ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది. అమ్మ దివ్య అనగానే.. ఆంటి ప్లీజ్ నన్ను విసిగించొద్దు.. ఇరిటేట్ చేయొద్దు అంటుంది దివ్య. నాకు నీరసంగా ఉంది.. నాకు మాట్లాడే ఓపిక కూడా లేదు.. వెళ్లిపోండి ప్లీజ్ అంటుంది దివ్య.
తెలుసు దివ్య. నీ కన్నతల్లిని కాకపోయినా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నేను వచ్చింది నీకు జ్యూస్ తాగించడానికి కాదు. నీకు సపోర్ట్ ఇవ్వడానికి. నీ ఆలోచనను పంచుకోవడానికి. నిజం దివ్య.. నన్ను నమ్ము. వద్దు ఏడవకు.. అంటుంది లాస్య.
దివ్యతో లాస్య మాట్లాడటం తులసి చూస్తుంది. మీ మామ్ కు తన బాధ, తన కన్నీళ్లు తప్పితే ఎదుటి మనిషి కన్నీళ్లు తెలియవు. ఆ విషయం నీకు ఇప్పుడే తెలుస్తోంది. నాకు ఎప్పుడో తెలుసు అంటుంది లాస్య. పెద్దవాళ్లే మొండిగా ఉంటే ఏం చేయాలి ఆంటి అంటుంది దివ్య.
ప్రేమ్ ను నేను తీసుకొస్తాను.. నన్ను నమ్ము అంటుంది లాస్య. నువ్వు ఈ నిరాహార దీక్ష మానేస్తే అప్పుడు నువ్వు, నేను కలిసి మీ మామ్ తో యుద్ధం చేద్దాం అంటుంది లాస్య. ముందు ఈ జ్యూస్ తాగు అంటుంది. ఏంటి అలా అనుమానంగా చూస్తున్నావు అంటుంది లాస్య.
దీంతో దివ్య జ్యూస్ తాగుతుంది. తులసి సంతోషిస్తుంది. మరోవైపు శృతి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. శృతి ఏమైంది అని అడుగుతాడు ప్రేమ్. తన ఫ్రెండ్స్ ఇచ్చిన డబ్బుల గురించి శృతికి చెబుతాడు. ఆ తర్వాత లాస్యతో ఎక్కువగా అనుబంధాన్ని పెంచుకుంటుంది దివ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.