Intinti Gruhalakshmi 23 Oct Today Episode : ఫస్ట్ నైట్ వద్దు అని ప్రేమ్ తో ఒట్టు వేయించుకున్న శృతి.. ఈ విషయం తులసికి తెలుస్తుందా?
Intinti Gruhalakshmi 23 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 అక్టోబర్ 2021, శనివారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు, లాస్య.. ఇద్దరూ చనువుగా ఉండటం చూసి షాక్ అవుతుంది తులసి. ఇంతలో లాస్య చూసి.. భార్యాభర్తలు ఇద్దరూ చనువుగా ఉన్నప్పుడు ఇ అడగకుండా రావడం మ్యానర్స్ అనిపించుకోదు.. అని అంటుంది లాస్య. భార్యాభర్తలా.. ఎవరు భార్య.. ఎవరు భర్త.. అంటూ లాస్యపై సీరియస్ అవుతుంది తులసి. పరాయి మగాడి గుండెల మీద పబ్లిక్ గా ముచ్చట్లు పెట్టే నువ్వు నన్ను వేలెత్తి చూపిస్తున్నావా? జాగ్రత్త అని లాస్యకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది తులసి.

intinti gruhalakshmi 23 october 2021 episode
తులసి వెళ్లిపోగానే.. నందు.. తులసి రాగానే ఎందుకు నువ్వు లేచి నిలబడ్డావు. తులసి నన్ను అన్ని మాటలు అంటుంటే చూస్తూ నిలబడ్డావు కానీ.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకు. తులసితో విడాకులు తీసుకోగానే మనం పెళ్లి చేసుకొని ఉంటే ఇన్ని బాధలు పడేవాళ్లం కాదు కదా. ప్రతి దానికి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అంటుంది లాస్య. ఈ సమయంలో మనం పెళ్లి చేసుకోవడం కష్టం. ఉన్న పరువు కూడా పోతుంది. ఇది సరైన సమయం కాదు అని అంటాడు నందు.
Intinti Gruhalakshmi 23 Oct Today Episode : ప్రేమ్, శృతి ఫస్ట్ నైట్ కు అన్నీ సిద్ధం
మరోవైపు ప్రేమ్, శృతి ఫస్ట్ నైట్ కు అన్నీ సిద్ధం అవుతాయి. ప్రేమ్.. శృతి కోసం ఎదురు చూస్తుంటాడు. పాల గ్లాస్ పట్టుకొని శృతి గదిలోకి వస్తుంది. తను ఇచ్చిన పాలు సగం తాగి శృతికి ఇస్తాడు ప్రేమ్. తర్వాత వాళ్ల రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. ఇంతలో శృతి.. ఒక మాట ఇవ్వాలంటూ ప్రేమ్ ను అడుగుతుంది. మాట ఇవ్వు అంటుంది. మన మొదటి రాత్రి జరగకూడదు అని అంటుంది శృతి. ఎందుకు ఇలాంటి కోరిక కోరావు శృతి అంటాడు ప్రేమ్. తన కష్టాలను పక్కన పెట్టి ఆంటి ఎంతో కష్టపడి మన పెళ్లి చేశారు. తన మీద 2 కోట్ల అప్పు బారం వేసుకున్నారు. తన పేరు మీద ఉన్న ఒకే ఒక ఆస్తి ఈ ఇల్లు. మన కోసం ఆంటి అంతలా టెన్షన్ పడుతుంటే.. అంతలా కష్టపడుతుంటే అవేమీ పట్టనట్టు మనలోకంలో మనం ఉంటే నాకు నచ్చడం లేదు. ఆంటికి ఈ విషయం చెబుదామని అనుకున్నా కానీ.. తను ఒప్పుకోదు. అందుకే.. ఆంటి 2 కోట్ల బాధ్యత తీరేవరకు.. మనం ఫస్ట్ నైట్ జరుపుకోకూడదు అని అనిపించింది.. ఏమంటావు ప్రేమ్ అంటుంది శృతి. దీంతో.. నా మనసులో కూడా ఇదే ఆలోచన ఉంది. నువ్వే చెప్పి నా భారాన్ని తగ్గించావు.. అని అంటాడు ప్రేమ్.

intinti gruhalakshmi 23 october 2021 episode
పొద్దున్నే లేవగానే రాములమ్మ చూసి.. ఫస్ట్ నైట్ జరిగిందా? లేదా? అని చూస్తుంది. అందుకే ముందే బొట్టు, చీర అని చెరిగినట్టుగా చేసుకుంటారు ఇద్దరు. రాములమ్మ వాళ్లను చూసి ఫస్ట్ నైట్ జరిగింది అని అనుకుంటుంది. కానీ.. దుప్పటి నలగకుండా ఉండటంతో రాములమ్మకు డౌట్ వస్తుంది. నిజంగా ఫస్ట్ నైట్ జరగలేదేమో అని అనుకుంటుంది రాములమ్మ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.