Intinti Gruhalakshmi 28 April Today Episode : ప్రవళిక ఎవరు? తులసిని ఎందుకు వదలడం లేదు? అసలు తులసి ఫ్యాక్టరీని ఎందుకు వదిలేసింది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi 28 April Today Episode : ప్రవళిక ఎవరు? తులసిని ఎందుకు వదలడం లేదు? అసలు తులసి ఫ్యాక్టరీని ఎందుకు వదిలేసింది?

Intinti Gruhalakshmi 28 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 ఏప్రిల్ 2022, గురువారం ఎపిసోడ్ 618 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్ కు కోపం వచ్చినా కూడా శృతి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి అదే ఆఫీసులో పనిచేయడానికి ఒప్పుకుంటాడు. ఏంటి మానేయవా.. మరి ఈ పాటను ఎవరు రాశారు చెప్పు అని అడుగుతాడు మ్యూజిక్ డైరెక్టర్. దీంతో మీరే రాశారు సార్ అంటాడు […]

 Authored By gatla | The Telugu News | Updated on :28 April 2022,9:30 am

Intinti Gruhalakshmi 28 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 ఏప్రిల్ 2022, గురువారం ఎపిసోడ్ 618 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్ కు కోపం వచ్చినా కూడా శృతి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి అదే ఆఫీసులో పనిచేయడానికి ఒప్పుకుంటాడు. ఏంటి మానేయవా.. మరి ఈ పాటను ఎవరు రాశారు చెప్పు అని అడుగుతాడు మ్యూజిక్ డైరెక్టర్. దీంతో మీరే రాశారు సార్ అంటాడు ప్రేమ్. అవసరం ఉంటే చెప్తా.. మళ్లీ పాట రాద్దువు గానీ అంటాడు మ్యూజిక్ డైరెక్టర్. డస్ట్ బిన్ లో పడేయడానికా సార్ అంటాడు. దీంతో భలే క్యాచ్ చేశావు అంటాడు.

intinti gruhalakshmi 28 april 2022 full episode

intinti gruhalakshmi 28 april 2022 full episode

కట్ చేస్తే తులసి ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది. పరందామయ్య, అనసూయ, దివ్య మాత్రం బాధలో ఉంటారు. ఫ్యాక్టరీని వేరే వాళ్లకు ఇచ్చేయడం ఏంటి అని పరందామయ్య అడుగుతాడు. దీంతో నేను బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది అంటుంది. నువ్వు ఎంతో కష్టపడి పైకి తీసుకొచ్చిన ఫ్యాక్టరీ అది. నీ గురించి నువ్వు ఆలోచించుకోవా తులసి అని అడుగుతుంది అనసూయ. దీంతో నిజమే ఫ్యాక్టరీని కూడా బిడ్డలా పెంచాను. అందుకేనేమో నా బిడ్డలతో పాటు అది కూడా దూరం అయింది అంటుంది తులసి. మీ వర్కర్స్ కోసం గొప్ప మనసుతో మంచి త్యాగం చేశావమ్మా ఒప్పుకుంటాను కానీ.. ఉన్న ఆధారాన్ని వదులుకుంటే బతికేదెలా అంటాడు పరందామయ్య.

అందరూ నీకు దూరం అయ్యారు. నీకు అండగా నిలబడే వారే లేరు అంటుంది అనసూయ. ఎవరో తోడుగా వస్తారని మనం ఆగలేం కదా. ఒకప్పుడు ఎవ్వరూ లేని స్థితి మనది. అక్కడి నుంచే కదా.. ఇప్పుడు ఇంత దూరం వచ్చాం. కష్టపడటం మనకు కొత్తేం కాదు కదా మామయ్య అంటుంది తులసి.

నీ కష్టాలకు తోడు.. మేము కూడా తోడయ్యాం. మేము లేకపోతే.. నీకు ఇన్ని కష్టాలు ఉండకపోయేవి కావు అంటాడు పరందామయ్య. నేను కూడా నీకు బర్డెన్ అయ్యాను. నా చదువు ఆపేస్తాను మామ్ అంటుంది దివ్య. దీంతో తులసికి కళ్లు తిరిగినట్టు అవుతుంది.

ఇంతలో ప్రవళిక వచ్చి తులసిని పట్టుకుంటుంది. తులసి కళ్లు తిరిగి పడిపోతుంది. తనకు నీళ్లు తాగించి కుర్చీలో కుర్చోబెడుతుంది ప్రవళిక. ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది ప్రవళిక. నువ్వు తీసుకున్న డిసిజన్ తప్పు అని తెలిసి నిలదీద్దామని వచ్చాను కానీ.. నీ ఆర్గ్యుమెంట్ విన్నాక నువ్వు చేసిందే కరెక్ట్ అనిపించింది అంటుంది ప్రవళిక.

Intinti Gruhalakshmi 28 April Today Episode : తులసితో రోజంతా గడిపిన ప్రవళిక

అయినా మీరు ఏంటండి.. తులసి ఒక నిర్ణయం తీసుకుంది. దానికి తనవాళ్లుగా తనకు మద్దతుగా ఉండాలి కానీ.. ఇలా భయపెట్టడం ఏంటి అంటుంది ప్రవళిక. ఫ్యాక్టరీ ఓపెన్ చేయించడానికి కారణం తనే అని తులసి.. ప్రవళిక గురించి చెబుతుంది.

మరోవైపు ప్రేమ్ చిరాకుగా ఇంటికి వెళ్తాడు. ఏం చేయాలో అర్థం కాదు. నాకు రావాల్సిన క్రెడిట్ తను కొట్టేశాడు దరిద్రుడు అంటూ శృతికి చెప్పి బాధపడతాడు. దీంతో కంగ్రాట్యులేషన్స్ డియర్ అంటుంది శృతి. ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైమ్ అంటుంది శృతి.

నా ప్రేమ్ రాసిన పాట సినిమాకు సెలెక్ట్ అయింది. నా ప్రేమ్ రాసిన పాట అందరికీ నచ్చింది అంటుంది. కానీ.. లిరిక్ రైటర్ గా వాడ పేరు పెట్టుకున్నాడు అంటాడు. అయితే ఏంటి. నిన్నటి వరకు నీ పాట నచ్చలేదు అని బాధపడ్డావు. నీకు రాయడం రాలేదు అని భయపడ్డావు. కానీ.. ఇప్పుడు ఏంటి.. నీ పాట అందరికీ నచ్చింది. దాని అర్థం ఏంటి.. నీకు పాట రాయడం ఇష్టం అనే కదా అంటుంది శృతి.

ఒకసారి మనసు పెట్టి ఆలోచించు ప్రేమ్.. నీకే అర్థం అవుతుంది అంటుంది శృతి. మనకు కావాల్సింది ఇదే కదా. పేరుదేముంది.. ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. ముందు కావాల్సింది పాట నచ్చడం అంటుంది శృతి. శృతి అలా చెప్పడంతో ప్రేమ్ కూడా సంతోషిస్తాడు.

ఆ తర్వాత ప్రవళిక.. తులసిని మోటివేట్ చేస్తుంది. లైఫ్ లో బాధ్యతలు ఒక భాగం అంతే కానీ.. బాధ్యతలే లైఫ్ గా మారకూడదు అంటుంది ప్రవళిక. సరే.. నేను వస్తాను మరి.. మార్నింగ్ కలుద్దాం అని చెప్పి ప్రవళిక అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

మరోవైపు లాస్యకు ఏం చేయాలో అర్థం కాదు. తులసికి అదృష్టం అస్సలు వదలడం లేదు. ఎంత కష్టపడి ఫ్యాక్టరీని లేపేస్తే.. ఒక్కరోజులో తన చేతికి వచ్చింది అని బాధపడుతుంది. మరోవైపు చిరాకుగా నందు వస్తాడు. ఫ్యాక్టరీ తిరిగి చేతికి వచ్చినప్పుడు బుద్ధిగా నడుపుకోవచ్చుగా. సంబంధం లేదంటూ వదులుకోవడం ఏంటి అని అనుకుంటాడు.

ఎందుకు అంత చిరాకుగా ఉన్నావు అంటుంది. తులసి ఫ్యాక్టరీ విషయం తెలిసిందా అంటుంది. ఆ తెలిసింది అంటాడు. ఆ ఫ్యాక్టరీని వదులుకుంది కదా అని చెబుతాడు నందు. ఇక నుంచి తనకు, ఫ్యాక్టరీకి ఏం సంబంధం లేదు. మొత్తం వదిలేసి వచ్చిందట అంటాడు నందు.

దీంతో లాస్య సంతోషిస్తుంది. ఎలాగైనా తులసి రోడ్డు మీద పడ్డట్టే కదా. అది మనకు సంతోషమైన పనే కదా అంటుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది