Karthika Deepam : తగ్గిన ‘కార్తీక దీపం’ ప్రభ.. ముందంజలో ‘గృహలక్ష్మి’..
Karthika Deepam : బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ సీరియల్ అయిన ‘కార్తీక దీపం’కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా గృహిణులు ప్రతీ ఒక్కరు ఈ సీరియల్ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఎక్కడ చూసినా వంటలక్క, డాక్టర్ బాబుల గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇకపోతే చాలా మంది విశ్లేషకులు, ఎంటర్ టైన్మెంట్ మేధావులు కూడా ఈ సీరియల్ రేటింగ్ చూసి ఆశ్చర్యపోవడమే కాదు.. బుల్లితెర బాహుబలి ఈ సీరియల్ అని అంటుంటారు. కానీ, తాజాగా ఈ సీరియల్ రేటింగ్స్ ను క్రాస్ చేసింది ‘గృహలక్ష్మి’ సీరియల్. అలా ‘కార్తీక దీపం’ ప్రభ తగ్గిపోయింది.
‘కార్తీక దీపం’ సీరియల్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ వైడ్ గా బాగా పాపులర్ అయింది. అలా ఈ సీరియల్ కు మంచి పేరు వచ్చింది. ఇక రేటింగ్స్ చూసి నిర్వాహకులు ఆనందపడిపోయారు. కానీ, కాలం మారింది. సీరియల్ చాలా బోరింగ్ అయిపోయింది. అలా ఈ సీరియల్ రేటింగ్ పైనా ఎఫెక్ట్ పడింది. మోనిత ప్రగ్నెంట్ ట్విస్ట్ బుల్లితెర మీద ప్రసారం అయిన నాటి నుంచి సీరియల్ స్టోరి ట్రాక్ తప్పందనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అలా ఈ సీరియల్ రేటింగ్ 16 నుంచి 20 మధ్య ఉండాల్సింది. కాస్తా.. 11 నుంచి 14 మధ్యకు వచ్చేసింది.

intinti gruhalaxmi Beat Karthika deepam serial in TRP Rating
Karthika Deepam : ట్రాక్ తప్పిక ‘కార్తీక దీపం’..
ఈ సీరియల్ రేటింగ్స్ అలా పడిపోవడానికి కారణం వంటలక్క, డాక్టర్ బాబుల నుంచి స్టోరి..మారిపోవడమేనని, మోనిత ప్రగ్నెంట్ ట్విస్ట్ ప్రేక్షకులకు నచ్చలేదని కొందరు అంటున్నారు. ఇకపోతే తాజాగా ‘కార్తీక దీపం’ సీరియల్ రేటింగ్‌ను ‘గృహలక్ష్మి’ సీరియల్ బీట్ చేసింది. ‘గుప్పెడంత మనసు, దేవత’ సీరియల్స్ కూడా ‘కార్తీక దీపం ’సీరియల్ రేటింగ్స్‌ను క్రాస్ చేశాయి. ఇప్పటికైనా ‘కార్తీక దీపం’ సీరియల్‌ను ముగించకపోతే భవిష్యత్తులో ఆ సీరియల్ ఉన్న కాస్త పేరు కూడా పోతుందని కొందరు సూచిస్తున్నారు.