Intinti Gruhalakshmi 2 March Today Episode : అభిని విడిపించింది జీకే గారు.. తులసి కాదన్న నందు.. శశికళ అప్పు విషయంలో మరోసారి ఇంట్లో గొడవ.. దీంతో తులసి షాకింగ్ నిర్ణయం
Intinti Gruhalakshmi 2 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 మార్చి 2022, బుధవారం ఎపిసోడ్ 569 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అభిని తీసుకొని తులసి వచ్చాక… అందరూ సంతోషిస్తారు. ఇంతలో ప్రేమ్ వస్తాడు. నన్ను వేరు చేశారా. ఇంత జరిగినా నాకు ఒక్క మాట కూడా చెప్పరా అంటూ ప్రేమ్ ప్రశ్నిస్తాడు. దీంతో నీకే కాదురా.. మాకు కూడా చెప్పకుండానే చాలా పనులు చేసింది అని అంటుంది అనసూయ. అభి మారాడు అదే చాలు. నేను పడ్డ కష్టం మొత్తం మరిచిపోతాను అని అనుకుంటుంది తులసి. మరోవైపు అభి.. మూడీగా తన రూమ్ లో కూర్చుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన అంకిత.. ఇంకా జరిగిన వాటినే తలుచుకుంటున్నావా అంటుంది అంకిత.
ఎలా మరిచిపోగలను అంకిత. చెప్పిన మాట వినకుండా.. అందరినీ బాధపెట్టాను. అయినా కూడా ఎవ్వరూ పల్లెత్తు మాట అనలేదు. ఎందుకు అంకిత. నువ్వైనా నన్ను తిట్టు.. ప్లీజ్ అంటాడు. దీంతో తిడుతాను. దాని వల్ల ఏంటి లాభం అభి అంటుంది అంకిత. గిల్టీ ఫీలింగ్ పోతుంది. చేసిన తప్పును మరిచిపోతాను అంటాడు అభి. నిజం చెప్పాలంటే నువ్వు చేసింది మామూలు తప్పు కాదు. ఆ తప్పును.. ఆ తప్పు వల్ల జరిగిన విషయాన్ని నువ్వు జీవితాంతం మరిచిపోకూడదు. అప్పుడే నువ్వు దాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటావు అని చెబుతుంది అంకిత.
ఇప్పుడు నువ్వు పడే బాధ కంటే.. నేను, ఆంటి వెయ్యి రెట్లు ఎక్కువ బాధపడ్డాం. అయినా మేము ప్రేమను చంపుకోలేదు. నీ కర్మకు నిన్ను వదల్లేదు.. అంటుంది అంకిత. నిన్ను కనడానికి పడిన నొప్పుల కంటే నిన్ను రక్షించుకోవడానికి ఆంటీ పడిన నొప్పులే ఎక్కువగా ఉన్నాయి.. అంటుంది అంకిత.
మరోవైపు ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. నువ్వు చేసిన పని మామూల్ది కాదమ్మా అని పరందామయ్య తులసిని అభినందిస్తాడు. అందరూ అదే అంటారు. కానీ.. నేనేదో గొప్పల కోసం ఈ పని చేయలేదు. నా కొడుకు కోసం ఈ పని చేశాను అంటుంది తులసి.
తను అనుకుంటే ఏదైనా సాధించగలదు అని తులసిని పరందామయ్య పొగుడుతాడు. తన లాంటి ఎంతో మందికి అమ్మ ఆదర్శంగా నిలిచింది అంటాడు ప్రేమ్. దీంతో నందు, లాస్యకు చిరాకు వస్తుంది. ఇక ఆపుతారా.. పోటీ పడి మరీ తులసిని పొగుడుతున్నారు కదా.. అంటాడు.
Intinti Gruhalakshmi 2 March Today Episode : నందు, ప్రేమ్ మధ్య గొడవ.. ఎక్కడికి దారి తీస్తుంది
అభిని విడిపించడంలో జీకే గారు సాయం చేశారని తులసి చెప్పింది కదా. ఆయన పూనుకోవడం వల్లే అభి రిలీజ్ అయ్యాడు. అది జీకే వల్ల అయింది కానీ.. తులసి వల్ల కాదు అంటాడు ప్రేమ్. ఈవిడ గారు అభిని కాపాడినంత మాత్రాన గొప్పది అవుతుందా.. దేవత అయిపోతుందా అంటాడు నందు.
రేపో మాపో అప్పు తీర్చమంటూ శశికల ఇంటి మీద పడుతుంది. తులసి ఏమైనా అనుకుంటే సాధించి తీరుతుందని గొప్పలు చెప్పుకుంటారు కదా. తనను ఆ అప్పు తీర్చమని చెప్పండి అంటాడు నందు. ఆవిడ దేవత అని నేను ఒప్పుకుంటాను.. అంటాడు నందు.
ఏంటి.. అందరూ నందును దోషిని చూసినట్టు చూస్తున్నారు. మంచిగా ఉన్న నందును రెచ్చగొట్టడం ఎందుకు. నన్ను, నందును ఎందుకు బలవంతం చేస్తారు.. అంటుంది లాస్య. పైసా ఖర్చు లేని పని చేసి పొగిడించుకున్నంత వరకు కాదు.. అప్పు తీర్చడం అంటే అంటాడు నందు.
నా బిడ్డ సమస్య నాది.. నా సొంతం.. నా బాధ్యత. కానీ.. ఈ ఇంటి మీద అప్పు అందరి బాధ్యత. ఇంతకుముందే చెప్పాను. డబ్బు తేవడం చేతగాక వంకర మాటలు మాట్లాడకండి. 20 లక్షల వాటా చొప్పున ఎవరి వాటా వాళ్లు తేవాల్సిందే. ఈ విషయంలో ఎవరి మాటా వినేది లేదు.. వెనక్కి తగ్గేది లేదు… అంటుంది తులసి.
తండ్రిగా ఎలాగూ అభి విషయంలో ఓడిపోయారు కనీసం.. కొడుకుగా అయినా గెలవండి అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు నందు దగ్గరికి వెళ్లిన ప్రేమ్.. అసలు ఏంటి మీ ప్రాబ్లమ్ అంటాడు ప్రేమ్. మీ అమ్మేరా నాకు ప్రాబ్లమ్ అంటాడు నందు.
మీరు గొంతు చించుకొని అరవాల్సిన పెద్ద తప్పులు అమ్మ ఏం చేసింది.. అంటాడు. నా తప్పుల దగ్గరికి వచ్చేసరికి నీకు కనిపిస్తున్నాయి. మీ అమ్మ తప్పులు నీకు కనిపించడం లేదా అంటాడు నందు. అభిని సేవ్ చేసిందని నెత్తిన మోస్తున్నారు కానీ.. వాడు అలా కావడానికి కారణం తులసే కదా.. అంటాడు నందు.
నేను చేతగాని దాన్నా మామయ్యా. ఈ వయసులో మీరు వేరే వాళ్లను దేహీ అని అడగాలా మామయ్య అంటుంది. ఏం చేయాలి అమ్మా. ఇలాంటి కొడుకును కన్నందుకు నేను బాధపడుతున్నానమ్మా అంటాడు పరందామయ్య. నువ్వు మాత్రం ఎంత భారం మోస్తావు.. అంటాడు. అందుకే స్నేహితుడిని అప్పు అడిగాను అంటాడు పరందామయ్య.
నాకు తోడుగా మీరందరూ ఉన్నారు మామయ్య అంటుంది తులసి. శశికల ఇచ్చిన గడువు ఇంకా పూర్తి కాలేదు మామయ్య అంటుంది తులసి. కష్టమో కానీ.. ఎంతో కొంత డబ్బు సర్ది శశికల కాళ్లో గడ్డమో పట్టుకొని ఇంకొంచెం టైమ్ కావాలని అడుగుతాను.. అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.