Intinti Gruhalakshmi 23 Sep Today Episode : జీఎం రావు కుట్రను బట్టబయలు చేసిన తులసి.. దీంతో జనరల్ మేనేజర్ గా తులసిని ఎన్నుకున్న సామ్రాట్.. ఇంతలో తులసికి షాక్

Intinti Gruhalakshmi 23 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 సెప్టెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 745 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాకు కాల్ వచ్చింది. బయటికి వెళ్లి మాట్లాడి వస్తా అని చెప్పి రావు అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. చూడండి ప్రకాశ్ గారు.. సామ్రాట్ కు నేను ఎంత చెబితే అంత. నాకు ఆస్తి మొత్తం రాసివ్వమని చెప్పినా రాసి ఇచ్చేస్తాడు అని అంటాడు రావు. ఇంతలో తనకు ఫోన్ రావడంతో బయటికి వచ్చిన తులసి.. అతడు మాట్లాడే మాటలను వింటుంది. అతడి దగ్గరికి వెళ్తుంది. అన్నీ వినేశావా… నీ పని నువ్వు చూసుకో. నేను ఎంత మంచిగా ఉంటానో అంత కిరాతకంగా ఉంటాను. నాకు వచ్చే వాటాలో నీకూ పదో పరకో పడేస్తా.. కాదు కూడదు అని సామ్రాట్ గారికి ఈ విషయం చెప్పాలని చూస్తే నువ్వు ఉండవు. నా నెట్ వర్క్ నీకు తెలియదు అంటూ తులసికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తాడు రావు. రండి.. ఫైల్ చదివేశాను.. సైన్ పెట్టాను అంటాడు సామ్రాట్. ఫైల్ తీసుకోండి అని సామ్రాట్.. రావుకు ఫైల్ ఇవ్వబోతుండగా ఫైల్ ను లాక్కుంటుంది తులసి.

Advertisement
intinti gruhalakshmi 23 september 2022 full episode
intinti gruhalakshmi 23 september 2022 full episode

కంగారు ఎందుకు మేనేజర్ గారు మీ పని నేను చెబుతానుగా అంటుంది తులసి. ఎవరైనా మీ ఉప్పు తిని మీకు ద్రోహం చేస్తున్నారు అని తెలిస్తే ఏం చేస్తారు అని సామ్రాట్ ను అడుగుతుంది తులసి. దీంతో నరికిపారేస్తా అంటాడు సామ్రాట్. ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే ఏం చేస్తారు అంటే నాలిక కోసేస్తా అంటాడు సామ్రాట్. దీంతో వెంటనే రావు ఫోన్ తీసుకొని ఇంతకుముందు ఫోన్ చేసిన వ్యక్తికి ఫోన్ చేస్తుంది తులసి. వెంటనే అతడు చెప్పండి రావు గారు.. వర్క్ విషయం ఏమైంది. ఫైల్ మీద సంతకం పెట్టించారా? మీ కమిషన్ మీకు వచ్చేస్తుంది.. అంటాడు. అవన్నీ విని సామ్రాట్ కు కోపం వస్తుంది. ఒరేయ్.. అని సామ్రాట్.. అతడి గల్ల పట్టుకుంటాడు. ఎవరినైనా క్షమిస్తాను కానీ.. నమ్మక ద్రోహం చేసే వాడిని క్షమించను అంటాడు సామ్రాట్.

Advertisement

పోలీసులకు పట్టిద్దామా అని అంటాడు నందు. దీంతో వీడి కాళ్లు విరగ్గొడితే కానీ.. వీడికి బుద్ధి రాదు అని అంటాడు సామ్రాట్. దీంతో నన్ను క్షమించమని చెప్పండి అంటాడు మేనేజర్. దీంతో సామ్రాట్ గారు.. ఇలాంటి తండ్రి కడుపున పుట్టిన పాపానికి ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదు. పెళ్లి ఆగిపోతే ఆ పిల్ల ఆత్మహత్య చేసుకున్నా చేసుకుంటుంది. వద్దు అంటుంది తులసి.

ఎవరు చేసిన పాపానికి వాళ్లే ఫలితం అనుభవిస్తారు అంటుంది. దీంతో తులసి గారు చెప్పారు కాబట్టి వదిలేశాను. ఇంకోసారి నా కళ్ల ముందు కనిపించావో నరికేస్తాను. గెట్ లాస్ట్ అని అని అతడిని పంపించేస్తాడు. మా కంపెనీ రెప్యుటేషన్ పెంచారు. థాంక్స్ తులసి గారు అని అంటాడు సామ్రాట్.

Intinti Gruhalakshmi 23 Sep Today Episode : నందును అపాయింట్ చేస్తాడేమో అని సంతోషపడ్డ లాస్య

ఇప్పుడు అతడు వెళ్లిపోయాడు కానీ.. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఎవరిని మేనేజర్ గా పెడతాం అని అడుగుతాడు నందు. దీంతో మన మధ్యే అర్హత వాళ్లు ఎవరో ఒకరు దొరకరా చెప్పు అని అంటుంది లాస్య. దీంతో కరెక్టే అని ఆలోచిస్తూ ఉంటాడు సామ్రాట్. మీరు అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని అంటుంది లాస్య. దీంతో నాతో పాటు రండి.. నా నిర్ణయం నేను చెబుతా అంటాడు సామ్రాట్.

అందరి దగ్గరికి తులసి, నందు, లాస్యను తీసుకెళ్తాడు సామ్రాట్. మన కంపెనీ కొత్త జనరల్ మేనేజర్ గా తులసి గారిని అపాయింట్ చేస్తున్నాను అని చెబుతాడు సామ్రాట్. దీంతో నందు, లాస్య షాక్ అవుతారు. తులసి కుటుంబ సభ్యులు అందరూ సంతోషిస్తారు.

అందరూ చప్పట్లు కొడతారు. నేను కూడా ఊహించలేదు. చాలా సంతోషం. కంగ్రాడ్స్ తులసి అంటాడు బాబాయి. తులసికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఆయనేదో సరదాగా అంటే మీరు కూడా నమ్మేస్తారా అంటుంది తులసి. దీంతో సరదాగా అన్నారా అంటాడు పరందామయ్య.

దీంతో నేను గడ్డిపోచను. నన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతారా? అంటుంది తులసి. కరెక్ట్ తులసి.. నువ్వేంటో తెలుసుకున్నావు అంటుంది లాస్య. దీంతో ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం గొప్ప వాళ్ల లక్షణం అంటాడు సామ్రాట్. నేనేంటి నా అర్హత ఏంటి అని అంటుంది తులసి.

నేను చెప్పేది నేనే కదా మామ్. అసలు.. సామ్రాట్ గారు ఈ పోస్ట్ ఎందుకు ఇచ్చారో సామ్రాట్ గారిని అడుగు అంటాడు అభి. మామ్.. అతడు చెప్పేది గుడ్డిగా నమ్మొద్దు.. ప్రాబ్లమ్స్ కొనితెచ్చుకోవద్దు అని అంటాడు అభి. తులసి కూడా సామ్రాట్ కు అదే చెబుతుంది. నాకు మ్యూజిక్ స్కూల్ పెడితే చాలు. ఇవన్నీ వద్దు అంటుంది తులసి.

కానీ.. సామ్రాట్ తనను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. తులసి తరుపున నేను చెబుతున్నాను బాబు. తను మీ ఆఫర్ కు ఒప్పుకున్నట్టే అంటాడు పరందామయ్య. కుటుంబ సభ్యులు కూడా అందరు ఒప్పుకున్నట్టే అంటారు. దీంతో సామ్రాట్ సంతోషిస్తాడు.

ఈ విషయాన్ని నందు, లాస్య జీర్ణించుకోలేకపోతారు. తర్వాత మీడియా సమావేశం పెడతాడు సామ్రాట్. తులసిని జనరల్ మేనేజర్ గా ఎన్నుకున్నట్టు మీడియాకు చెబుతాడు. దీంతో మీరిద్దరూ ఒకరిని మరొకరు ఇష్టపడుతున్నారట. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా అని అడుగుతారు. అసలు మీ మొదటి భార్య గురించి చెప్పలేదు.. అంటూ ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement