Intinti Gruhalakshmi 25 Oct Today Episode : సామ్రాట్, తులసికి షాక్.. ఇద్దరూ ఒకే రూమ్ లో రెస్ట్ తీసుకొంటున్నారని తెలిసి నందు షాక్.. ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?
Intinti Gruhalakshmi 25 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 అక్టోబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 772 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి, సామ్రాట్ ఇద్దరూ గుడిలో కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇద్దరు యువతులు సామ్రాట్ ను చూసి అబ్బ ఏమున్నాడే అంటారు. మరి మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఇప్పటి వరకు. అసలు ఆ ఆలోచన ఎందుకు రాలేదు అని అడుగుతుంది సామ్రాట్ ను తులసి. దీంతో నేను మీకు ముందే చెప్పాను కదా అంటాడు సామ్రాట్. హనీ కోసం చేసుకోలేదు అంటాడు. హనీ కోసమే మీరు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అంటుంది తులసి. దీంతో చాలామందిని చూశాను.. ఇష్టపడ్డాను కానీ.. వాళ్లంతా నా ఆస్తి, నన్ను చూసి వచ్చేవాళ్లే కానీ.. వాళ్లు హనీ కోసం రావడం లేదు. అందుకే ఇక పెళ్లి టాపిక్ ను వదలేశాను అంటాడు సామ్రాట్.
ఆ తర్వాత మీరెందుకు మళ్లీ పెళ్లి చేసుకోకూడదు అని అడుగుతాడు సామ్రాట్. దీంతో తులసి షాక్ అవుతుంది. నాకు ఇక నా జీవితంలో పెళ్లి అనే దానికి ఇక చోటు లేదు అంటుంది తులసి. మళ్లీ మళ్లీ అనేది ఇక సాధ్యం కాదు. అస్సలు కుదరదు. అలసి పోయాను. జీవితం పంచుకునే విషయంలో నేను ఇంకో మనిషి నమ్ముదామనుకున్నా కానీ.. నా మనసు ఒప్పుకోదు. ఎదురు దెబ్బలు తగిలాక కూడా మనసు చెప్పేది వినకపోతే చాలా కష్టం. ఇప్పుడు నా దృష్టి అంతా నా మీద, నా పిల్లల మీద నేను ఎదగడం మీద. నా ప్రపంచాన్ని అక్కడికే కుదించుకున్నాను. అతిగా ఆశలు లేవు. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందా అని అంటుంది తులసి. దీంతో దొరికింది కానీ.. నచ్చలేదు అని మనసులో అనుకుంటాడు సామ్రాట్.
మరోవైపు తులసి గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది అనసూయ, అభి. అమ్మకు ఫోన్ చేసి ఎక్కడుందో అడుగు అంటాడు అభి. దీంతో పరందామయ్య వచ్చి తులసి నాకు అన్ని విషయాలు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెబుతోంది అంటాడు.
మధ్యలో గుడిలో ఉన్నారట. గుడి నుంచి తిరిగి ఇంటికే వస్తున్నారట అంటాడు. దీంతో పరాయి మగాడితో గుడికి ఎందుకు వెళ్లింది అని అంటుంది అనసూయ. సామ్రాట్ పరాయి మగాడు కాదు తన ఫ్రెండ్ అంటాడు పరందామయ్య.
Intinti Gruhalakshmi 25 Oct Today Episode : జోరు వానలో తులసి, సామ్రాట్ ప్రయాణం
కట్ చేస్తే కారులో గుడి నుంచి బయలుదేరుతారు సామ్రాట్, తులసి. బయలు దేరామని ఇంటికి మెసేజ్ పెట్టండి. సాయంత్రం వరకు చేరుకుంటాం అంటాడు సామ్రాట్. మరోవైపు రాత్రి అవుతుంది కానీ.. తులసి ఇంకా రాదు.
రాత్రి బాగా వర్షం పడుతూ ఉంటుంది. ఇంకా రాలేదు ఏంటి అని అందరూ కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటారు. తాతయ్య మీకు వచ్చిన మెసేజ్ ప్రకారం అమ్మ ఈ సమయం వరకు ఇంటికి రావాలి కదా అంటాడు ప్రేమ్.
తులసి రాలేదని బాధపడుతున్నాను కానీ.. అనుమాన పడట్లేదు అంటాడు పరందామయ్య. వాళ్లు ఎక్కడ ఉన్నారో.. ఏ పొజిషన్ లో ఉన్నారో అంటాడు నందు. మరోసారి దివ్య ఫోన్ చేస్తుంది కానీ.. తన ఫోన్ పని చేయదు.
సామ్రాట్ గారి బాబాయితో మాట్లాడుతాడు ప్రేమ్. ఆయనకు కూడా సామ్రాట్ ఎలాంటి సమచారం ఇవ్వలేదట అంటాడు ప్రేమ్. అప్పుడు హారతి ఇచ్చి పంపించారు.. ఇప్పుడేమో టెన్షన్ పడుతున్నారు అంటాడు నందు.
నేను తులసి గురించే కాదు.. సామ్రాట్ గురించి కూడా ఆలోచిస్తున్నాను అంటాడు పరందామయ్య. బయట ఈదురు గాలులు, కుంభవృష్టి.. కారు నడపడానికి కూడా సమస్యే అంటాడు పరందామయ్య.
మరోవైపు కారు నడపడం సామ్రాట్ కు ప్రాబ్లమ్ అవుతుంది. ఇంతలో కారు బ్రేక్ డౌన్ అవుతుంది. దీంతో ఒకసారి కారు దిగి ప్రాబ్లమ్ ఏంటో చూస్తాను అంటాడు సామ్రాట్. దీంతో ఇద్దరం దిగుదాం అంటుంది తులసి.
వద్దు మీరు తడుస్తారు అన్నా కూడా తులసి వినదు. దీంతో ఇద్దరూ తడిచిపోతారు. ఆ తర్వాత ఒక గెస్ట్ హౌస్ కు వెళ్తారు. అక్కడ తలదాచుకుంటారు ఇద్దరూ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.