Intinti Gruhalakshmi 28 June Today Episode : లోన్ డబ్బులు కాజేసింది లాస్యే అని తులసికి తెలుస్తుందా? అంకిత చేసిన తొందరపాటుకు తులసి షాకింగ్ నిర్ణయం

Intinti Gruhalakshmi 28 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 జూన్ 2022, మంగళవారం ఎపిసోడ్ 670 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈసారి కూడా డబ్బులు అందలేదా అని శృతి మొహం చూసి అంటాడు ప్రేమ్. మనిషి ఎదగాలంటే జీవితంలో కష్టం సుఖం రెండూ భరించాలి అంటాడు ప్రేమ్. దీంతో ప్రేమ్ అంటూ శృతి అతడిని హత్తుకుంటుంది. ఎంతో అదృష్టం మన దగ్గర ఉండి.. ఆఖరి నిమిషంలో ఎందుకు ఇలా ఎక్కిరిస్తుందో.. ఆశ పెట్టి బాధ పెట్టాను ప్రేమ్ అని అంటుంది శృతి. అందుకే దేని మీద ఎక్కువగా ఆశ పెంచుకోకూడదు అంటాడు ప్రేమ్. వస్తుంది అనుకున్న డబ్బు మన చేతికి రాకపోతేనే మనకు ఇంత బాధగా ఉంది. అలాంటిది చేతికొచ్చిన డబ్బు.. అందకుండా పోయినందుకు ఆంటి ఎంత బాధపడుతోందో అని మనసులో అనుకుంటుంది శృతి.

Advertisement
intinti gruhalakshmi 28 june 2022 full episode
intinti gruhalakshmi 28 june 2022 full episode

మరోవైపు నాకు ఎందుకు ఇలా జరుగుతోంది అని అనుకుంటుంది తులసి. తప్పు ఎక్కడుంది అని అనుకుంటుంది తులసి. ప్రతి వాళ్లను అనుమానించలేను.. ఏం చేయను. కలలు కన్నంత ప్రశాంతంగా జీవితం ఉండదని తెలుసు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని తెలుసు. కానీ.. నా జీవితంలో ఇన్ని మలుపులా ఏమైపోవాలి నేను. కష్టాన్ని మోసి మోసి భుజాలు అలసిపోతున్నాయి. ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది అన్న ఆశతో బతుకుతున్నాను. దేవుడే దారి చూపించాలి అని అనుకుంటుంది తులసి. బ్యాంక్ లోన్ విషయంలో హెల్ప్ చేయమని మామయ్య గారు చెప్పింది రిటైర్ మేనేజర్ కే కదా.. మరి ఆయన రంజిత్ ను ఎందుకు పంపుతారు అని అనుకొని వెంటనే అతడికి ఫోన్ చేస్తుంది.

Advertisement

చెప్పమ్మ తులసి అంటాడు. మీరు బ్యాంక్ మేనేజర్ కు నా లోన్ విషయం చెప్పారా అని అడుగుతుంది. దీంతో అవును చెప్పాను అంటాడు. మరి రంజిత్ ఎవరు అని అడుగుతుంది. రంజిత్ ఎవరో నాకు తెలియదు. నేను బ్యాంక్ మేనేజర్ కు చెప్పాను కానీ.. రంజిత్ ఎవరో తెలియదు అంటాడు. దీంతో ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని అనుకుంటుంది.

కట్ చేస్తే అభి ఏదో పని చేస్తూ ఉంటాడు. ఇంతలో గాయత్రి వచ్చి బిజీగా ఉన్నావా అని అడుగుతుంది. నీ ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ అయిపోయి.. పర్సనల్ లైఫ్ ను వదిలేస్తున్నావు అంటుంది. అన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చూపించదు. మనమే వెతుక్కోవాలి అంటుంది గాయత్రి.

నువ్వు ఎందుకు అంకిత గురించి పట్టించుకోవడం మానేశావు అని అడుగుతుంది గాయత్రి. మరోవైపు లాస్య నందు దగ్గరికి గుడ్ న్యూస్ అని చెబుతుంది. దీంతో నందు ఏమాత్రం పట్టించుకోడు. నా ఇంటర్వ్యూకు టైమ్ అయింది. నేను వెళ్లాలి అంటాడు నందు.

మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా అంటుంది లాస్య. దీంతో నాకు బిజినెస్ మీద నమ్మకం లేదు అంటాడు నందు. అయినా నా పిచ్చి కానీ.. నిన్ను నమ్మి 20 లక్షలు ఎవరు ఇస్తారు అంటాడు నందు. దీంతో బ్యాగులో ఉన్న డబ్బులు తీసి టేబుల్ మీద వేస్తుంది లాస్య.

Intinti Gruhalakshmi 28 June Today Episode : నందును నమ్మించిన లాస్య

వాటిని చూసి షాక్ అవుతాడు నందు. నేను నా మొగుడిని నమ్మాను కానీ.. నా మొగుడికి నా మీద నమ్మకం లేదు. నాకు ఫేస్ వాల్యూ లేదంటూ మొఖం చాటేస్తున్నాడు. ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు నందు అంటుంది లాస్య. నిన్ను గుడ్డిగా ప్రేమించాను అంటుంది.

తులసి విడాకులు తీసుకోకముందు నుంచి నీతో సహజీవనం చేశాను. నాతో పెళ్లి వాయిదా వేసుకుంటూ వెళ్తున్నా.. ఓపికగా నీతోనే ఉన్నాను కానీ.. ఎక్కడికీ పారిపోలేదు. ఎంత నమ్మకం లేకపోతే.. నీ మాజీ భార్యతో కలిసి ఒకే ఇంట్లో ఉంటాను చెప్పు అంటుంది లాస్య.

ఇంతకీ ఈ డబ్బు ఎవరు ఇచ్చారు అని అడుగుతాడు నందు. దీంతో ఎవరు ఇస్తే ఎందుకు అని అంటుంది లాస్య. సంజన ఇచ్చింది అంటే.. ఇదివరకు సంజన ఇవ్వను అన్నది కదా.. ఇప్పుడు ఎలా ఇచ్చింది అంటూ డౌట్ పడతాడు. దీంతో అయితే.. వెంటనే సంజనాకు ఫోన్ చేస్తా ఆగు అంటూ ఫోన్ చేయబోతుండగా వద్దులే అంటాడు నందు.

కట్ చేస్తే.. బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వస్తుంది తులసి. రంజిత్ గురించి వాకబు చేస్తుంది. దీంతో నాకు తెలియదు. మీరు ఆయన నెంబర్ కు ఫోన్ చేయండి అంటుంది. దీంతో అతడి నెంబర్ కలవడం లేదు అని చెబుతుంది తులసి. దీంతో నాకు తెలియదు అంటాడు బ్యాంక్ మేనేజర్.

మరోవైపు భాగ్య, లాస్య ఇద్దరూ 20 లక్షలు కొట్టేసినందుకు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు. ఎంజాయ్ చేస్తారు. కేక్ కట్ చేస్తారు.

Advertisement