Acharya : ఆచార్య పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కి సిద్దమవుతోందా.?.. చేస్తే ప్రమాదమే అంటున్న మెగా ఫ్యాన్స్
Acharya : మెగా స్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మూవీ ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతేడాది సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ నెల 29 న రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.ఇప్పటికే ఆచార్య చిత్రం నుంచి విడుదలైన స్పెషల్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. తిరు సినిమాటోగ్రఫీ అందించగా.. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు.
నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ మూవీ దేవాదాయ శాఖకు సంబంధించిన కథాంశంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ నక్సలైట్లుగా కూడా కనిపించనున్నారని టాక్. కాగా మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్.. చరణ్ కు జోడీగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు.అయితే రామ్ చరణ్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ప్రపంచవాప్తంగా రిలీజై రికార్డుల సృష్టిస్తోంది. దీంతో చెర్రీ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆచార్య మూవీ కూడా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి మెగా ఫ్యాన్స్ కి ఏమాత్రం ఇష్టం లేదట..
Acharya : ఆ స్థాయి ఉందా..
ఎందుకంటే ఆచార్యలో రామ్ చరణ్ పూర్తి స్థాయి రోల్ కాదు.. పైగా ఈ మూవీని ఆ రేంజ్ లో నిర్మించారో లేదో కూడా తెలియదని అభిప్రాయపడుతున్నారు. రామ్ చరణ్ కెరీర్ కి మైనస్ అయ్యే చాన్స్ ఉంటుందని వ్యక్తపరుస్తున్నారు.అయితే ఆచార్య నిర్మాతలలో ఒకరైన అవినాష్ రెడ్డి మాత్రం ఓన్లీ తెలుగులోనే విడుదల చేస్తామని, మా దృష్టి పాన్ ఇండియా పై లేదన్నట్లు సమాచారం. తెలుగులోనే భారీగా విడులకు ప్లాన్ చేస్తున్నామని, తెలుగు రాష్ట్రాలలో దాదాపు 2000స్క్రీన్ లలో ఆచార్య విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్‌లో కూడా భారీగా విడుదల చేస్తామని వెల్లడించినట్లు టాక్. రిలీజ్ డేట్ కూడా దగ్గరలోనే ఉండటంతో ఏం చేయనున్నారో వేచి చూడాల్సిందే…