టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ – రష్మిక మందన జంటకు మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి గీతగోవిందం , డియర్ కామ్రేడ్ సినిమాలో కలిసి నటించారు. లిప్ లాక్ సన్నివేశాలలో ఇద్దరు మొహమాటం లేకుండా నటించారు. ఇక బయట కూడా వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. ఇక విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి రష్మిక మందన ఫ్రెండ్ అయిపోయింది. చిన్న చిన్న వేడుకలకు కూడా రష్మిక మందన హాజరవుతూ ఉంటుంది. విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే వేడుకల్లో రష్మిక మందన మాత్రమే కనిపిస్తుంది. ఇండస్ట్రీకి చెందిన విజయ్ క్లోజ్ ఫ్రెండ్స్ కి కూడా ఆహ్వానం ఉండదు.
అలాగే విజయ్ రష్మిక కలిసి టూర్స్ కి వెళుతుంటారు. విడివిడిగా అక్కడికి వెళ్లి ఒకే రూమ్లో స్టే చేస్తుంటారు. ఒకసారి మీడియాకు చిక్కడంతో మీరు కలిసే టూర్స్ కి వెళుతున్నారు కదా అని అడిగితే అందులో తప్పేముంది విజయ్ దేవరకొండ నా క్లోజ్ ఫ్రెండ్, ఫ్రెండ్స్ తో టూర్ కి వెళితే తప్పేముంది అని ఎదురు ప్రశ్నిస్తుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్న ఓపెన్ గా మాత్రం చెప్పడం లేదు. అయితే తాజాగా మరోసారి వీరి ప్రేమ వ్యవహారం చర్చకు వచ్చింది. గతంలో విజయ్ దేవరకొండ ధరించిన షర్ట్ ఇప్పుడు రష్మిక ధరించి కనిపించింది. ఒకసారి విజయ్ దేవరకొండ బ్లూ కలర్ చెక్ షర్ట్ ధరించారు. అదే చొక్కాలో ఇప్పుడు రష్మిక దర్శనం ఇచ్చారు.

ఆయనకు ఫిట్ గా ఉండగా, రష్మికకు ఆ షర్ట్ కొంచెం లూజ్ గా ఉంది. కాబట్టి ఇది విజయ్ దేవరకొండ చొక్కా అని వీరు ఒకరి బట్టలు మరొక్కరు వాడుకుంటున్నారని ప్రచారం మొదలైంది. ఓకే షర్ట్ వేసుకున్న విజయ్ దేవరకొండ రష్మిక ఫోటోలు బయటకు తీసి పోలిస్తున్నారు ఇప్పుడు ఇది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే రష్మిక విజయ్ సినిమాల పరంగా చాలా బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ నటించిన ‘ ఖుషి ‘ సినిమా విడుదలకు రెడీగా ఉంది. మరో రెండు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక రష్మిక పుష్ప 2, యానిమల్, రెయిన్ బో సినిమాలలో నటిస్తున్నారు.