పేరెంట్స్ ఒప్పుకుంటే చాలు .. రష్మిక – విజయ్ దేవరకొండ ల కొత్త ప్లాన్ ఇదే !

Authored By aruna | The Telugu News | Published on: June 28, 2023, 8:00 pm

‘ గీత గోవిందం ‘ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక. ఈ సినిమాతో వీళ్ళిద్దరి జంటకి ఫుల్ ఫాన్స్ అయిపోయారు. అలాగే విజయ్ దేవరకొండ రష్మిక రియల్ లైఫ్ లో కూడా చాలా క్లోజ్ గా ఉంటారు. దీంతో ఈ కపుల్ ను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని సోషల్ మీడియాలో ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారని న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇదంతా నిజం కాదని, మా ఇద్దరి మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని విజయ్ దేవరకొండ రష్మిక చాలా సార్లు చెప్పుకొచ్చారు.

అయినా సోషల్ మీడియాలో వీరిద్దరిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. పాన్ ఇండియా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూనే ఉంది. లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హీరోగా మంచి గుర్తింపు పొందాలని విజయ్ దేవరకొండ ప్రయత్నించిన అది సక్సెస్ కాలేదు. ఈ క్రమంలోనే ఇద్దరు లైఫ్ లో సెటిల్ అయ్యాక ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నాయని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అయితే కావాలనే కొందరు సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి పెళ్లి గురించి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అని అంటున్నారు.

Intresting news about Vijay devarakonda and Rashmika

Intresting news about Vijay devarakonda and Rashmika

అంతేకాకుండా ఇండస్ట్రీలో అంతమంది హీరోలు ఉన్న రష్మిక విజయ దేవరకొండ నే ఎందుకు ఇష్టపడింది అని సోషల్ మీడియాలో న్యూస్ ఆసక్తికరంగా మారింది. అయితే చాలామంది విజయ్ దేవరకొండలోని గట్స్, సిన్సియారిటీ, పంక్చువాలిటీ రష్మిక కి నచ్చాయని అభిమానులు చెబుతున్నారు. దీనికి రష్మిక నే ఆన్సర్ ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇకపోతే రష్మిక ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తుంది. విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ లో విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp