Intinti Gruhalakshmi : గృహలక్ష్మీ లాస్య డిమాండ్ ఇదే.. కొత్త అడుగు వేసిన యాంకర్ ప్రశాంతి
Intinti Gruhalakshmi : యాంకర్ ప్రశాంతిగా బుల్లితెరపై ఓ మాదిరి క్రేజ్ వచ్చింది. కానీ గృహలక్ష్మీ సీరియల్‌లో అందమైన, గ్లామరస్ విలన్‌గా అందరినీ ఆకట్టుకుంది. లాస్య పాత్రలో యాంకర్ ప్రశాంతి అదరగొట్టేస్తుంది. తన విలనిజంతో అందరినీ భయపెట్టేస్తోంది. అందరూ ఆ పాత్రను అంతలా అసహ్యించుకుంటున్నారంటే లాస్యగా ప్రశాంతి తన మార్క్ ఎలా వేసిందో అందరికీ అర్థమవుతోంది. అయితే యాంకర్ ప్రశాంతి నెట్టింట్లో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అలా తనకు బుల్లితెరపై వచ్చిన క్రేజ్‌ను సోషల్ మీడియా ద్వారా ఇంకా పెంచుకుంటూ పోతోంది.
యాంకర్ ప్రశాంతి నిత్య ఏదో ఒక పోస్ట్ చేస్తుంటుంది.లైవ్‌లోకి వస్తుంది.. తన అభిమానులతో ముచ్చట్లు పెడుతుంటుంది. సెట్‌లోని సంగతులను చెబుతుంది. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటుంది. లాస్య పాత్రను తాము ఎంతగా ఇష్టపడుతుంటారో అభిమానులు చెబుతుంటే మురిసిపోతుంది. యాంకర్‌గా కంటే.. లాస్య పాత్రతోనే తనకు ఎక్కువ గుర్తింపు వచ్చిందని చెబుతుంటుంది. అయితే ఇంకో సీరియల్‌లో నటించరా? అని అందరూ అడుగుతుంటారు. కానీ టైం సరిపోవడం లేదని ప్రశాంతి చెప్పుకొచ్చింది.

Intinti Gruhalakshmi Lasya Fame Anchor Prashanthi New Serial Deavathalaara Deevinchandi in In Zee Telugu
నెలలో పదిహేను రోజులు షూటింగ్, డబ్బింగ్‌లతోనే సరిపోతుందని అందుకే ఇంకా సీరియల్స్‌లో నటించడం లేదని అంటుంది. మంచి చాలెంజింగ్ పాత్రలు వస్తే చేస్తాను అంటూ చెబుతుంటుంది. విలన్ పాత్రల్లోనే నటించే స్కోప్ ఎక్కువగా ఉంటుందని చెబుతుంది. అందుకే తనకు విలన్ పాత్రలంటేనే ఇష్టమని తెలుపుతుంటుంది. అయితే ఇప్పుడు యాంకర్ ప్రశాంతి మరో కొత్త సీరియల్‌తో అలరించేందుకు రెడీ అయింది. తన ఫ్యాన్స్‌కు ముందు కొత్త సీరియల్‌తో రాబోతోన్నట్టు ప్రకటించింది.
జీ తెలుగులో దేవతలారా దీవించండి అనే కొత్త సీరియల్ రాబోతోందట. ఇందులో యాంకర్ ప్రశాంతి నటిస్తోందంట. ఈ మేరకు అందరి ఆశీర్వాదం కావాలంటూ యాంకర్ ప్రశాంతి పోస్ట్ చేసింది. దీంతో అందరూ కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి లాస్య పాత్రను మరిపించేలా ఈ కొత్త సీరియల్‌లో మెప్పిస్తుందా? లేదా? అన్నది చూడాలి.