Ram Charan : ఎన్నడూ లేనిది రామ్ చరణ్ – ఉపాసన మధ్య అతిపెద్ద గొడవ ? మ్యాటర్ పెద్దదే !

Advertisement

Ram Charan : ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్ – ఉపాసనల గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన రామ్ చరణ్ ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత బిడ్డ పుట్టడంతో రామ్ చరణ్ దంపతులు తమ బిడ్డను క్షణం కూడా వదలడం లేదు. ఇటీవల ఆ బిడ్డకు క్లీం కారా అనే పేరు కూడా పెట్టారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా రాంచరణ్ ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఆ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ అసలు అమ్మాయిలకు గిఫ్ట్ ఇవ్వడం అనేది పెద్ద టాస్క్ ఎలాంటి పనులైన చేయొచ్చు కానీ అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చే పనులు మాత్రం పెట్టుకోకూడదు. పెళ్లయిన కొత్తలో నేను కూడా ఉపాసనకు గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకెళ్లాను ఐతే అది చూసి ఉపాసన ఆశ్చర్యపోలేదు, ఫైర్ అయిపోయింది. ఆ గిఫ్ట్ తనకు నచ్చలేదు. అంతేకాదు ఆ గిఫ్ట్ తనకి సూట్ అవ్వదు అంటూ కూడా చెప్పుకొచ్చింది అంతేకాకుండా నా చంప కూడా పగలగొట్టింది అందుకే అప్పటినుంచి గిఫ్ట్ కొనడమే మానేశాను.

Advertisement
Intresting news about Ram Charan and Upasana
Intresting news about Ram Charan and Upasana

ఏదైనా కావాలంటే తీసుకెళ్లి కొనివ్వడమే తప్పిస్తే ఇలాంటి సర్ప్రైజ్లు అస్సలు ఇవ్వను, అమ్మాయిలకు ఏ సర్ప్రైజ్ ఇవ్వాలో అర్థం కాదు అందుకే అంటూ రాంచరణ్ ఉపాసన గురించి చెప్పుకొచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఉపాసనల గురించి న్యూస్ వైరల్ అవుతుంది. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ గేమ్ ఛేంజర్ ‘ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ ఈ సినిమాతో కూడా పాన్ ఇండియా స్థాయిలో అందరిని మెప్పించాలని కష్టపడుతున్నాడు.

Advertisement
Advertisement