Intinti Gruhalakshmi 22 Nov Today Episode : మేము లక్కీని తమ్ముడిగా ఒప్పుకోం అని చెప్పిన ప్రేమ్.. లక్కీ విషయంలో నందు, లాస్య మధ్య గొడవ

0
Advertisement

Intinti Gruhalakshmi 22 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 నవంబర్, 2021 ఎపిసోడ్ 483 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లక్కీ విషయంలో మీరు ఎందుకు మధ్యలో వెళ్తున్నారు ఆంటి.. అంటుంది శృతి. గొడవ నాన్న, లాస్య మధ్య కదా.. వాళ్ల మధ్యలో ఎందుకు అమ్మ వెళ్లడం అంటాడు ప్రేమ్. ఏ బంధం విడిపోయినా తల్లీకొడుకుల బంధం విడిపోకూడదు.. అంటుంది తులసి. లాస్యకు భర్తను అవుతాను.. కానీ.. లక్కీకి తండ్రిని కాను అంటే ఎలా కుదురుతుంది అంటుంది లాస్య.

Intinti gruhalakshmi 22 november 2021 full episode
Intinti gruhalakshmi 22 november 2021 full episode

అంటే నువ్వు చెప్పేది ఏంటి.. రేపు నాన్న లక్కీ తండ్రిగా ఒప్పుకుంటే.. నేను నా తమ్ముడిగా ఒప్పుకోవాలా అంటాడు ప్రేమ్. అవును.. తొందరగా అర్ధం చేసుకున్నావురా అంటుంది తులసి. అది ఎలా కుదురుతుంది అమ్మ.. అంటుంది. నా పిల్లల భవిష్యత్తు చెడిపోకూడదు అని నేను ఎంతగానే తాపత్రయపడ్డాను కానీ.. మీ నాన్న తప్పు చేశాడని గ్రహించలేకపోయాను. జీవితంలో ఓడిపోయాను.. అంటుంది తులసి. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటాడు ప్రేమ్. జీవితం ఎలా ఉంటే అలా ఒప్పుకోవడం మొదలు పెడితే ప్రతిక్షణం సంతోషంగా ఉండొచ్చు అని చెబుతుంది తులసి.

మరోవైపు నందు లాప్ టాప్ లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో లక్కీ అక్కడికి వస్తాడు. లక్కీని చూస్తాడు నందు. వీడు మళ్లీ వస్తున్నాడు. ఈ లాస్య లేనిపోని తలనొప్పులు తీసుకొచ్చి మెడకు చుట్టింది అని అనుకుంటాడు. ఇంతలో తులసి వస్తుంది. అరె.. ఇంత తొందరగా రెడీ అయ్యావా? వెరీ గుడ్ అంటుంది తులసి.

హాస్టల్ లో అన్నీ టైమ్ కే ఉంటాయి కదా. అందుకే రెడీ అయ్యా.. అంటాడు లక్కీ. సరే గానీ నీకోసం పాస్తా చేశా అంటుంది తులసి. వన్ మినట్ ఆంటి.. డాడీకి నేనంటే ఇష్టమో లేదో కనుక్కొని వస్తాను అంటాడు లక్కీ. నేను మిమ్మల్ని డాడీ అని పిలిస్తే మీకు నచ్చదా? మమ్మీ చెప్పింది మీకు నేనంటే చాలా ఇష్టమని. నేనిక్కడికి వస్తున్నానని తెలిసి మీరు హ్యాపీగా ఫీలయ్యారని మమ్మీ చెప్పింది.

Intinti Gruhalakshmi 22 Nov Today Episode : నందును రిక్వెస్ట్ చేసిన లక్కీ

నేనంటే ఇష్టం అయినప్పుడు మరి నామీద ఎందుకు అంత కోపంగా ఉన్నారు. నేనేమైనా తప్పుచేశానా డాడీ. చిన్నపిల్లాడిని కదా డాడీ. తెలియకుండా ఏదో తప్పు చేసే ఉంటాను. సారీ అంటాడు లక్కీ. ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది. వేరే ఏదైనా పనిష్ మెంట్ ఇవ్వండి డాడీ కానీ.. నాతో మాట్లాడండి ప్లీజ్ డాడీ అంటాడు లక్కీ.

డాడీ నేను రావడం మీకు ఇష్టం లేదా? మమ్మీ నాకు అబద్ధం చెప్పిందా? పర్లేదు డాడీ నిజం చెప్పండి. నేను రావడం మీకు ఇష్టం లేకపోతే నేను తిరిగి వెళ్లిపోతాను. నా కారణంగా మీరు సీరియస్ గా ఉండటం నాకు ఇష్టం లేదు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తాను.. అంటాడు లక్కీ. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోబోతాడు నందు.

వాడివి గొంతెమ్మ కోరికలు కాదు కదా. చిన్న చిన్న ఆశలు. ఆమాత్రం తీర్చలేవా? అని అడుగుతుంది లాస్య. ఎంత దూరం అని పారిపోతావు. ఎన్నాళ్లని పారిపోతావు. సమాధానం చెప్పు నందు అంటుంది లాస్య. అయినా కూడా ఒక్క మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు.

మరోవైపు అనసూయ.. నందుతో మాట్లాడుతుంది. నీకు లాస్య కరెక్ట్ కాదురా అంటుంది. తులసే నీకు సరైన భార్య అంటుంది. ఇన్నాళ్లు నువ్వు చేసిందేంటి.. ఇప్పుడు నువ్వు చెబుతోందేంటమ్మా అంటుంది. ఇన్నాళ్లు నిన్ను గుడ్డిగా సమర్ధించాను కానీ.. నీ జీవితానికి లాస్య సరైన భాగస్వామి కాదు. నువ్వు తులసికి ద్రోహం చేస్తున్నావు అంటుంది.

ఉదయమే.. దివ్యతో కలిసి లక్కీ ఆడుకుంటాడు. అది చూసి లాస్యకు కోపం వస్తుంది. దివ్య.. అని అరుస్తుంది. నా కొడుకుతో నీకేంటి ఆటలు. నీ పని నువ్వు చేసుకోలేవా అంటుంది. అయితే.. ఆ విషయం లక్కీకి చెప్పండి. నాకు కాదు. చదువుకుంటున్న నన్ను తీసుకొచ్చాడు. ఇంకోసారి నామీద అరవకండి. నాకు నచ్చదు అంటుంది దివ్య.

ఇవన్నీ తులసి చూస్తుంది. బంధాలంటే ఎందుకు నీకు లాస్య అంత చిరాకు అంటుంది తులసి. ఇప్పుడేంటి నీ ప్రాబ్లమ్ అంటుంది లాస్య. నీకు బంధాలంటే ఎందుకు అంత భయం అంటూ లాస్యను నిలదీస్తుంది. బంధాలు అనేవి శాశ్వతం కాదు అని అంటుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

 

Advertisement