Intinti Gruhalakshmi 15 Dec Today Episode : తులసి ఇంటికి తాళం వేసి ఉన్నా పగులగొట్టి మరీ వెళ్లిన తులసి, సామ్రాట్.. ఈ విషయం ఊరివాళ్లకు తెలుస్తుందా? కోర్టు కేసు ఉన్న ఇంటిని తెరిచినందుకు ఏం చేస్తారు?
Intinti Gruhalakshmi 15 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 డిసెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 816 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి తన ఊరు మొత్తం తిరిగి చూస్తుంటుంది. సామ్రాట్ కు తన ఊరు విశేషాలన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇంతలో తను చిన్నప్పుడు ఉన్న ఇల్లు కనిపిస్తుంది. దీంతో అక్కడ ఆగిపోతుంది. అది తమ ఇల్లని చెబుతుంది తులసి. ఆ ఇల్లు తాళం వేసి ఉంటుంది. ఆ ఇంటి దగ్గరికి వెళ్లి చూస్తుంది తులసి. తనకు ఏడుపు వస్తుంది. సామ్రాట్ మాత్రం ఏం తెలియనట్టు నవ్వుతూ ఉంటాడు. ఇదేనా మీ పుట్టినిల్లు అని అడుగుతాడు సామ్రాట్. దీంతో అవును అంటుంది. ఇక్కడే మా తమ్ముడితో కలిసి దాడుగు మూతలు, తొక్కుడు బిళ్ల ఆడుకుంటూ ఉండేవాళ్లం. ఆడవాళ్ల ఆటలేంటి అని తమ్ముడిని, మగాళ్ల ఆటలేంటి అని నన్ను తిట్టినా అస్సలు పట్టించుకునేవాళ్లం కాదు. ఆ రోజులు ఇక రావు. మళ్లీ రావు. మరుపు రావు అని చెబుతుంది.
అయితే.. ఇంటికి సీల్ వేసి ఉందేంటి అని అడుగుతాడు సామ్రాట్. దీంతో అది మా దురదృష్టం అంటుంది తులసి. ఇల్లు లిటిగేషన్ లో ఉంది. ఇంకా కోర్టు కేసు నడుస్తోంది. తమ్ముడు ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. అందుకే ఈ ఊరి వైపు కానీ.. ఇంటి వైపు కానీ రావడం మానేశాం. ఆశ వదిలేసుకున్నాం. అయినా కూడా మనసున ఏదో ఒక మూల ఈ ఇంటి మెమోరీస్ గుర్తొస్తుంటాయి. ఈ మెమోరీస్ ఎప్పుడూ కన్నీళ్లు తెప్పిస్తుంటాయి. ఇప్పటికీ ఈ ఇంట్లో నా చిన్నతనం నాటి గుర్తులు, దాచుకున్న వస్తువులు ఇంకా ఉన్నాయి. కానీ.. కోర్టు కేసు తేలేవరకు ఆ ఇంట్లో అడుగు పెట్టకూడదని అన్నారు అంటుంది. దీంతో వెంటనే పక్కనే ఉన్న రాయిని తీసుకొని సామ్రాట్ ఆ ఇంటి తాళం పగులగొడతాడు. దీంతో ఏం చేస్తున్నారు సామ్రాట్ గారు. ఇలా ఇంటి తాళం పగులగొట్టారు అని అడుగుతుంది.
ఇది పెద్ద కేసు అండి. పోలీసులకు తెలిస్తే అస్సలు మనల్ని వదలరు.. వద్దు అంటుంది కానీ.. సామ్రాట్ అస్సలు వినడు. నాకు కావాల్సింది మీ సంతోషం. ఎటువంటి కేసు అయినా నేను చూసుకుంటాను. హ్యాపీగా లోపలికి వెళ్దాం రండి అని చెప్పి గేటు తెరుస్తాడు సామ్రాట్.
ఓవైపు తులసికి టెన్షన్ పట్టుకుంటుంది. ఎట్నుంచి ఎవరు వస్తారో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. దీంతో చెప్పా కదా.. మీరు భయపడకండి. మీ అంతట మీరే లోపలికి వెళ్తారా? లేక చేయి పట్టుకొని తీసుకెళ్లమంటారా? చాయిస్ మీదే అంటాడు సామ్రాట్. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు.
తప్పని పరిస్థితుల్లో ఇంట్లోకి అడుగు పెడుతుంది తులసి. మరోవైపు అంకిత ఆసుపత్రికి బయలుదేరుతుండగా కింద తన పేషెంట్స్ కనిపిస్తారు. వాళ్లను చూసి అదేంటి కింద కూర్చున్నారు అని అడుగుతుంది అంకిత. దీంతో పర్లేదు అమ్మ. ఇదేమీ హాస్పిటల్ కాదు కదా అంటారు.
Intinti Gruhalakshmi 15 Dec Today Episode : లాస్య చేసిన పని తెలుసుకొని షాక్ అయిన అంకిత
ఎవరు చెప్పారు మిమ్మల్ని కింద కూర్చోమని. రండి.. ఇక్కడ కూర్చోండి. పర్లేదు అంటుంది అంకిత. ఏమైంది అని అడిగితే.. రాత్రి నుంచి ఒళ్లంతా నొప్పులు, జ్వరం అని చెబుతాడు. దీంతో తనను చెక్ చేస్తుంది అంకిత. ఏదైనా మంచి మందు ఇవ్వండి అంటాడు.
దీంతో జ్వరం తగ్గడానికి కనీసం మూడు రోజులు పడుతుంది. ఈ ట్యాబ్లెట్లు మూడు రోజుల పాటు రోజూ ఉదయం, సాయంత్రం వేసుకోండి అని అంటాడు. ఆ తర్వాత మీరు డబ్బులు తీసుకున్నారు కదా.. ఎంతైందో చెబితే పాత డబ్బులు కూడా కొన్ని కొన్ని తీరుస్తాం అని అంటారు.
దీంతో నేను డబ్బులు తీసుకున్నానా.. నేను తీసుకోలేదే.. అని అంటుంది. దీంతో ఇంతకుముందు ఒక ఆవిడ నల్ల చీర కట్టుకొని వచ్చి డబ్బులు తీసుకుంది అని చెబుతుంది. దీంతో ఇదంతా లాస్య ఆంటి పనా అని అనుకుంటుంది. వాళ్లకు రూ.500 ఇచ్చి మీ ఆయనకు పండ్లు తీసుకెళ్లు అంటుంది.
ఇంట్లో అడుగుపెట్టాక.. భావోద్వేగానికి గురవుతుంది తులసి. తన చిన్ననాటి గురుతులు అన్నీ గుర్తొస్తాయి. చిన్నప్పటి మెమోరీస్ ను గుర్తు చేసుకొని కంటతడి పెడుతుంది. తులసి కోట పాడుపడి పోయి ఉంటే.. దాన్ని క్లీన్ చేస్తుంది తులసి. దానికి నీళ్లు పోస్తుంది.
ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లాలనుకున్నా ఇంటికి తాళం వేసి ఉంటుంది. దీంతో దీన్ని కూడా పగులగొట్టేద్దాం అంటాడు సామ్రాట్. దీంతో మీరు ఇంత రౌడీ అనుకోలేదు అంటుంది తులసి. అవునా.. నేను హీరోను అనుకున్నానే అంటాడు సామ్రాట్. తర్వాత ఇంట్లోకి వెళ్లి తన చిన్ననాటి వస్తువులు ఉన్న పెట్టెను చూసుకుంటుంది తులసి. చూసుకొని మురిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.