Intinti Gruhalakshmi 5 Jan Today Episode : బెనర్జీతో చేతులు కలిపిన లాస్య.. అందరి ముందు లాస్య క్యారెక్టర్ ను బట్టబయలు చేసిన తులసి.. నందు ఏం చేస్తాడు?
Intinti Gruhalakshmi 5 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 జనవరి 2023, గురువారం ఎపిసోడ్ 834 హైలైట్సై ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నాకు ఏదో అదృష్టం తలుపు తట్టనుంది అని అనుకుంటుంది లాస్య. ఇంతలో బెనర్జీ… లాస్యకు ఫోన్ చేస్తాడు. మీకు ఒక అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నాను అంటాడు. కానీ.. లాస్యకు అర్థం కాదు. ముందు మీరు ఈరోజు ఆఫీసుకు రండి. ఆఫీస్ అడ్రస్ పంపిస్తా.. ఆ తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అంటాడు బెనర్జీ. దీంతో లాస్య ఎగిరి గంతేస్తుంది. కట్ చేస్తే పరందామయ్య, అనసూయ ఇద్దరూ ప్రసాదం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. లాస్య చేసిన అవమానాల ముందు వీడు అన్నమాటలు చాలా చిన్నవిగా ఉన్నాయి. రోషం, పౌరుషం లాంటివి లేకుండా పోయాయి అని అంటాడు పరందామయ్య.
అసలు ఒక కాఫీ కూడా తాగలేని పరిస్థితి అంటాడు పరందామయ్య. షుగర్ డౌన్ అయితే కనీసం చెక్కర నీళ్లు కూడా తాగలేని పరిస్థితి అంటుంది అనసూయ. ఇవన్నీ తులసికి తెలియదు కదా అంటే.. తెలిసి మాత్రం ఏం చేస్తుంది అని అంటాడు పరందామయ్య. ఇవన్నీ సామ్రాట్, తులసి ఇద్దరూ వింటారు. తనను అక్కడైనా సంతోషంగా ఉండనివ్వు. ఈ గుడి కాకపోతే ఇంకో గుడి. కడుపు నింపుకోవడానికి ప్రసాదం దొరకకపోతుందా? అని అంటాడు పరందామయ్య. ఇలా తయారయింది ఏంటండి.. మన పరిస్థితి. దానం చేయడమే కానీ.. మనం ఏరోజూ ఎవరి ముందు చేయి చాచకుండా బతికాం అంటుంది అనసూయ. దీంతో ఈరోజు మనం భూమికి భారం అయ్యాం అంటాడు పరందామయ్య.
ప్రసాదం తినండి అంటే గొంతు దిగడం లేదు అనసూయ అంటాడు పరందామయ్య. దీంతో అది తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు చక్కగా రెడీ అయి లాస్య ఎక్కడికో బయలు దేరుతుంది. ఇంతలో నందు వస్తాడు. అతడిని చూసి ఇప్పుడే వస్తాను అంటుంది లాస్య.
ఎప్పుడు వస్తావో చెప్పావు కానీ.. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పవా అంటాడు నందు. దీంతో మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా అంటుంది లాస్య. అయినా నందు నమ్మడు. ఆ తర్వాత అసలు విషయం చెబుతుంది. అయినా కూడా నమ్మడు నందు.
Intinti Gruhalakshmi 5 Jan Today Episode : పరందామయ్య, అనసూయ మాట్లాడుకునే మాటలను విన్న తులసి
మరోవైపు మీ అత్తయ్య, మామయ్య ఇద్దరూ అంత బాధపడుతుంటే మీరు ఏం మాట్లాడరు ఏంటి అంటాడు సామ్రాట్. వాళ్లకు ఎదురుగా వెళ్తే నోరు విప్పరు అంటుంది తులసి. వాళ్ల కష్టానికి వాళ్లను అలాగే వదిలేస్తారా? అంటాడు సామ్రాట్.
మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. మొదటిసారి మీరు సరైన నిర్ణయం తీసుకెళ్లడంలో తడబడుతున్నారు అంటాడు సామ్రాట్. దీంతో ఈ సమస్యను పెంచాలనుకోవడం లేదు. తగ్గించాలని అనుకుంటున్నా అంటుంది తులసి.
మరి.. వాళ్లను అలాగే వదిలేస్తారా అంటే అలా ఎలా వదిలేస్తాను. నేను ఎలా ప్రశాంతంగా ఉంటాను అంటుంది తులసి. నా అత్తమామలను ఏడిపిస్తుంటే చూస్తూ నేను ఎలా ఊరుకుంటాను.
నా అనుమానం అల్లా ఒకటే. లాస్య చేసేవి నందగోపాల్ గారికి తెలియదు. తెలియకపోవచ్చు. లాస్య ఎంత తెలివిగా నాటకం ఆడుతుందో.. అంతే తెలివిగా లాస్య నాటకం బయట పడేలా చేస్తాను అంటుంది తులసి.
కట్ చేస్తే లాస్య.. బెనర్జీ దగ్గరికి వెళ్తుంది. నేను రాంగ్ ప్లేస్ కు వచ్చానని తెలుసు. మీకు కావాల్సింది నాలాంటి క్యాండిడేట్ కూడా కాదు. అయినా వచ్చాను అంటుంది లాస్య. మీరు చాలా టాలెంటెడ్. మీ కెపాసిటీకి సరిపడ అవకాశాలు రాక మీరు అక్కడే ఉండిపోయారు అంటాడు బెనర్జీ.
మీకు ఎలా తెలిసింది అంటే మల్లెపూలను ఎక్కడున్నా వాటి సువాసన ఆధారంగా తెలుసుకోవచ్చు. మీకు సరైన అవకాశం కల్పించి మీకు గుర్తింపు తీసుకురావాలన్నదే నా ప్రయత్నం. అందుకే మిమ్మల్ని ఏరికోరి పిలిపించాను.
ఇది మీరు టేకప్ చేయాల్సిన ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫైల్ అంటాడు బెనర్జీ. దాన్ని చూసి ఇది స్కూల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కు సంబంధించిన ప్లాన్ కదా. నేను సాఫ్ట్ వేర్ సైడ్ ఉంటాను. ఇది నేను చేయలేను అంటుంది లాస్య.
దీంతో ఇది మీరే చేయాలి అంటాడు బెనర్జీ. దాని కోసం నువ్వే ఒక కంపెనీ పెట్టాలి. నా ప్రాజెక్ట్ టేకప్ చేయాలి అంటాడు బెనర్జీ. మరి నాతోనే ఇదంతా ఎందుకు చేయితున్నారు అంటే.. నీ ఫ్రెండ్ షీలా నిన్ను నాకు రెఫర్ చేసింది అంటాడు బెనర్జీ.
మరోవైపు ఇంటికి కావాల్సిన సరుకులు అన్నీ తీసుకొస్తుంది తులసి. ఇంతలో అందరూ వస్తారు. ఏంటి అందరూ అలా నిలబడి చూస్తున్నారు. ఇంటికి గెస్ట్ వచ్చింది కాస్త మంచినీళ్లు కూడా ఇవ్వరా అంటుంది తులసి.
ఇంతలో లాస్య వస్తుంది. ఈ సరుకులు ఏంటి అని అడుగుతుంది. నాకు చెప్పకుండా ఇన్ని సరుకులు ఎవరు తెప్పించారు అని అడుగుతుంది. దీంతో నేనే తెప్పించాను అంటుంది తులసి. మాకు చెప్పకుండా నిన్ను ఎవరు తెప్పించమన్నారు అంటుంది లాస్య.
ఇంతలో నందు వస్తాడు. కొంపలంటుకు పోయినట్టు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు. ఈ సరుకులు అన్నీ నా డబ్బులతో నేనే ఈ ఇంటి కోసం తీసుకొచ్చాను అంటుంది తులసి. ఎవరూ అడగలేదు, ఎవరూ చెప్పలేదు. ఇంటికి తెచ్చేవరకు ఎవ్వరికీ తెలియదు అంటుంది తులసి.
ఈ ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకురావాల్సిన అవసరం నీకేంటి అని అడుగుతాడు నందు. దీంతో నా వాళ్లు ఈ ఇంట్లో తిండికి ఇబ్బంది పడకూడదని జాగ్రత్త పడుతున్నాను అంటుంది తులసి. వాళ్లు తిండికి ఇబ్బంది పడుతున్నారని ఎవరు చెప్పారు.. అమ్మానాన్నలను చూసుకోలేనంత చేతకాని వాడిలా కనిపిస్తున్నానా అంటాడు నందు.
ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఇప్పుడే మీ కళ్ల ముందే చూపిస్తాను అంటుంది తులసి. దీంతో లాస్య ఏదో మాట్లాడుతుంది. దీంతో శృతి ఒక కప్పు కాఫీ తీసుకొస్తావా అంటుంది తులసి. దీంతో అంకితను కూడా అడుగుతుంది.
ఫ్రిడ్జ్ తో సహా.. అన్ని ర్యాక్స్ కు తాళాలు వేసి ఫ్రిడ్జ్ కీ తన దగ్గర లాస్య ఆంటి పెట్టుకుంది అని చెబుతుంది అంకిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.