Intinti Gruhalakshmi 18 July Today Episode : హనీ గోల్డ్ చైన్ ను తులసే దొంగలించిందా? సామ్రాట్ కు అది సెంటిమెంట్ చైన్.. దాని కోసం సామ్రాట్ ఏం చేస్తాడు?
Intinti Gruhalakshmi 18 July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 జులై 2022, సోమవారం ఎపిసోడ్ 687 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా సంగీతం క్లాస్ లకు రూమ్ రెంట్ కు ఇస్తారేమో అని కనుక్కోవడం కోసం నిన్న వెళ్లడం కుదరలేదు కదా. ఇవాళ వెళ్తా అని అంటుంది. దాని కోసం ఫోన్ చేస్తుంది టీచర్ కు. దీంతో మీరు నిన్ననే వస్తా అన్నారు కదా. ఎందుకు రాలేదు అని అంటుంది. నిన్న నాకు కుదరలేదు అని అంటుంది తులసి. ఆ విషయం మీరు ఫోన్ చేసి అయినా చెప్పొచ్చు కదా. మీ ఆటిట్యూడ్ మా మేనేజ్ మెంట్ కు నచ్చలేదు అంటుంది ప్రిన్సిపల్. ఇంతలో హనీ అక్కడికి వస్తుంది. నా వల్ల తప్పు జరిగింది ఆంటి. మా నాన్న మిమ్మల్ని చాలా మాటలు అన్నాడు. పోలీస్ స్టేషన్ లో పెట్టాడు. సారీ చెబుదామని వచ్చాను అంటుంది. ఇంట్లో చెప్పి వచ్చావా అని అడుగుతుంది తులసి. దీంతో మా తాతయ్య మీ అడ్రస్ ఇచ్చారు అంటుంది హనీ. నువ్వు ఎప్పుడైనా రావచ్చు కానీ.. నువ్వు ఒక్కదానివి రాకు. మీ పెద్దవాళ్లతో రా. అర్థం అయిందా అని అంటుంది తులసి.
దీంతో సరే వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి హనీ వెళ్తూ అక్కడ గులాబీ చెట్టు దగ్గర గులాబీ పువ్వు తెంపి.. వెళ్లబోతుండగా తన చైన్ కిందపడిపోతుంది. మరోవైపు సామ్రాట్.. తన బాబాయికి ఫోన్ చేసి ఎందుకు తులసి మీద నీకు అంత సాఫ్ట్ కార్నర్ అని అడుగుతాడు. దీంతో తులసి చాలా మంచిది అని చెబుతాడు బాబాయి. సరే.. నేను ముంబై నుంచి వచ్చాక అన్ని విషయాలు చెబుతాను అని చెప్పి సామ్రాట్ చెప్పినా వినకుండా ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత హనీ ఇంటికి వస్తుంది. తనను చూసి సామ్రాట్ సంతోషిస్తాడు. కానీ.. తన మెడలో చైన్ ఉండదు. దీంతో షాక్ అవుతాడు. ఏమైంది అని అంతటా వెతుకుతాడు కానీ.. దొరకదు. దీంతో కారు డ్రైవర్ ను పిలిచి అడిగితే స్కూల్ కు వెళ్లేటప్పుడు బుక్స్ కోసం మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్లావు కదా అని అడుగుతాడు డ్రైవర్. దీంతో తులసే చైన్ ను దొంగతనం చేసిందని భావిస్తాడు సామ్రాట్.
వెంటనే హనీని తీసుకొని తన పనివాళ్లతో కలిసి తులసి ఇంటికి వస్తాడు. జైలులో చిప్పకూడు తిన్నావు. అయినా బుద్ధి రాలేదా అని అంటాడు సామ్రాట్. నువ్వు దొంగతనం చేసిన మా పాప గోల్డ్ చైన్ స్పాట్ లో తిరిగి ఇవ్వాలి అని అడుగుతాడు సామ్రాట్.
Intinti Gruhalakshmi 18 July Today Episode : గార్డెన్ లో దివ్యకు దొరికిన హనీ చైన్
దీంతో గోల్డ్ చైన్ ఏంటి.. నేను తిరిగి ఇవ్వడం ఏంటి అని అంటుంది తులసి. ఈ యాక్టింగ్ చూసే మా బాబాయి నిన్ను అమాయకురాలు అని చెప్పి నిన్ను వదిలేశాడు. మార్నింగ్ హనీ మీ ఇంటికి వచ్చింది. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆ గోల్డ్ చైన్ లేదు. అంటే అర్థం ఏంటి.. అని అంటాడు సామ్రాట్.
చైన్ ను తులసే దొంగతనం చేసింది. పాపనే కిడ్నాప్ చేసిన వ్యక్తికి చైన్ కొట్టేయడం ఒక లెక్కా అని అంటాడు. దీంతో మీరు వంద సార్లు అడిగినా ఆ చైన్ గురించి నాకు తెలియదు అంటుంది తులసి. దీంతో పని వాళ్లను పిలిచి ఇల్లంతా వెతకండి అంటాడు సామ్రాట్.
ఏంటి సామ్రాట్ గారు ఇది. మీ ఆలోచన ధోరణి మారదా? అవే ఆలోచనలు.. అవే నిందలు.. మారరా అని ప్రశ్నిస్తుంది తులసి. మారాల్సింది మీరు.. మేము కాదు. గడ్డి తినే మనుషులు అంటాడు. దానికి డబ్బులు ఎంతవుతాయో చెప్పు మీ మొహాన కొడతాం అంటుంది అంకిత.
దీంతో షటప్.. అది మామూలు గొలుసు కాదు. నా చెల్లెలు జ్ఞాపకం అంటాడు సామ్రాట్. మొత్తం ఇల్లంతా వెతికిస్తాడు సామ్రాట్. కానీ.. ఎక్కడా చైన్ కనిపించదు. దీంతో అదే విషయం సామ్రాట్ కు చెబతారు. చైన్ లేదంటారు. దీంతో మా సామాన్లు అన్నీ తిరిగి సర్ది వెళ్లమని చెప్పండి అంటుంది తులసి.
దీంతో నువ్వు చాలా తెలివైన దొంగవు. ఇంకో గంటలో మా గోల్డ్ చైన్ మాకు తెచ్చివ్వు. లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు సామ్రాట్. మరోవైపు సామ్రాట్ అంటే నందు భయపడుతుంటాడు. దీంతో నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటుంది లాస్య.
మరోవైపు గార్డెన్ లో దివ్యకు చైన్ దొరుకుతుంది. ఆ చైన్ ఇదేనేమో అని అనుకొని వెంటనే దాన్ని తులసికి ఇస్తుంది. ఇదే హనీ చైన్ అయి ఉంటుంది. పాప చూసుకోలేదు ఏమో అని అంటుంది తులసి. వెంటనే వెళ్లి ఆ చైన్ ను ఇచ్చేద్దామని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.