Thaman : థమన్ భయ్యా ఇది కాన్‌ఫిడెన్స్ అయితే ఓకే..ఓవర్ కాన్‌ఫిడెన్స్ అయితే..?
Thaman : మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి ఊపు మీదున్న సంగీత దర్శకుడు. ఏ సినిమాకు పనిచేసినా ఆ సినిమా సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదరగొడుతున్నాడు. అరవింద సమేత, అల వైకుంఠపురము లో, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, అఖండ ఇలా వరుసగా థమన్ సంగీతం అందించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ సాధిస్తే దానిలో సగం క్రెడిట్ థమన్‌కు వెళుతోంది. అంతగా థమన్ సత్తా చాటుతూ వస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్ కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నాడు. ఒక్కో సాంగ్ లిరికల్ వీడియోను గ్రూప్ డాన్సర్స్‌తో ప్లాన్ చేసి ఆకట్టుకుంటున్నాడు.
అయితే, కాస్త మళ్ళీ థమన్ జోరు తగ్గిందనే కామెంట్స్ మొదలయ్యాయి. వరుసగా భారీ చిత్రాలు, మీడియం రేంజ్ చిత్రాలను ఒప్పుకోవడం వల్ల ఖాళీ దొరకక కొన్ని సాంగ్స్ సో సోగానే ఉంటున్నాయని చెప్పుకుంటున్నారు. ఇక థమన్ మీద ఎటూ కాపీ ట్యూన్స్ అనే కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవల వచ్చిన గని సినిమా మ్యూజిక్ పరంగా పెద్ద మైనస్ అయిందని చెప్పుకున్నారు. ఇందులో ఉన్న తమన్నా స్పెషల్ సాంగ్ కూడా గతంలో బ్రూస్‌లీ సినిమాలో థమన్ కంపోజ్ చేసిన సాంగ్ మాదిరిగానే ఉందని కామెంట్స్ చేశారు. అలా, థమన్ మళ్ళీ నెటిజన్స్ ట్రోల్స్‌కు గురవుతున్నాడు.
Thaman : థమన్ చెబుతున్న మాటలు ఎంత వరకు నిజమవుతాయో.
ఇక తాజాగా థమన్ సర్కారు వారి పాట సినిమా గురించి బాగా హైప్ క్రియేట్ చేస్తున్నాడు. సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని మాస్ ట్రీట్ ఓ రేంజ్‌లో ఉంటుందని థమన్ హడావుడి చేస్తున్నాడు. మే 12న సర్కారు వారి పాట రిలీజ్ కాబోతోంది. వరుస సక్సెస్‌లను అందుకుంటున్న మహేశ్ కెరీర్‌లో ఇది మరో పోకిరిలా నిలుస్తుందని చిత్రబృందనే ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. అందరికంటే ఎక్కువగా చెప్పుకొస్తుంది థమనే. అందుకే, మరీ ఇది ఓవర్ కాన్‌ఫిడెన్స్‌లా ఉంది థమన్ భయ్యా..కాన్‌ఫిడెన్స్ వరకు ఓకే గానీ, రేపు రిజల్ట్ తేడా వస్తే ఏంటీ పరిస్థితి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి సర్కారు వారి పాట సక్సెస్ విషయం లో థమన్ చెబుతున్న మాటలు ఎంత వరకు నిజమవుతాయో.