T20 world Cup Final : ‘కప్పు’ ఎవరిదీ..? టెన్షన్ టెన్షన్‌లో ఇరు జట్ల కెప్టెన్లు.. !
T20 world Cup Final: టీ20 ప్రపంచకప్ టోర్నీలో దాదాపు అన్ని మ్యాచులను ‘టాస్’లే నిర్ణయించాయి. గ్రూప్ దశలోనే కాకుండా సెమీ ఫైనల్ మ్యాచులో కూడా టాస్ గెలిచిన జట్టులే విన్నర్‌లుగా నిలిచాయి. ఈరోజు ‘ఫైనల్’మ్యాచ్ జరగనుంది. అయితే, ఈరోజు మ్యాచ్ ఫలితాన్ని కూడా ‘టాస్’ నిర్ణయిస్తుందో లేదో వేచిచూడాల్సిందే.
దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్లో న్యూజీలాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. గ్రూప్ దశలో 5 మ్యాచులు ఆడి నాలుగు మ్యాచుల్లో గెలిచి ఇరు జట్లు సెమీస్‌కు చేరాయి. మొన్న జరిగిన సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై విలియమ్ సేన ఘటన విజయం సాధించింది. ఇక సెమీస్‌లో పాకిస్థాన్ పై ఆసిస్ గెలిచి ఫైనల్‌కు చేరుకుంది.
T20 world Cup Final ఫలితాన్ని డిసైడ్ చేస్తోన్న ‘టాస్’
అయితే, ఫైనల్ మ్యాచ్ దగ్గర పడుతన్న కొద్దీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్టు కెప్టెన్లకు ‘టాస్’టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో దుబాయ్ వేదికగా ‘టాస్’గెలిస్తే ఇక తామే మ్యాచ్ గెలిచినట్టే అన్ని టీమ్స్ భావించాయి. అదే విధంగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. గ్రూప్ దశలో దుబాయ్ వేదికగా 12 మ్యాచ్‌లు జరిగితే ఛేజింగ్ చేసిన జట్టే 11 మ్యాచుల్లో విజయం సాధించింది. ఈ సెంటిమెంట్ ఫైనల్ మ్యాచులోనూ రిపీట్ అవుతుందని ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ జట్టు కెప్టెన్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. టాస్ తమకు ఫేవర్‌గా రావాలని కోరుకుంటున్నారట..
దుబాయ్ వేదికగా ఈ మధ్యకాలంలో భారీ స్కోర్లు నమోదు కావడం లేదు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జట్టు తమ ప్రత్యర్థిని త్వరగా కట్టుదిట్టం చేయడం, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతియడంతో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు భారీ టార్గెట్ చేయలేకపోతుంది. పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్ వలన మొదటి బౌలింగ్ చేసిన జట్టుకు బెనిఫిట్ అవుతోంది. సెకండ్ డౌన్‌లో అదికాస్త స్పిన్నర్లకు అనుకూలంగా మారుతోంది. దీంతో తక్కువ స్కోర్ నమోదైతే చేజింగ్ దిగిన వారు ఈజీగా విజయం సాధిస్తున్నారు. చూడాలి మరి ఈ రోజు జరిగే ఫైనల్ మ్యాచ్ ఎవరికి రాసుందో..