Intinti Gruhalakshmi 14 Nov Today Episode : లాస్యకు అడ్డంగా దొరికిపోయిన తులసి, నందు.. వీళ్ల సరసాలు చూసి లాస్య షాకింగ్ నిర్ణయం
Intinti Gruhalakshmi 14 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ సోమవారం ప్రసారం అవుతుంది. ఈరోజు ప్రసారం కాదు. సోమవారం, 15 నవంబర్ 2021, 477 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనసూయకు తులసి విలువ తెలుస్తుంది. లాస్య అసలు స్వరూపం కూడా తెలుస్తుంది. దీంతో చాలా బాధపడుతుంది. తులసిని అనరాని మాటలు అని ఎంతో బాధపెట్టానిని వెక్కి వెక్కి ఏడుస్తుంది. దేవత లాంటి తులసిని అనుమానించి.. అవమానించి చాలా తప్పు చేశానని అనసూయ బాధపడుతుంది. తను చేసిన తప్పును తెలుసుకుంటుంది.

intinti gruhalakshmi 14 november 2021 full episode
మరోవైపు నందు తాగి వచ్చినట్టు.. రూమ్ లో తులసికి సారీ చెప్పినట్టు లాస్య కలగంటుంది. తులసి, నందు కలిసిపోయినట్టు కలగన్న లాస్య తట్టుకోలేదు. ఒకవేళ నిజంగానే ఇద్దరూ కలిసిపోతారా? అని భయపడుతుంది లాస్య. అస్సలు తట్టుకోలేదు. దీంతో వెంటనే నందుకు ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావు నందు అంటుంది. దీంతో ప్రాజెక్టు వర్క్ చేస్తున్నా అంటాడు. నమ్మదు.. ఉండు వెంటనే వీడియో కాల్ చేస్తా ఎత్తు అని చెప్పి వీడియో కాల్ చేస్తుంది. అప్పుడే తులసి బాల్కనీలో తిరుగుతూ ఉంటుంది.
దీంతో వీడియో కాల్ లిఫ్ట్ చేస్తాడు. రూమ్ బాగుంది.. అని అంటుంది లాస్య. చూస్తుంటే రొమాంటిక్ గా మంచి మూడ్ క్రియేట్ చేస్తుంది అంటుంది లాస్య. ఓయ్.. నేను రొమాన్స్ గురించి మాట్లాడుతుంటే దొంగకోళ్లు పట్టేవాడిలా ఆ రియాక్షన్ ఏంటి అంటుంది లాస్య. ఓవైపు నందుకు తులసి ఎక్కడ వస్తుందోనని టెన్షన్ పడుతుంటాడు. ఏం నన్ను చూడాలనిపించడం లేదా.. అంటుంది.
Intinti Gruhalakshmi 14 Nov Today Episode : వీడియో కాల్ లో నందు, లాస్య రొమాంటిక్ ముచ్చట్లు
ఏమైంది నందు నీకు. నీలో ఉండే ఆ రొమాంటిక్ యాంగిల్ ఏమైంది అంటుంది. ఆ మహాతల్లి తులసి నీతో పాతికేళ్లు ఎలా కాపురం చేసిందో. ఆవిడకు దండం పెట్టాలి అంటుంది లాస్య. అలా.. ఇద్దరూ ముచ్చటించుకుంటూ ఉంటారు. ఇంతలో తులసి లోపలికి వచ్చి.. టీ పెట్టి నందుకు తెచ్చి ఇస్తుంది. తులసి.. నందుకు టీ ఇవ్వడాన్ని వీడియో కాల్ లో లాస్య చూస్తుంది. చూసి షాక్ అవుతుంది.
కట్ చేస్తే.. ఉదయమే మీటింగ్ కోసం నందు, తులసి రెడీ అవుతుంటారు. నందు.. కోటు వేసుకుంటాడు. టై కట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా టై సెట్ కాదు. దీంతో తులసి వచ్చి ఏమైందండి.. నేను కడతాను అంటుంది. పర్వాలేదు అంటాడు నందు. టై కడతారు.. అందుకు బదులుగా తాళి కూడా కట్టించుకుంటారు అంటూ లాస్యను ఇన్ డైరెక్ట్ గా అంటుంది తులసి.
నందు.. తులసితో టై కట్టించుకోవడం.. లాప్ టాప్ లో వీడియో కాల్ లో చూస్తుంటుంది లాస్య. లాస్యకు తులసి టై కట్టడం అస్సలు ఇష్టం ఉండదు. దీంతో ఏం చేయాలో అర్థం కాదు తనకు. ఈ తులసి.. నందుకు బాగా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందని టెన్షన్ పడుతుంది. నందు అంటూ సీరియస్ అవుతుంది లాస్య. ఏం చేస్తున్నావు తులసి అంటుంది. దీంతో తులసి.. లాప్ టాప్ లో వీడియోను చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.