Intinti Gruhalakshmi 25 Jan Today Episode : పండుగ రోజు కెఫె ఓపెన్ చేసిన నందు.. అందరినీ కాదని పూజలో కూర్చున్న లాస్య.. ఇంతలో ట్విస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 25 Jan Today Episode : పండుగ రోజు కెఫె ఓపెన్ చేసిన నందు.. అందరినీ కాదని పూజలో కూర్చున్న లాస్య.. ఇంతలో ట్విస్ట్

 Authored By gatla | The Telugu News | Updated on :25 January 2022,9:40 am

Intinti Gruhalakshmi 25 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 జనవరి 2022, మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇవాళ చాలా అందంగా ఉన్నావు అని నందు.. లాస్యతో అంటాడు. దీంతో లాస్య చాలా ఖుషీ అవుతుంది. రోజూ బాగుంటావు కానీ.. ఈరోజు ఇంకా అందంగా ఉన్నావు అంటాడు నందు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు సరసాలు ఆడుకుంటారు. నందు.. లాస్యను ముట్టుకుంటాడు. దీంతో నందు వదులు.. చెమట వాసన వస్తుంది అని కోప్పడుతుంది. ముందు వెళ్లి స్నానం చేసిరా అంటుంది లాస్య. ఇంతలో తులసిని నందు తిట్టిన విషయం గుర్తుకు తెచ్చుకుంటాడు. బాధపడతాడు నందు. సారీ తులసి అప్పుడు నువ్వు ఎంత బాధపడి ఉంటావో ఇప్పుడు అర్థం అవుతుంది అని అనుకుంటాడు నందు.

intinti gruhalakshmi 25 january 2022 full episode

intinti gruhalakshmi 25 january 2022 full episode

మరోవైపు తులసి దగ్గరికి వెళ్లి లాస్య గొడవ పెట్టుకుంటుంది. నా జోలికి నువ్వు రాకు లాస్య అంటుంది తులసి. నీ మొగుడిని లాక్కున్నాను అని నాకు దక్కాల్సింది దక్కకుండా నువ్వు చేస్తున్నావు. నువ్వు తోడు గోడు లేని ఒంటరి ఆడదానివి. పూజకు పనికిరాని దానివి. నువ్వు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా పండుగ పూజ చేసేది నేనే. ఏం చేస్తావో చేసుకో అని చెప్పి లాస్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో నందు స్నానం చేసి రెడీ అవుతాడు. ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది. నందును చూసి ఫ్లాట్ అవుతుంది. అన్ని డ్రెస్సుల కన్నా.. నీకు సూట్ బాగా సూట్ అవుతుంది అని చెప్పి అతడిని హత్తుకుంటుంది లాస్య. దీంతో వద్దు అని తనను దూరం జరుపుతాడు.

ఏంటి టిట్ ఫర్ టాటా.. ఇంతకుముందు నిన్ను దూరం పెట్టానని.. ఇప్పుడు నన్ను దూరం పెడుతున్నవా అంటుంది లాస్య. ఇంతలో నందు ఏదో జ్యూస్ తాగబోతాడు. వద్దు నందు. తాగకు అంటుంది. ఎందుకు అంటాడు నందు. భార్యాభర్తలు పూజ చేసేవరకు ఉపవాసం ఉండాలి అంటుంది.

నన్ను అడగకుండా నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు. అయినా నేను ఇంట్లో ఇవాళ ఉండలేను. నాదేమీ సాఫ్ట్ వేర్ జాబ్ కాదు. నాది కెఫేలో  జాబ్. నేను ఆఫీస్ కు వెళ్తున్నాను అని చెప్పి లాస్యకు షాక్ ఇచ్చి నందు వెళ్లిపోతాడు. దీంతో నందు కెఫే కు వెళ్లాడని ఇంట్లో వాళ్లకు ఎలా చెప్పాలి అని అనుకుంటుంది లాస్య.

మరోవైప. ప్రేమ్, అభి, దివ్య.. ముగ్గురూ పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. తులసిని పిలిచి చూపిస్తారు. అమ్మ.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని అడుగుతారు. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి కానీ.. మీరు వృథా చేసిన పూలే ఎక్కువగా ఉన్నాయి అంటుంది. ఇందాక నువ్వు ఫోన్ మాట్లాడుతూ ఫోన్ కట్ చేయలేదు అంటుంది.

Intinti Gruhalakshmi 25 Jan Today Episode : పూజకు ఉండలేనని.. కెఫెకు వెళ్లిపోయిన నందు

వృథా సంగతి పక్కన పెడితే పూజ ఏర్పాట్లు బాగా ఉన్నాయి అంటుంది తులసి. దీంతో అందరూ ఖుషీ అవుతారు. ఇంతలో పరందామయ్య, అనసూయ వస్తారు. అందరూ కలిసి సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంతలో అంకిత, శృతి వస్తారు.

నందు, లాస్య కూడా అక్కడికి వస్తారు. రాములమ్మ మా జంటను చూసి కడుపు మండేవాళ్ల దిష్టి తగిలేలా ఉంది. మా ఇద్దరికి దిష్టి తీయి అంటుంది లాస్య. దీంతో ఈ ఇంట్లో వాళ్లంత మంచి మనుషులు ఇంకెవరూ ఉండరమ్మ. మీకు ఏం కాదు.. నిశ్చింతగా ఉండండి. అయితే గియితే అంకిత, శృతికి దిష్టి తగులుతుంది అంటుంది రాములమ్మ.

అమ్మ.. వీళ్లకు దిష్టి తీయమంటారా అంటుంది రాములమ్మ. దీంతో ఏంటి రాములమ్మ దిష్టి తీయడానికి కూడా తులసి పర్మిషన్ కావాలా అంటుంది. చూశావా నందు.. ఈ ఇంట్లో ఇలాంటి రూల్స్ కూడా ఉంటాయా అంటుంది. మరోవైపు నేను కెఫెకు వెళ్తున్నాను అని చెప్పి నందు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

దీంతో నేనే వెళ్లమన్నాను.. కొత్త ఉద్యోగం కదా అని కవర్ చేస్తుంది. మీ మాటలన్నీ నేను విన్నానులే.. డాడీ మిమ్మల్ని తిట్టిన విషయం నేను విన్నాను అంటుంది దివ్య. దీంతో దివ్యపై సీరియస్ అవుతుంది లాస్య. దివ్య.. వేరే వాళ్ల పర్సనల్ విషయాల్లో వేలు పెట్టకు అంటుంది తులసి.

తర్వాత అందరూ వెళ్లిపోతారు. నువ్వు ఎంత చేసినా నేను మాత్రం ఎలాగైనా పూజ చేస్తాను అని అనుకుంటుంది లాస్య. మరోవైపు కెఫెకు వెళ్లిన నందు.. ప్రకాశ్ తో కొత్త ఐడియా గురించి చెబుతాడు. దీంతో ప్రకాశ్ కూడా ఆ ప్లాన్ బాగుంది అంటాడు.

ఇది ఖచ్చితంగా వర్కవుట్ అవుతుంది. ఎందుకంటే ఇది తులసి ఐడియా కాబట్టి అని అనుకుంటాడు నందు. కస్టమర్స్ కోసం నందు వెయిట్ చేస్తుంటాడు. కానీ.. కస్టమర్లు ఎవ్వరూ రారు. ఇంతలో నందు లాస్యకు ఫోన్ చేసి వెంటనే కెఫెకు రమ్మంటాడు. కానీ.. అప్పటికే లాస్య పూజ కోసం కూర్చుంటుంది. అనసూయ తనతో పూజ చేయిస్తుంటుంది. నందు ఫోన్ చేయగానే.. పూజను మధ్యలో వదిలేసి కెఫెకు పరిగెడుతుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది