Intinti Gruhalakshmi 7 June Today Episode : ఆస్తి అభి పేరు మీదనా.. లేక అంకిత పేరు మీదనా.. లాస్య, గాయత్రి ప్లాన్ సక్సెస్ అవుతుందా? ఆస్తిని లాస్య కాజేస్తుందా?
Intinti Gruhalakshmi 7 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 జూన్ 2022, మంగళవారం ఎపిసోడ్ 652 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మూడో మనిషి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు అని అంటుంది గాయత్రి. అత్తారింటికి వెళ్లిన కూతురు మీద నీకు ఎలాంటి హక్కు లేదు అని అంటుంది అంకిత. మీ ఇద్దరిదీ ఒకే మనస్తత్వం. అందుకే.. తను తన తల్లికి దూరం అవుతున్నాడు.. అంటుంది అంకిత. నువ్వు లాస్య మాయలో ఉన్నావని అంకిత అంటే.. కాదు నువ్వు తులసి మాయలో ఉన్నావు అంటుంది గాయత్రి. నీ దగ్గర్నుంచి ఆంటి పైసా అయినా ఆశించిందా. నువ్వు ఎందుకు ఇంత హైరానా పడుతున్నావు అంటుంది అంకిత. దీంతో అది నీదాకా వచ్చిందా అని ప్రశ్నిస్తుంది గాయత్రి. లేనిపోని భయాలతో అనుమానాలు పెంచుకుంటున్నావు. ఎప్పుడు కాటేస్తుందో తెలియని పాము లాంటి లాస్య ఆంటిని ఆపేక్షగా కౌగిలించుకుంటున్నావు అంటుంది అంకిత.
ఆ మంచితనం ఒక నటన. అది నీకు తెలియడం లేదు అంటుంది గాయత్రి. కొడుకు తన మాట వినడం లేదని.. నీ ద్వారా మచ్చిక చేసుకోవాలని చూస్తోంది తులసి అని అంటుంది గాయత్రి. ఆస్తి నా పేరు మీదికి వచ్చిన వెంటనే నా అంతట నేనే ఆ ఆస్తిని తులసి ఆంటి పేరు మీద రాసేస్తా అని గాయత్రిని బెదిరిస్తుంది అంకిత. నేను బెదిరించడం లేదు.. నేను చేయబోయేది అదే అని అంటుంది అంకిత. నువ్వు ఏం చేస్తావో చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అంకిత. దీంతో ఏం చేయాలో అర్థం కాదు గాయత్రికి. మరోవైపు నందు తనను అన్న మాటలే తులసికి గుర్తొస్తాయి. నీ కోపం ఎంత తుడిచినా మరక మీదనా లేక ఎంత చెప్పినా అర్థం చేసుకోని అభి మీదనా అంటాడు పరందామయ్య. నీ కొడుకు గురించి ఆలోచించడం ఎప్పుడో మరిచిపోయాను మామయ్య.
సాంప్రదాయానికి కట్టుబడి ఉన్న భార్యను కదా భరించాను కానీ.. ఆయన వల్ల నా బిడ్డలకు ఏదైనా అయితే మాత్రం సహించను. అమ్మను కదా. నాకు నా బిడ్డల తర్వాతే ఎవరైనా అని అంటుంది తులసి. దీంతో పరందామయ్య ఏం మాట్లాడలేకపోతాడు.
మరోవైపు లాస్య.. అభి, గాయత్రిని కలుస్తుంది. తులసిని ఎందుకు దూరంగా ఉంచుతున్నామో ఈపాటికి నీకు అర్థం అయ్యే ఉంటుంది అంటుంది గాయత్రి. మనసులో ఎంత బాధ లేకపోతే మనతో ఇలా పంచుకుంటాడు చెప్పు అంటుంది లాస్య.
Intinti Gruhalakshmi 7 June Today Episode : అభి పేరు మీద ఆస్తి రాయమని గాయత్రికి లాస్య సలహా
నా బిడ్డ ఎప్పుడు తన మాయ నుంచి బయటపడుతుందో అని దొంగ ఏడుపు ఏడుస్తుంది గాయత్రి. పాతికేళ్లు పెంచాను.. నా మాటే అది వినదు. ఇక అభి మాట ఏం వింటుంది అంటుంది గాయత్రి. దీంతో పాతికేళ్లు పెంచడం వేరు.. నూరేళ్లు కలిసి బతకడం వేరు అంటుంది లాస్య.
అసలు.. మామ్ ఏమనుకుంటోంది. డాడ్ గురించి నాతో చెడుగా చెప్పడం ఏంటి. నన్ను, డాడ్ ను వేరు చేద్దామనుకుంటోందా అని అంటాడు అభి. వాళ్ల నాన్న నుంచి నేను ఏనాడూ విడిపోమని నేను అనలేదు కదా.. కలిసే ఉండమన్నాను కదా అంటుంది తులసి.
తన స్వార్థం కోసం లాస్య ఎంతకైనా తెగిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి అంటాడు పరందామయ్య. అభికి తొందరపాటు ఎక్కువ. మనుషులను తొందరగా నమ్మేస్తాడు అంటుంది తులసి. మరోవైపు మామ్… నేను చేతగాని వాడిని.. తెలివి లేని వాడిని అని అనుకుంటోంది అని అంటాడు అభి.
అంకిత మొండిది. ఆస్తి కూడా తులసి పేరు మీదనే రాసేస్తా అని అంటుంది అని లాస్యకు గాయత్రి చెబుతుంది. దానికి మామ్ ఒప్పుకుంటుందా అని అంటాడు అభి. అంకితకు మన మీద ఉన్న ఉక్రోశాన్ని తులసి తన స్వార్థానికి వాడుకుంటోంది. అంకితను రెచ్చగొట్టి మరీ ఆస్తి రాయించుకుంటోంది అని అంటుంది లాస్య.
అంకిత ఇప్పుడు నువ్వు చెప్పినా కూడా వినదు.. అంటుంది లాస్య. ఆస్తి మామ్ పేరు మీదికి వెళ్తే ఇక తను చెప్పినట్టు వినాల్సిందే. అసమర్థుడు అనే ముద్రను నేను లైఫ్ లాంగ్ మోయాల్సిందే. నేను నా కూతురును శాశ్వతంగా దూరం చేసుకోవాల్సి వస్తుంది. నా బాధ ఎవరికి చెప్పుకోను అంటుంది గాయత్రి.
ప్రస్తుతానికి ఆస్తిని అంకిత పేరు మీదికి మార్చొద్దని అంకుల్ కు చెప్పండి అంటాడు అభి. ఇంతలో లాస్య గాయత్రికి ఒక సలహా ఇస్తుంది. ఆస్తిని అంకిత పేరు మీద కాకుండా.. అభి పేరు మీదకు మార్చండి అంటుంది. పుట్టింటి ఆస్తి కూతురుకు కానీ.. అల్లుడికి కాదు అంటాడు అభి.
నాకు ఈ ప్రపోజల్ ఇష్టం లేదు ఆంటి అంటాడు అభి. ఆస్తి అభి పేరు మీద ఉంటేనే.. అంకితకు నిజమైన మొగుడై కూర్చుంటాడు అంటుంది లాస్య. లాస్య ఆంటి మాటలు వినడానికి మంచిగానే ఉన్నాయి కానీ.. చంకలు గుద్దుకోవడం మంచిది కాదేమో అని అనుకుంటాడు అభి.
మా ఆయన్ను ఒప్పించి.. నువ్వు చెప్పినట్టే చేస్తాను.. అంటుంది గాయత్రి. ఆంటి అలా కాదు అంటూ ఏదో చెప్పబోతాడు అభి. కానీ.. గాయత్రి వినదు. చివరకు అభి పేరు మీద ఆస్తి రాయించాలని అనుకుంటుంది. కానీ.. అంకిత తండ్రి మాత్రం ఆస్తిని అంకిత పేరు మీద రాయిస్తాడు.
ఆ విషయం తెలిసి అభికి కోపం వస్తుంది. వెళ్లి తులసి మీద విరుచుకుపడతాడు. తన ముఖం కూడా చూడను అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.