Intinti Gruhalakshmi 7 April Today Episode : భాగ్య, లాస్య కలిసి ఇంటిని లాక్కునే ప్రయత్నం.. ఇల్లును శశికళకు అప్పగించి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తులసి.. ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?

Authored By Varun G | The Telugu News | Published on: April 7, 2022, 9:30 am

Intinti Gruhalakshmi 7 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 ఏప్రిల్ 2022, గురువారం ఎపిసోడ్ 600 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్యకు ఫోన్ చేసి నా వాటా కోసం ఇక్కడే ఉన్నా అని చెబుతుంది భాగ్య. నీకే కాదు నాకు కూడా ఆ ఇంట్లో వాటా ఉంది అని అంటుంది లాస్య. నేను నీతో చేతులు కలుపుతాను. కోర్టుకు వెళ్దాం. ఇద్దరం కలిసి కోర్టులో పోరాడుదాం. ఆ ఇంట్లో సగం హక్కు నీది.. సగం హక్కు నాది. ఇద్దరం కలిసి ఆ ఇంటిని మన సొంతం చేసుకోవాలి అంటుంది లాస్య. దీంతో నేను కూడా తగ్గేదేలే అంటుంది. దీంతో అనుకోకుండా భాగ్య నా దారికి వచ్చింది. తులసి ఇక నిన్ను ఒక ఆట ఆడుకుంటా అని అనుకుంటుంది లాస్య.

intinti gruhalakshmi 7 april 2022 full episode

intinti gruhalakshmi 7 april 2022 full episode

మరోవైపు డిన్నర్ చేయడానికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాడు. ఫుడ్ ఉండదు. దీంతో లాస్యను పిలిచి ఫుడ్ వండలేదా అని అడుగుతాడు. దీంతో వండలేదు.. వండాలనిపించలేదు అంటుంది లాస్య. కనీసం ఆర్డర్ చేయొచ్చు కదా.. లేదంటే నాకు ముందే చెప్పొచ్చు కదా అని అడుగుతాడు నందు. చేయలేదు.. అది కూడా తులసి నుంచి నేర్చుకోవాలా అని అడుగుతుంది. సరే.. వదిలేయ్ అని చెప్పి వెళ్తాడు నందు. మరోవైపు పొద్దెక్కినా పడుకొనే ఉంటాడు ప్రేమ్. ఇంకా లేవకపోయే సరికి.. ఎలాగైనా ప్రేమ్ ను నిద్రలేపాలని ఆంటి మీరేనా వచ్చింది అంటూ అబద్ధం ఆడుతుంది. దీంతో లేచి చూస్తాడు. అది అబద్ధం అని చెప్పి శృతిపై సీరియస్ అవుతాడు.

ఆ తర్వాత నన్ను నిద్రలేపినందుకు నాకు ఏదో ఒకటి ఇవ్వాల్సిందే అంటూ తనను సతాయిస్తాడు. ఆ తర్వాత ప్రెష్ అప్ అయి వచ్చి టిఫిన్ తింటాడు. ఆ తర్వాత పని కోసం మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నా అని చెబుతాడు. మరోవైపు తులసికి లాస్య ఫోన్ చేస్తుంది.

నీ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను అంటుంది తులసి. కడుపు నిండిందా లాస్య అంటే.. అప్పుడేనా కథ ఇప్పుడే మొదలైంది అంటుంది లాస్య. నీ నుండి నందును లాక్కున్నాను నువ్వు ఏం చేయగలిగావు అంటుంది లాస్య. దీంతో నువ్వు లాక్కోలేదు.. నేను వదిలేశాను అంటుంది.

అలాగే ఇంటిని కూడా వదులుకోవచ్చు కదా అంటుంది లాస్య. దీంతో ఏది వదులుకోవాలో.. ఏది వదులుకోవద్దో అన్నింటికీ లెక్కలు ఉంటాయి లాస్య అంటుంది తులసి. భాగ్య నేను ఎక్కుపెట్టిన బాణం అంటుంది లాస్య. అయినా తులసి ఏమాత్రం భయపడదు.

Intinti Gruhalakshmi 7 April Today Episode : మ్యూజిక్ డైరెక్టర్ వద్ద పనికి కుదిరిన ప్రేమ్

ఆ ఇల్లు అమ్మకపోతే అప్పు తీరదు. అప్పు తీర్చకపోతే శశికళ ఊరుకోదు. ఇల్లు మేము అమ్మనీయము. ఇప్పుడు నీకు ఇల్లు పాయె.. పరువు పాయె.. అంటుంది లాస్య. మరోవైపు ప్రేమ్ మ్యూజిక్ డైరెక్టర్ ను కలవడానికి ఆఫీసుకు వెళ్తాడు.

మ్యూజిక్ డైరెక్టర్ మప్పిలి హరిని కలుస్తాడు. ఇంతలోనే ఓ అమ్మాయి వచ్చి పాటలు పాడేందుకు అవకాశం కావాలంటుంది. దీంతో ప్రేమ్ ను వదిలేసి తనతో మాట్లాడుతాడు మ్యూజిక్ డైరెక్టర్. ఆ తర్వాత ప్రేమ్ కూడా పాట పాడి వినిపిస్తాడు.

కానీ.. సరిగ్గా వినడు మ్యూజిక్ డైరెక్టర్. కొన్నాళ్లు నాతో పనిచేయి. కాలాన్ని బట్టి అవకాశం వస్తే అప్పుడు చూద్దాం అంటాడు మ్యూజిక్ డైరెక్టర్. దీంతో శృతి చెప్పిన మాటలు గుర్తొచ్చి అలాగే సార్.. థాంక్యూ అంటాడు. మరోవైపు ఇంట్లో వాటా అయినా సంపాదిద్దాం.. కోర్టులో కేసు వేయాలి.. మీరు వెంటనే బయలుదేరి రండి అని తన భర్తకు ఫోన్ లో చెబుతుంది భాగ్య.

ఆ విషయం తులసి వింటుంది. నేను వచ్చి మాట్లాడేవరకు కూడా ఆగలేకపోయావా భాగ్య అని అడుగుతుంది తులసి. నేను అప్పు చేసింది మామయ్య గారి ఆపరేషన్ కోసం అంటుంది తులసి. మరోవైపు శశికళ వచ్చి అప్పు తీరుస్తావా.. లేక ఇల్లు రాసిస్తావా అంటుంది.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఇంటిని మీకే ఇవ్వాల్సి వస్తోంది. ఇక నుంచి ఈ ఇల్లు మీది అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp