Intinti Gruhalakshmi 17 Nov Today Episode : అందరినీ వదిలేసి తన పుట్టిన రోజు నాడు తులసి ఇంటికి వెళ్లిన పరందామయ్య.. అక్కడికి వచ్చి తులసికి షాకిచ్చిన అనసూయ
Intinti Gruhalakshmi 17 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 నవంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 792 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి, సామ్రాట్ ఇద్దరూ కలిసి టెన్షన్ తగ్గాక ఇక తినడం మొదలు పెడతారు. ఇద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకోవడం చూసి ప్రేమ్.. ఇదే నేను కోరుకునేది అని అనుకుంటాడు. మరోవైపు పరందామయ్యతో మాట్లాడటానికి ట్రై చేస్తుంది అనసూయ. మీరు నన్ను దూరం పెట్టారు. కోపంలో మీరు నన్ను ఇప్పుడు దూరం పెడితే.. కోపం తగ్గాక నాతో మాట్లాడాలని అనుకున్నా సరే.. అప్పటికి నేను ఉంటానో ఉండనో అంటుంది అనసూయ. మన నందు మీ పుట్టిన రోజు వేడుకను ఘనంగా చేయాలనుకున్నాడు. ఎందుకిలా చేశారు అని నేను అడగను. మీరూ చెప్పకండి. కానీ.. నందు బాధపడుతున్నాడు. బాధతో ఊరెళ్లిపోయాడు. ఇవి వాడు మీకోసం కొన్న బట్టలు. కేక్ కట్ చేయించలేకపోయాను. కనీసం బట్టలు అయినా వేసుకుంటారని ఇచ్చాడు. వాడి తరుపున నేనే ఇచ్చాను. మీరంటే వాడికి చాలా ఇష్టం. ఈ బట్టలు వేసుకుంటే వాడు చాలా సంతోషిస్తాడు. కనీసం మీ పుట్టిన రోజు నాడు అయినా వాడిని సంతోషపెట్టండి. దయచేసి ఇవి తీసుకోండి. కాదనొద్దు అంటుంది అనసూయ.
ఈ బట్టలు తీసుకోకపోతే నాన్న అని పిలిచే హక్కును మీరు వాడి నుంచి లాక్కున్నట్టే అంటుంది అనసూయ. దీంతో పరందామయ్య ఆ బట్టలను తీసుకుంటాడు. ఒక్కనిమిషం అని తనను ఆశీర్వదించండి అంటుంది. కొత్త బట్టలు వేసుకొని రండి.. నేను వెయిట్ చేస్తుంటాను అంటుంది అనసూయ. మరోవైపు లాస్య దగ్గరికి వెళ్లి నువ్వొక్కదానివే కాఫీ తాగడం కాదు.. మామయ్య గారికి కూడా ఇవ్వు అంటుంది అనసూయ. మామయ్య గారు నా చేతి కాఫీ తాగుతారా అంటుంది లాస్య. దీంతో తాగుతారు.. ఎందుకు తాగరు. నందు ఇచ్చిన బట్టలు కూడా వేసుకున్నారు. ఇది చేయండి అంటే చేస్తారు.. ఇది వద్దు అంటే ఊరుకుంటారు అంటుంది అనసూయ. దీంతో ఇక నుంచి మామయ్య గారిని చేయి జారనీయొద్దు. మంచిగా చూసుకోవాలి అంటుంది లాస్య. మామయ్య గారు ఏరి.. ఇంకా రాలేదు అంటుంది లాస్య. దీంతో వస్తారులే. పూజకు అన్ని ఏర్పాట్లు చేయి. మళ్లీ మనకు మంచి రోజులు మొదలయినందుకు దేవుడికి హారతి ఇచ్చి మళ్లీ కొత్త జీవితాన్ని మొదలుపెడదాం అంటుంది అనసూయ.
దీంతో సరే అంటుంది లాస్య. వెంటనే నందుకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి. ఇదంతా నా క్రెడిటే అని చెప్పాలి. నందు చాలా సంతోషిస్తాడు అని అనుకుంటుంది లాస్య. వెంటనే ఫోన్ చేస్తుంది. కానీ.. నందు ఫోన్ లిఫ్ట్ చేయడు. దీంతో ఇంకా నిద్రలేచి ఉండడా అని అనుకుంటుంది.
కాల్ లిఫ్ట్ చేస్తే ఏం చేస్తున్నావు. ఎప్పుడు వస్తావు అంటూ పీక్కుతింటుంది అని అనుకుంటాడు నందు. నాన్న పరిస్థితి చూడలేక ఒకవిధంగా నేను పారిపోయానువ. ఆయన మారాలంటే తులసి అయినా అక్కడికి వెళ్లాలి. లేదా తులసి దగ్గరికి అయినా నాన్న వెళ్లాలి అని అనుకుంటాడు నందు.
Intinti Gruhalakshmi 17 Nov Today Episode : తులసి గురించే ఆలోచించిన నందు
తులసి గురించి ఎంత వద్దు అనుకున్నా ఆమె గురించే ఆలోచించాల్సి వస్తోంది. ఎందుకు తులసి గురించి ఎక్కువ రియాక్ట్ అవుతున్నాను అని అనుకుంటాడు నందు. మరోవైపు సామ్రాట్ ఇంకా బర్త్ డే పార్టీలో జరిగిన విషయం గురించే ఆలోచిస్తుంటాడు. దీంతో ఏమైంది అని అడుగుతుంది తులసి.
మనం హ్యాపీగా నవ్వుకున్న ప్రతిసారీ మనకు దిష్టి తగులుతోంది అంటాడు. బాధలో ఉన్నప్పుడు ఎలాగూ బాధపడాలి. అలాగే సంతోషంగా ఉన్నప్పుడు సంతోషపడాలి కానీ.. గతంలో ఉన్న బాధలను గుర్తు తెచ్చుకొని బాధపడటం ఏంటి.. అని అంటుంది.
చావును తలుచుకుంటూ ఎవ్వరం బతకం కదా. జరగాల్సింది ఎలాగూ జరిగి తీరుతుంది.. అంటుంది తులసి. సామ్రాట్ గారిని ఆదర్శంగా తీసుకో అని ప్రేమకు చెబుతుంది. పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో అని అసలు పెళ్లే చేసుకోలేదు. అది పాజిటివ్ గా ఆలోచించడం అంటే అంటుంది తులసి.
అవును.. మీరు నన్ను పొగిడారా.. తిట్టారా అంటాడు సామ్రాట్. దీంతో తులసి, ప్రేమ్ ఇద్దరూ నవ్వుతారు. ఏదో సరదాకు అన్నాను అంటుంది. మాటల్లో పడి మరిచిపోయాను. టైమ్ అవుతోంది. టేబుల్స్, చైర్ తీసి పక్కన పెట్టు. పంతులు గారు వచ్చే టైమ్ అయింది అంటుంది తులసి.
మీ తాతయ్య పుట్టిన రోజు కదా. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ పూజ చేయిస్తున్నాను అంటుంది తులసి. ఇంట్లో పరిస్థితుల వల్ల ఆయన చాలా ఆందోళనగా ఉంటున్నారు అంటుంది. నాకంటే ఆయనే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. నానమ్మతో కూడా సరిగా మాట్లాడటం లేదు అని ప్రేమ్ తో అంటుంది.
ముందే చెబితే తాతయ్యను కూడా తీసుకొచ్చేవాడిని కదా అంటాడు ప్రేమ్. దీంతో అది కుదిరే పని కాదు. నా జాగ్రత్త నాది. నా భయం నాది. రాత్రి ఇంట్లో చెప్పాపెట్టకుండా వచ్చినందుకే ఎంత పెద్ద గొడవ అయిందో తెలుసు కదా. మళ్లీ అలా జరగకూడదు. మంచి జరగాలని పూజ చేసుకుంటూ లేని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. ఆయన ఎక్కడున్నా ఆ దేవుడి ఆశీస్సులు ఉంటే చాలు అంటుంది తులసి.
మరోవైపు పరందామయ్య.. కొత్త బట్టలు వేసుకొని బయటికి వస్తాడు. పూజ దగ్గరికి వస్తాడు. పూజ స్టార్ట్ అవుతుంది. ఈరోజు మొత్తం సంబురాలే అంటుంది అనసూయ. ఇంతలో నాన్న అంటూ మాధవి వస్తుంది. నాన్నగారి పుట్టిన రోజుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది అనసూయ.
పరందామయ్యకు లడ్డు తినిపించి ఆయన ఆశీర్వాదం తీసుకుంటుంది మాధవి. ఆ తర్వాత నేను తులసి దగ్గరికి వెళ్తాను అని చెప్పి పరందామయ్య వెళ్లబోతుండగా మేము కూడా వస్తాం అని అందరూ ఆయన వెంట బయలుదేరుతారు. మరోవైపు తులసి పూజ చేయిస్తుంటుంది.
మీరు ఎవరి కోసం పూజ చేయిస్తున్నారో ఆయన వస్తే బాగుంటుంది అంటాడు. మా మామయ్య గారి కోసం ఈ పూజ చేయిస్తున్నాను కానీ.. ఆయన అందుబాటులో లేరు అంటుంది తులసి. దీంతో నీకు తప్ప ఆ అర్హత ఇంకెవరికీ లేదమ్మా అంటాడు.
పరందామయ్యను చూసి షాక్ అవుతుంది తులసి. మామయ్య అంటూ ఆయన దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.