Intinti Gruhalakshmi 5 March Today Episode : ప్రేమ్, శృతిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన తులసి.. తులసికి ఎదురుతిరిగిన ఇంట్లో వాళ్లు.. లాస్య ప్లాన్ వర్కవుట్ అయిందా?
Intinti Gruhalakshmi 5 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 మార్చి 2022, శనివారం ఎపిసోడ్ 572 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో అందరికీ నందును దూరం చేస్తున్నావు అని తులసిని అంటుంది లాస్య. దీంతో నువ్వు నోరు అదుపులో పెట్టుకో. మా అమ్మ గురించి ఇంకో మాట ఎక్కవ మాట్లాడినా బాగుండదు అంటాడు ప్రేమ్. దీంతో అంటాను.. ఏం చేస్తావు. మీ అమ్మ మనసులో కుళ్లు కుతంత్రాలు పెట్టుకుంది. మీ అమ్మ ఎన్ని చేసిందో తెలుసా. అంకితను తన పుట్టింటికి దూరం చేసింది. అభిని అత్తారింటికి దూరం చేసింది.. అది కేవలం తన స్వార్థం కోసమే. చివరకు నిన్ను కూడా అనాధకు ఇచ్చి పెళ్లి చేసింది. కోడలు కాదు.. కూతురు అంటూ నాటకం ఆడి మామయ్య గారితో ఇల్లు రాయించుకుంది.. అంటుంది లాస్య.
అసలు శశికళతో కూడా ఏదో కుమ్మక్కయినట్టు ఉంది.. అంటుంది. నిజంగానే అంత వడ్డీ అయిందా అని అంటుంది లాస్య. దీంతో కోపంతో లాస్యను కొట్టబోతాడు ప్రేమ్. నా భార్యనే కొట్టబోతావా అంటూ ప్రేమ్ ను కొడతాడు నందు. దీంతో నందు.. చొక్కాను పట్టుకుంటాడు ప్రేమ్. దీంతో ప్రేమ్.. వద్దురా.. ఆపు కన్నతండ్రి చొక్కానే పట్టుకుంటావా. ఇదేనా నువ్వు నేర్చుకున్నది.. అంటూ ప్రేమ్ కు క్లాస్ పీకుతుంది. వెంటనే శృతితో సహా ఇల్లు వదిలి వెళ్లిపో అంటుంది తులసి. దీంతో ఒక్కసారి నా కళ్లలోకి చూసి చెప్పు అమ్మ. నిజంగానే ఈ బిడ్డను వదిలి వెళ్లిపో అంటున్నారా అంటాడు ప్రేమ్. దీంతో అవును.. అవును.. అవును.. నిజంగానే వెళ్లిపోవాలంటున్నాను అంటుంది తులసి. తులసి.. ఏదో ఆవేశంలో మాటా మాటా అనుకున్నంత మాత్రాన కొడుకును ఇల్లు వదిలేసి వెళ్లిపోమంటున్నావా అంటుంది అనసూయ.
వాడిని చూడకుండా నువ్వు ఉండగలవా అని అడుగుతుంది అనసూయ. దీంతో ఉండగలను అంటుంది తులసి. కానీ.. నేను నిన్ను చూడకుండా ఉండలేనమ్మా అంటాడు ప్రేమ్. నీ కాళ్లు పట్టుకుంటానమ్మా.. అలా మాట్లాడకు.. అంటాడు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయను.. నన్ను క్షమించు అమ్మ అంటాడు ప్రేమ్.
నీ నుంచి దూరంగా వెళ్లడం అంటే నాకు చావుతో సమానం.. అంటాడు ప్రేమ్. దయచేసి ఎవ్వరూ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. నేను ఎవ్వరి మాటా వినను. కాదూ కూడదు అంటే చెప్పండి. నేనే ఈ ఇంట్లోంచి వెళ్లిపోతాను అంటుంది తులసి.
వెళ్లిపో.. వెళ్లిపో ఇక్కడి నుంచి అంటుంది తులసి. దీంతో శృతిని తీసుకొని ప్రేమ్ బయటికి వెళ్లిపోతాడు. ప్రేమ్.. ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోగానే.. తులసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. వెళ్లొద్దు అంటూ అందరూ ఆపినా కూడా ప్రేమ్, శృతి ఆగరు.
Intinti Gruhalakshmi 5 March Today Episode : తులసి ఒరిజినాలిటీ ఇది అంటూ నందుకు విడమరిచి చెప్పిన లాస్య
ఇప్పటికైనా తెలిసిందా నందు.. తులసి ఒరిజినాలిటీ ఏంటో అంటుంది లాస్య. తులసి ఏం తప్పు చేసింది.. ప్రేమ్ నాకు ఎదురు తిరిగాడు అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు పంపించేసింది అంటాడు నందు. తను చేసింది మంచి పనే కదా అంటాడు నందు.
ఇంతకుముందు ప్రేమ్ ఎప్పుడూ తప్పులు చేయలేదా. నిన్ను ఎదిరించి మాట్లాడలేదా. మరి తులసికి అప్పుడు రాని కోపం ఇప్పుడు ఎందుకు వచ్చింది. తులసి స్వార్థం ఇది. గుడ్డిగా తులసిని నమ్మకు. తులసి నిజ స్వరూపం తెలుసుకొని ఇంట్లో వాళ్లకు చెప్పు అంటుంది లాస్య.
స్వార్థానికి నిలువెత్తు రూపం తులసి అంటుంది లాస్య. దీంతో తులసి ఆటలు ఇక సాగనివ్వను లాస్య.. చూస్తూ ఉండు అంటాడు నందు. మరోవైపు ఇంట్లో వాళ్లంతా ఏడుస్తూ ఉంటారు. దివ్య వెక్కి వెక్కి ఏడుస్తుంది. పరందామయ్య కూడా ఏడుస్తూ ఉంటాడు.
దీంతో ఆయన దగ్గరికి వచ్చి నామీద కోపంగా ఉందా మామయ్య అంటుంది తులసి. లేదమ్మా భయంగా ఉంది. పొరపాటున నేను కూడా ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని కూడా బయటికి పంపించేస్తావేమోనని భయం వేస్తోంది. ఈ వయసులో మేము బయటికి వెళ్లి ఎక్కడ బతకగలం అంటాడు పరందామయ్య.
నేను అంత రాక్షసురాలిగా కనిపిస్తున్నానా అంటుంది తులసి. కాదు తులసి. లాస్య రెచ్చగొట్టడం వల్ల వాడు తన మీదకి చేయి లేపాడు. నీకు అంతలా వాడిని శిక్షించాలంటే వాడిని రెండు చెంపదెబ్బలు కొట్టాల్సింది అంటాడు పరందామయ్య. దీంతో నేను వాడికి వేసిన శిక్ష కాదు. నాకు నేను వేసుకున్న శిక్ష.. అంటుంది తులసి.
నన్ను ఎవరు అపార్థం చేసుకున్నా నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ.. నా మనసు తెలిసిన మీరు కూడా ఇలా మాట్లాడటం నేను తట్టుకోలేకపోతున్నా. నేను ప్రేమ్ ను ఇంట్లో నుంచి బయటకు పంపించింది.. లాస్యను ఎదిరించాడనో.. తండ్రి చొక్కా పట్టుకున్నాడనో కాదు అంటుంది తులసి.
జీవితం విలువ వాడు తెలుసుకోవాలని నేను వాడికి ఈ శిక్ష విధించాను. వాడిని ఇంట్లో నుంచి పంపించడానికి దొరికిన అవకాశాన్ని వాడుకున్నాను. ఇది వాడిని శిక్షించడం కాదు మామయ్యా.. వాడి జీవితంలో గెలవాలని ఆశ.. వాడు బాగుపడతాడని నమ్మకం.. ఈ నిజాన్ని మీకు తప్ప ఇంకెవరికీ చెప్పుకోలేను.. అంటుంది తులసి.
వాడి మీద నాకు ఉన్న కోపానికి కారణం ఉంది. వాడి మీద నేను పెట్టుకున్న నమ్మకంలో ప్రేమ ఉంది. తల్లిగా వాడి మీద బాధ్యత ఉంది. ఇప్పుడు చెప్పు మామయ్య నేను చేసింది తప్పా అంటుంది తులసి. నువ్వు చేసి తప్పు కాదమ్మా.. నేను తొందరపడి తప్పుగా మాట్లాడాను అంటాడు పరందామయ్య.
కానీ.. ప్రేమ్ కూడా నాలాగే నిన్ను అపార్థం చేసుకుంటాడేమో అనుకుంటున్నా అంటాడు పరందామయ్య. మరోవైపు అందరికీ భోజనాలు వడ్డిస్తుంది తులసి. కానీ.. ఎవ్వరూ తినరు. ఓవైపు ప్రేమ్ ను పంపించి.. ఇప్పుడు తాపీగా భోజనాలు వడ్డిస్తున్నావా అంటుంది లాస్య.
లాస్య నువ్వు ఆపుతావా అంటుంది తులసి. మాట్లడనీయు మామ్. కనీసం ఎవరో ఒకరు మాట్లాడాలి కదా అంటుంది దివ్య. ప్రేమ్ ను ఇంట్లో నుంచి పంపించేసినందుకు.. అందరూ భోజనం చేయకుండా వెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.