Charmy : ఛార్మికి పెళ్ళి చేసుకోమని సలహాలిచ్చింది ఆయనేనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Charmy : ఛార్మికి పెళ్ళి చేసుకోమని సలహాలిచ్చింది ఆయనేనా..?

 Authored By govind | The Telugu News | Updated on :8 May 2021,2:00 pm

Charmy : ఛార్మి టాలీవుడ్ లో నీతోడు కావాలి సినిమాతో పరిచయం అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకోవడంతో నితిన్, ఎన్.టి.ఆర్, రవితేజ, జగపతి బాబు, ప్రభాస్, వెంకటేశ్, సుమంత్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో నటించిది. సూపర్ హిట్స్ అందుకున్న ఛార్మి హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాక స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. అలాగే బోల్డ్ క్యారెక్టర్ అయిన జ్యోతిలక్ష్మి గానూ కనిపించింది. మంత్ర లాంటి థ్రిల్లర్ సినిమాలతోను ఆకట్టుకుంది. ఇలా దాదాపు 10 ఏళ్ళ పైనే హీరోయిన్ గా నటించిన ఛార్మి నటిగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది.

is he gave advice charmi to get marry

is-he-gave-advice-charmy-to-get-marry

కానీ నిర్మాతగా మారి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతున్న లైగర్ సినిమాకి ఒక నిర్మాతగా వ్యవహరిస్తోంది. విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. సినిమాకి సంబంధించిన అన్నీ విషయాలను దగ్గరుండి చూసుకుంటున్న ఛార్మి మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తే బావుటుందని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ మళ్ళీ ఛార్మి సినిమాల కోసం మేకప్ వేసుకునే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

Charmy : ఛార్మి పెళ్ళికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

కాగా ప్రస్తుతం ఛార్మి పెళ్ళికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఛార్మికి పెళ్ళి చేసుకోమని సలహా ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఛార్మి కూడా తన తల్లిదండ్రులు చూసిన సంబంధం ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. దగ్గర బంధువును త్వరలో పెళ్ళి చేసుకోనుందని టాక్ వినిపిస్తోంది. మూడు పదుల వయసు దాటిన ఛార్మి ఎప్పుడు పెళ్ళి పీటలెక్కుతుందో చూడాలి. ఒకవేళ పెళ్ళి చేసుకుంటే ఇండస్ట్రీకి దూరమవుతుందా లేక కంటిన్యూ అవుతుందా అనే విషయంలో క్లారిటీ లేదు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది