Intinti Gruhalakshmi 27 Dec Tomorrow Episode : చివరకు లాస్యే గెలిచింది.. లాస్యకు లొంగిపోయిన నందు.. ఘనంగా ఇద్దరి పెళ్లి.. ఇంతలో తులసి షాకింగ్ నిర్ణయం
Intinti Gruhalakshmi 27 Dec Tomorrow Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు విడుదల కాదు. రేపు 27 డిసెంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 512 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు పెళ్లి సమయానికి లేకపోయేసరికి.. లాస్యకు పిచ్చెక్కుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. దీంతో తులసికి ఫోన్ చేసి ఉన్నపళంగా రమ్మంటుంది. లేకపోతే తన కుటుంబ సభ్యులపై పోలీస్ కంప్లయింట్ ఇస్తానంటుంది. దీంతో భయపడిన తులసి వెంటనే లాస్య దగ్గరికి వస్తుంది. వచ్చాక.. ఇద్దరూ కాసేపు పోట్లాడుకుంటారు. నా వాళ్ల మీద నువ్వు కేసు పెడతావా.. ముందు నువ్వు జైలుకు వెళ్తావు. నా కాపురాన్ని కూల్చావు.. నా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నావని నేను రివర్స్ కేసు పెడతాను అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది తులసి. దీంతో లాస్య షాక్ అవుతుంది. అలా.. ఇద్దరూ కాసేపు పోట్లాడుకున్నాక.. నందు.. తులసికి ఫోన్ చేస్తాడు.

intinti gruhalakshmi 27 december 2021 episode
తులసి ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు ఎక్కడున్నావో ముందు అర్జెంట్ గా ఇక్కడికి రా.. మీరు పారిపోవడం కాదు.. దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి అని చెబుతుంది. నీతో ఒంటరిగా మాట్లాడాలి అంటాడు నందు. ఏదున్న ఇక్కడే.. ముందు ఇక్కడికి రండి అంటుంది తులసి. ఇంతలో ఫోన్ గుంజుకొని నందు ఎక్కడున్నావు అని అడుగుతుంది లాస్య. ఇంతలో ఫోన్ కట్ చేస్తాడు నందు. తప్పనిసరి పరిస్థితుల్లో నందు అక్కడికి వస్తాడు. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లిపోయారు అని సీరియస్ అవుతుంది తులసి. ఏంటి నందు.. నీకు పదే పదే చెప్పినా కూడా అదే పని చేశావు. తీరా పెళ్లి సమయానికి మీరు ఎక్కడికి వెళ్లారు. అవతల పెళ్లి ముహూర్తం దాటిపోతుంది. రా నందు పెళ్లి చేసుకుందాం అని అంటుంది లాస్య.
కానీ.. నందు మాత్రం రాడు. చేయి తీయి లాస్య అంటాడు. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకునే మూడ్ లో లేను. నేను పెళ్లిక సిద్ధంగా లేను అంటాడు నందు. ఎందుకు పెళ్లి చేసుకోవు.. సిద్ధంగా లేను అంటే దాని అర్థం ఏంటి అని ప్రశ్నిస్తుంది లాస్య. నన్ను ప్రేమిస్తున్నావు కదా. విడాకుల తర్వాత పెళ్లి చేసుకుంటా అని నువ్వే కదా చెప్పావు. ఇప్పుడు మాట మారుస్తున్నావని సీరియస్ అవుతుంది లాస్య.
Intinti Gruhalakshmi 27 Dec Tomorrow Episode : నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నిన్ను కోర్టుకు లాగుతా.. జైలుకు పంపిస్తా అని బెదిరించిన లాస్య
నువ్వు ఎందుకు వెనకడుగు వేస్తున్నావు. ఎందుకు పెళ్లికి సిద్ధంగా లేవు. నాకు సమాధానం కావాలి.. నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను నిన్ను వదిలిపెట్టను. నీ పరువు తీస్తా. నిన్ను కోర్టుకు లాగుతా.. అని బెదిరిస్తుంది లాస్య. నువ్వు ఇంత వరకు లాస్య ప్రేమను.. పిచ్చితనాన్నే చూశావు.. కోపం వస్తే ప్రాణం ఎలా తీస్తుందో కూడా ఆలోచించదు అని అడుగుతుంది లాస్య.
దీంతో నోర్మూయ్ అంటూ లాస్యపై సీరియస్ అవుతుంది తులసి. మీరేమైనా చిన్నపిల్లలా.. మీరిద్దరూ గొడవపడటం.. మధ్యలో మేము రావడం. మీరు పెళ్లి చేసుకోండి లేకపోతే మానేయండి.. మాకేంటి సంబంధం.. అంటూ తులసి సీరియస్ అవుతుంది. పారిపోవడాలు.. ఇవన్నీ దేనికోసం. మధ్యలో నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు అంటూ ప్రశ్నిస్తుంది తులసి.
ఇక ఈ సమస్యకు ఏదో ఒక ముగింపు ఇవ్వండి. అయితే అటు.. లేకపోతే ఇటు.. అంటూ తీవ్రస్థాయిలో నందుపై ధ్వజమెత్తుతుంది తులసి. ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో అవునో కాదో అనే ఆప్షన్ నీకు లేదు నందు. నీకు ఉన్న ఆప్షన్లు రెండే.. నన్ను పెళ్లి చేసుకోవడం.. లేదంటే జైలుకు వెళ్లడం అంతే అంటుంది లాస్య. దీంతో నందు షాక్ అవుతాడు.
జైలుకు వెళ్లి అందరినీ బాధపెట్టడం కన్నా పెళ్లి చేసుకోవడం ఉత్తమం అని అనుకొని.. లాస్యను నందు పెళ్లి చేసుకుంటాడు. ఓవైపు నందు, లాస్య పెళ్లి జరుగుతుంటే తులసి తట్టుకోలేకపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.