Intinti Gruhalakshmi 9 Aug Today Episode : సామ్రాట్ కు తులసి ఫ్రెండా? లేక లవరా? సామ్రాట్ తో కలిసి తులసి వైజాగ్ వెళ్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 9 Aug Today Episode : సామ్రాట్ కు తులసి ఫ్రెండా? లేక లవరా? సామ్రాట్ తో కలిసి తులసి వైజాగ్ వెళ్తుందా?

 Authored By gatla | The Telugu News | Updated on :9 August 2022,9:30 am

Intinti Gruhalakshmi 9 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 ఆగస్టు 2022, మంగళవారం ఎపిసోడ్ 706 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సామ్రాట్ గురించి తులసికి ఏం తెలియదు. తెలిస్తే ఎప్పుడో దూరం అయ్యేది అని లాస్యతో నందు అంటాడు. తులసి గురించి నీకెందుకు అంటుంది లాస్య. కానీ..నందు వినడు. ముందు తులసిని సామ్రాట్ తో కలిసి వైజాగ్ వెళ్లకుండా ఆపాలి అని వెంటనే అనసూయకు ఫోన్ చేస్తాడు నందు. ఆ సామ్రాట్ అసలే మంచోడు కాదు అంటాడు నందు. దీంతో అయితే లాస్యను జాగ్రత్తగా ఉండమను అంటుంది. దీంతో నేను చెప్పేది లాస్య గురించి కాదు. లాస్యను చూసుకోవడానికి నేను ఉన్నాను కానీ తులసిని చూసుకోవడానికి ఎవరూ లేరు అంటాడు. నేను సామ్రాట్ గురించి ఫిర్యాదు చేస్తున్నా. తులసిని సామ్రాట్ తో వైజాగ్ పంపించకు అని చెబుతాడు నందు. నందు చెబుతున్న విషయాలు విని వెంటనే ఫోన్ కట్ చేస్తుంది అనసూయ.

intinti gruhalakshmi 9 august 2022 full episode

intinti gruhalakshmi 9 august 2022 full episode

తులసిని వైజాగ్ వెళ్లకుండా మా అమ్మ ఆపుతుంది అంటాడు నందు. మరోవైపు కూరగాయలు కోస్తూ ఉంటుంది తులసి. దాని తను వైజాగ్ వెళ్లే విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో అడిగి చెప్తా అన్నా కానీ ఎలా అడగను అని అనుకుంటుంది తులసి. అడగడానికి నాకే ఇంత ఇబ్బంది ఉంటే ఒప్పుకోవడానికి వాళ్లకు ఎంత ఇబ్బందిగా ఉండాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది తులసి. వైజాగ్ వెళ్లడం గురించి అత్తయ్య, మామయ్యను అడిగేస్తాను అని అనుకుంటుంది తులసి. వాళ్ల దగ్గరికి వెళ్తుంది తులసి. ఇంతలో వైజాగ్ విషయం అనసూయే చెబుతుంది. దీంతో తులసి షాక్ అవుతుంది. మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది తులసి.

Intinti Gruhalakshmi 9 Aug Today Episode :  తులసికి పర్మిషన్ ఇచ్చేసిన అనసూయ

తులసి వైజాగ్ వెళ్లడానికి అనసూయ ఒప్పుకుంటుంది కానీ.. దివ్య మాత్రం నువ్వు మిమ్మల్ని అలా వదిలేసి వెళ్తే మేము ఏం చేయాలి అంటుంది దివ్య. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు అమ్మ కావాలి అంటూ హనీ.. సామ్రాట్ తో అంటుంది.

అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అమ్మ బతికి ఉంటే తులసి ఆంటిలాగానే ఉండేది కదా అంటుంది హనీ. నాకు ఎందుకో అలా అనిపించింది. తులసి ఆంటిని అలా పిలవాలనిపించింది కానీ భయం. తను ఏమనుకుంటుందో అని అంటుంది హనీ. దీంతో ఏం మాట్లాడాలో సామ్రాట్ కు అర్థం కాదు.

తనను పడుకోబెట్టి తను కూడా నిద్రపోతాడు. ఇంతలో తులసి కలలోకి వస్తుంది. తను వీణ వాయిస్తూ పాట పాడుతున్నట్టు తనకు కల వస్తుంది. దీంతో తులసి నా ఫ్రెండ్ మాత్రమే అని మనసులో అనుకుంటాడు సామ్రాట్. ఏదేదో ఊహించుకోకు అని తనకు తాను సర్ది చెప్పుకుంటాడు సామ్రాట్.

మరోవైపు ఇంట్లో వాళ్లంతా వైజాగ్ వెళ్లేందుకు ఒప్పుకోవడంతో తులసి సంతోషిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది