Naga Babu : రోజా వెళ్లి పోవడంతో జబర్దస్త్‌లోకి నాగబాబు ఎంట్రీ..?
Naga Babu : ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి తొమ్మిది సంవత్సరాలుగా జడ్జి గా వ్యవహరించిన సీనియర్ హీరోయిన్ రోజా గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో చోటు దక్కడం రోజా జబర్దస్త్ ని వీడింది. ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పుడు జబర్దస్త్ కార్యక్రమానికి విచ్చేసిన రోజా మంత్రి పదవి చేపట్టిన వెంటనే జబర్దస్త్ కార్యక్రమాన్ని విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. జబర్దస్త్ నుండి రోజా వెళ్లిపోయిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయబోతున్నది ఎవరు అంటూ చాలా రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఈ సమయంలో కొందరు జబర్దస్త్ షో అభిమానులు రోజా వెళ్లి పోవడం లో తో మళ్ళీ నాగబాబు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోజా కు మరియు నాగబాబుకి ఉన్న విభేదాల కారణంగానే జబర్దస్త్ నుండి ఆయన వెళ్ళి పోయాడు అనేది గతంలో వచ్చిన టాక్. ఇప్పుడు జబర్దస్త్ కి ఆయన రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.అసలు విషయం ఏంటంటే మల్లెమాల వారితో వచ్చిన గొడవ కారణంగా నాగబాబు జబర్దస్త్ ని వదిలి వెళ్లి పోయాడు.

is naga babu re entry in to jabardasth show
ఇప్పుడు అదే మల్లెమాల వారు జబర్దస్త్ ను కంటిన్యూ చేస్తున్నారు.. కనుక నాగబాబు మల్లి జబర్దస్త్ కి వెళ్లే అవకాశం లేనే లేదు. రోజా పోయిన మరి ఎవరు వెళ్లి పోయినా కూడా జబర్దస్త్ ను నాగబాబు భుజాలకు ఎతుక్కునే అవకాశం లేదంటూ మెగా అభిమానుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు ఇప్పటికే స్టార్ మా టివి లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఆ కార్యక్రమం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక జబర్దస్త్ కి వెళ్లే అవకాశం లేనే లేదు.. మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అంటూ నాగబాబు సన్నిహితుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.