Intinti Gruhalakshmi 30 April Today Episode : ప్రవళిక, తులసి షాపింగ్.. రోజంతా సంతోషంగా గడిపిన తులసి.. ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?

Intinti Gruhalakshmi 30 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 ఏప్రిల్ 2022, శనివారం ఎపిసోడ్ 620 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాకు ఆరోగ్యం బాగాలేదు. నేను రోజూ వాకింగ్ కు వెళ్తా అనేసరికి దివ్య షాక్ అవుతుంది. అంటే.. రేపటి నుంచి నా టిఫిన్ నేనే చేసుకోవాలా.. నేను చేయను అంటావు. నేను చదువు మానేసి ఇంట్లో పనులు చేయాలంటున్నావు అంతే కదా. నాకు టిఫిన్ అక్కర్లేదు.. నీ పనులు నువ్వు తీరిగ్గా చూసుకో అని చెప్పి కోపంగా దివ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. పొద్దున్నే ఇంట్లో పనులు ఉంటాయి. ఆ వాకింగ్ ఏదో.. తీరిగ్గా చేసుకోవచ్చు కదా అంటుంది అనసూయ. అందరి కోసం తులసి అడ్జెస్ట్ చేసుకోవాలి కానీ.. తులసి కోసం ఎవ్వరూ అడ్జెస్ట్ చేసుకోరా అని అడుగుతాడు పరందామయ్య. మొగుడు ఉన్నప్పుడు ఎలాగూ నీకు స్వేచ్ఛ లేదు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఇలాగే అయితే ఎలా. నువ్వు ఎవరి మాటలు వినకు. నీకు నచ్చింది చేయి అమ్మ అంటాడు పరందామయ్య.

Advertisement
intinti gruhalakshmi 30 april 2022 full episode
intinti gruhalakshmi 30 april 2022 full episode

ఈరోజు ప్రవళిక షాపింగ్ కు వెళ్దామంది. మీ అందరికీ కావాల్సింది వండాకనే వెళ్తాను అని అంటుంది. మా గురించి ఏమొద్దలేమ్మా.. నీ కూతురు అలిగి వెళ్లింది తన గురించి చూడు అంటుంది అనసూయ. తర్వాత వెళ్లి దివ్యను బతిమిలాడుతుంది తులసి. చాలా ఏళ్లుగా నా గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. లోలోపలే ఒంటరితనంతో కుమిలిపోయేదాన్ని. కానీ.. ఏరోజైనా నేను చెప్పానా? కోపం తెచ్చుకొని మీతో మాట్లాడటం మానేశానా అంటుంది తులసి. దీంతో నువ్వు ఏనాడూ నీకు ఏం కావాలో అడగలేదు. మా మీద అలగలేదు కూడా అంటుంది దివ్య. మేము ఎంత సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నామో నాకు ఇప్పుడు అర్థం అవుతోంది మామ్. సారీ మామ్ అంటుంది దివ్య.

నువ్వు ఆడపిల్లవు. రేపు ఒకరి ఇంటికి కాబోయే కోడలివి. నీకు ఇలాంటి పరిస్థితి ఎదురవచ్చు. అది తెలియాలనే చెబుతున్నాను అంటుంది. దీంతో రేపటి నుంచి నువ్వు రెగ్యులర్ గా వాకింగ్ కు వెళ్లు. ఇంట్లో పనులు నేను చూసుకుంటాను అంటుంది దివ్య.

Intinti Gruhalakshmi 30 April Today Episode : షాపింగ్ వెళ్లడం కోసం త్వరత్వరగా వండిన తులసి

షాపింగ్ కు వెళ్లేందుకు తులసి త్వరత్వరగా వంట వండుతుంది. ఇంతలో ప్రవళిక వస్తుంది. ఇక అందరికీ ట్యాబ్లెట్లు వేసుకోవాలని చెప్పి ప్రవళికతో కలిసి సరదాగా బయటికి వెళ్తుంది తులసి. నువ్వు మా గురించి ఎటువంటి టెన్షన్లు పెట్టుకోకు. నువ్వు సంతోషంగా నీ ఫ్రెండ్ తో వెళ్లిరా అని అనసూయ అంటుంది.

దీంతో ప్రవళిక చాలా సంతోషిస్తుంది. మీరు మీ కోడలుకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా తులసి అదృష్టవంతురాలు అంటుంది ప్రవళిక. తర్వాత ఇద్దరూ కలిసి షాపింగ్ కు వెళ్తారు. అక్కడ ఒక డ్రెస్ చూసి.. వెళ్లి నువ్వు వేసుకొనిరా అంటుంది ప్రవళిక.

డ్రెస్ లో తులసి సూపర్బ్ గా ఉంటుంది. డ్రెస్ లో 10 ఏళ్ల వయసు తగ్గినట్టుగా ఉంది తెలుసా అంటుంది ప్రవళిక. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ ఆఫీసులో కూర్చొని నిద్రపోతుంటాడు. ఇంతలో ప్రేమ్ వస్తాడు.

ఎక్స్ క్యూజ్ మీ సార్ అంటాడు. కానీ.. అతడు నిద్రలేవడు. సార్ అని గట్టిగా అంటాడు. నాకు కొంచెం డబ్బు కావాలి సార్. నాకు వచ్చే శాలరీలో అడ్వాన్స్ ఇవ్వండి అంటాడు. దీంతో చేరి ఒక నెల కాలేదు. నేను జీతమే డిసైడ్ చేయలేదు. అప్పుడే నువ్వు అడ్వాన్స్ అడిగేస్తున్నావా అంటాడు.

కొంచెం అర్జెంట్ గా పని ఉంది సార్.. అంటాడు. దీంతో నువ్వెవరో తెలియదు. ఎన్ని రోజులు పని చేస్తావో తెలియదు. నీకు ఎందుకు ఇవ్వాలి డబ్బు అంటాడు. దీంతో ప్రేమ్ అక్కడి నుంచి వెళ్లబోతాడు.

అనవసరంగా మాటలు అంటున్నానేమో.. మళ్లీ వెళ్లిపోతే ఎలా అనుకుంటాడు. మళ్లీ పిలిచి తీసుకో అని కొంత డబ్బు ఇస్తాడు. అసలే బంగారు బాతు వదులుకుంటే ఎలా అని అనుకుంటాడు మ్యూజిక్ డైరెక్టర్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

  • Also Read

Advertisement