Intinti Gruhalakshmi Lasya : కొంచెం టైం దొరికితే చేసే పని ఇదేనట.. గృహలక్ష్మీ లాస్య వీడియో వైరల్

Authored By aruna | The Telugu News | Published on: September 2, 2022, 11:30 am

Intinti Gruhalakshmi Lasya : ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్‌తో లాస్య పాత్ర ఎంతగానో ఫేమస్ అయింది. లాస్య కారెక్టర్‌లో యాంకర్ ప్రశాంతి ఇంకా ఎంతో క్రేజ్ దక్కించుకుంది. ఆమె క్రేజ్ రోజురోజుకూ పెరుుగుతూ వస్తోంది. గృహలక్ష్మీ సీరియల్ ఒకప్పుడు మంచి రేటింగ్‌తో దూసుకుపోయింది. అయితే ఇప్పుడు కథ, కథనాలు గాడి తప్పడంతో టీఆర్పీ రేటింగ్ ఢమాల్ అంటూ పేలిపోయింది. అయితే లాస్య పాత్రలో మాత్రం యాంకర్ ప్రశాంతి అందరినీ మెప్పిస్తూనే ఉంది. మామూలుగా అయితే గృహలక్ష్మీ సీరియల్‌తో యాంకర్ ప్రశాంతి పూర్తి స్థాయి నటిగా మారింది. విలనిజానికి గ్లామర్ అద్దింది.

అందమైన లేడీ విలన్లలో యాంకర్ ప్రశాంతి రూటే సపరేట్ అన్నట్టుగా మారింది. యాంకర్ ప్రశాంతి క్రేజ్ బాగా పెరగడంతో ఇతర సీరియల్స్‌లో అవకాశాలు పెరిగాయి. కానీ ఆమె మాత్రం మామూలు పాత్రలను ఎంచుకోవడం లేదు. ఛాలెంజింగ్‌గా ఉండే రోల్స్ మాత్రమే చేస్తానంటూ సెలెక్టివ్‌గా ఉంటోంది ప్రశాంతి. ఈ మధ్యే ప్రశాంతి మరో సీరియల్‌ను కూడా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ రెండు సీరియల్స్‌తో ప్రశాంతి బిజీగా ఉంది. ఒకప్పుడు అయితే నెలలో పదిహేను రోజులు గృహలక్ష్మీ కోసమే కేటాయించేదట. ఇప్పుడు మరో సీరియల్ చేతిలోకి వచ్చేసింది.

Intinti Gruhalakshmi Lasya Fame Anchor Prashanthi Makeup Video

Intinti Gruhalakshmi Lasya Fame Anchor Prashanthi Makeup Video

ఈ రెండు సీరియల్స్, సోషల్ మీడియా మ్యానేజింగ్‌తోనే ఫుల్ టైం గడుస్తోందన్న మాట. ఈ మధ్య బుల్లితెర తారలంతా కూడా యూట్యూబ్ చానెళ్లతో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. గృహలక్ష్మీ లాస్య సైతం ప్రశాంతి అంటూ ఓ యూట్యూబ్ చానెల్‌ను పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అందులో తాను ఖాళీగా ఉన్నప్పుడు చేసే పనులేంటో చెప్పింది. మేకప్ చేయించుకోవడం, స్పెషల్ ఫోటో షూ్లు చేయడంతో బిజీగా ఉంటాను అని చెప్పేసింది

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp