Intinti Gruhalakshmi 18 May Today Episode : ఉద్యోగం పోయిన బాధలో నందు షాకింగ్ నిర్ణయం.. తులసిని మ్యూజిక్ టీచర్ గా చూసి లాస్య షాక్
Intinti Gruhalakshmi 18 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 మే 2022, బుధవారం ఎపిసోడ్ 635 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్యతో పరందామయ్య చెస్ ఆడుతుంటాడు. దివ్యను పరందామయ్య ఓడించొద్దని.. పరందామయ్యనే తులసి ఓడిస్తుంది. నీలో ఇంత మార్పా.. నీ ఆట తీరు మారింది.. నీ ఆలోచనల తీరు కూడా మారిందమ్మా అంటాడు పరందామయ్య. ఎందుకో కానీ.. నాకు ఇప్పుడు కొత్త జీవితం మొదలయినట్టు అనిపిస్తోంది. ఏ ఒక్క క్షణాన్ని వృథా చేసుకోను అంటుంది తులసి. తులసిలో వచ్చిన ఈ మార్పును చూసి పరందామయ్య, అనసూయ ముచ్చటపడతారు. ఆ తర్వాత తాను సంగీతం టీచర్ గా పనిచేయబోతున్నట్టు తులసి వాళ్లకు చెబుతుంది.
దీంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తారు. తులసికి స్వీట్లు తినిపిస్తుంది దివ్య. మరోవైపు శృతి.. ప్రేమ్ తో మాట్లాడదు. కోపంగా ఉంటుంది. ఏమైంది అని అడుగుతాడు. సారీ శృతి అంటాడు. ఏదో కోపంలో అరిచేశాను అంటాడు ప్రేమ్. దీంతో చేశాల్సింది అంతా చేసేసి.. అనాల్సింది అంతా అనేసి ఇప్పుడు సారీ అంటే అయిపోయిందా అంటుంది శృతి. ఒక్కొక్కసారి జీవితాన్ని కూడా కోలుకోలేనంత దెబ్బ తీస్తుంది. ఇంటి ఓనర్ మీద అరిస్తే వాళ్లెందుకు ఊరుకుంటారు అని అంటుంది శృతి. ఇంతలో ఇంటి ఓనర్, తన భార్య ఇద్దరూ వస్తారు.
వెంటనే ఇల్లు ఖాళీ చేయండి అని అంటుంది ఇంటి ఓనర్. దీంతో ప్రేమ్, శృతి షాక్ అవుతారు. సామాన్లు మీరే తీసేస్తారా.. మమ్మల్ని విసిరేయమంటారా అంటాడు. వెంటనే లోపలికి వెళ్లి సామాన్లు బయట పడేసేలోపు.. అంకుల్ తప్పు అయిపోయింది. నోరు జారాను.. ఇంకోసారి అలాంటి పొరపాట్లు చేయను అంటాడు ప్రేమ్.
Intinti Gruhalakshmi 18 May Today Episode : నందు కేఫ్ లో గొడవ
మరోవైపు కేఫ్ ఓనర్ ఓ వ్యక్తితో గొడవ పెట్టుకుంటాడు. ఇద్దరిని వెళ్లి నందు ఆపుతాడు. ఏమైంది అని అడుగుతాడు. నువ్వెందుకు వచ్చావు అని అంటాడు. 24 గంటల్లో ఈ ప్లేస్ ఖాళీ చేయి. లేకపోతే నువ్వు ఎలా ఖాళీ చేయవో నాకు బాగా తెలుసు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు వాళ్ల అన్నయ్య.
ఆస్తి పంపకాల్లో వాడి వాటాగా ఈ ప్లేస్ మా అన్నయ్యకు వెళ్లింది అని చెబుతాడు తన ఫ్రెండ్. దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటాడు తన ఫ్రెండ్. ఒరేయ్ నందు.. కేఫ్ ఖాళీ చేయడం తప్ప నాకు వేరే దారి లేదు. మా అన్నయ్య ఇంత మొండిగా ఉంటాడని నేను అనుకోలేదు అంటాడు.
ఇక తప్పదు వేరే జాబ్ చూసుకో అంటాడు. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు. కట్ చేస్తే సంగీత.. పిల్లల ఇంటికి వెళ్తుంది. వాళ్లకు సంగీత సాధన చేయిస్తూ ఉంటుంది. ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది. ఎవరు.. ఆ సంగీతం టీచర్. భలేపాడుతోంది అంటుంది లాస్య.
ఆవిడ గొంతు వింటుంటే నాకూ సంగీతం నేర్చుకోవాలనిపిస్తోంది అంటుంది లాస్య. లోపలికి వెళ్లి చూడగానే అక్కడ లాస్య.. తులసిని చూసి షాక్ అవుతుంది. సో… ఇంటింటికి తిరుగుతూ సంగీతం చెప్పుకుంటన్నావన్నమాట. నా మాటే శాసనం అంటూ రాణిలా రాజ్యమేలావు. ఒక వెలుగు వెలిగావు. ఇప్పుడు ఏమైంది అంటూ తులసిని లాస్య తిడుతుంది.
ఇప్పటికైనా పొగరు తగ్గిందా లేక అదే రేంజ్ మెయిన్ టెన్ చేస్తున్నావా అంటుంది లాస్య. అది పొగరు కాదు.. ఆత్మాభిమానం అంటుంది తులసి. కట్ చేస్తే ఇంటికి వచ్చాక లక్కీని భోజనం తినిపిస్తుంటుంది లాస్య. నన్ను ఇక హాస్టర్ పంపించకు అంటాడు లక్కీ.
నీ గురించి పట్టించుకునే టైమ్ మా ఇద్దరికీ ఉండదు కదా.. అందుకే హాస్టల్ కు పంపిస్తున్నా అంటుంది. ఇంతలో నందు వచ్చేస్తాడు. మూడీగా ఉంటాడు. ఏమైంది అని ప్రశ్నిస్తుంది లాస్య. తనకు ఉద్యోగం పోయింది అని చెబుతాడు నందు. దీంతో లాస్య షాక్ అవుతుంది.
లక్కీ చప్పట్లు కొడతాడు. ఎంతైనా ఇప్పుడు అంకుల్ ఫ్రీనే కదా. నన్ను దగ్గరుండి చూసుకోవచ్చు. నేను ఇక హాస్టల్ కు వెళ్లాల్సిన పని లేదు అని అంటాడు లక్కీ. దీంతో నందుకు తీవ్రంగా కోపం వస్తుంది. దీంతో షట్ అప్ అంటాడు నందు. నోర్మూసుకుంటావా అంటాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.