RRR Movie : వై ఎస్ జగన్ ను కలవనున్న రాజమౌళి, ఎన్‌టిఆర్, రామ్ చరణ్.. కారణం ఇదేనా..!
RRR Movie : RRR ప్రాజెక్ట్ ఇండియాలో భారీ చిత్రంతో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఒకప్పుడున్న పరిస్థితుల్లో వారు పెట్టిన బడ్జెట్‌కు వచ్చే వసూళ్లకు ఏ డోకా లేదు. కానీ ఇప్పుడు ఏపీలో పరిస్థితులు మారిపోయాయి. టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉన్నాయి. దీంతో ఆర్ఆర్ఆర్ వంటి పెద్ద సినిమాల మీద భారీ దెబ్బ పడింది. ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ డీల్స్ అన్నీ కూడా సవరించాల్సి వస్తోంది.
ఈ క్రమంలో ఇంతకు ముందు నైజాం మినహాయించి ఏపీలోని అన్ని ప్రాంతాలకు కలిపి వంద కోట్లకు డీల్ ముగిసినట్టు తెలుస్తోంది.ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం టిక్కెట్ల రేట్లను దారుణంగా తగ్గించడంతో ఆ రేటుకు తాము కొనలేం, డిస్ట్రిబ్యూట్ చేయలేమని అంతా చేతులెత్తేశారట. అయితే డిస్ట్రిబ్యూటర్లతో ఆర్ఆర్ఆర్ యూనిట్ చర్చలు జరిపిందట. దాదాపు ఓ ఇరవై కోట్లు తగ్గించినట్టు తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రూమర్లు వినించాయి.

Rajamouli Ram Charan Jr NTR meet With Ys jagan
RRR Movie : రూమర్లను ఖండించిన ఆర్ఆర్ఆర్
టికెట్ రేట్లను ఇలా తగ్గించడంపై వైఎస్ జగన్ ప్రభుత్వం మీద కోర్టుకు వెళ్లేందుకు సిద్దమైందంటూ ఆర్ఆర్ఆర్ యూనిట్ మీద రూమర్లు వచ్చాయి.ఆ రూమర్లు కాస్తా జగన్ చెవితో పడితే మొదటికే మోసం వస్తుందని భయపడ్డ ఆర్ఆర్ఆర్ టీం ఓ ట్వీట్ వేసింది.
కోర్టుకు వెళ్లే ఉద్దేశ్యం మాకు లేదని, వైఎస్ జగన్‌కు కలిసి మా సమస్యను విన్నవించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్ఆర్ఆర్ అసలు విషయాన్ని చెప్పింది. దీంతో ఆర్ఆర్ఆర్ యూనిత్ తరుపున నిర్మాత దానయ్య, రాజమౌళి, హీరోలిద్దరూ కూడా జగన్‌ను త్వరలోనే కలుస్తారని టాక్ వినిపిస్తోంది. టికెట్ రేట్ల విషయంలో జగన్ మాత్రం వెనక్కి తగ్గడనే విషయం అందరికీ తెలిసిందే.