Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు నాగార్జున మధ్య ది ఘోస్ట్ ట్రైలర్ విడుదల సందర్భంగా ట్విట్టర్ లో జరిగిన చర్చ అందరిలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ట్విట్టర్ లో ది ఘోస్ట్ ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల తర్వాత నాగార్జున స్పందించాడు. కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణ గారితో కలిసి నటించే అవకాశం నాకు కలిగింది. మళ్లీ ఇద్దరం కలిసి సినిమా చేయాలని నేను కోరుకుంటున్నాను అంటూ నాగార్జున ట్విట్టర్ ద్వారా మహేష్ బాబుతో అన్నాడు.
అందుకు మహేష్ బాబు వెంటనే స్పందించాడు. తప్పకుండా మనం ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అంటూ మహేష్ బాబు ట్వీట్ ను చేయడం జరిగింది. ట్విట్టర్ లో నాగార్జున అడిగాడు.. మహేష్ బాబు ఓకే అన్నాడు. ప్రస్తుతం ఈ విషయం ఆసక్తికరంగా మారింది. నిజంగా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందా అంటూ అభిమానులు గాల్లో మేడలు కడుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ను సీనియర్ హీరో వెంకటేష్ తో కలిసి నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత మహేష్ బాబు అలాంటి మల్టీ స్టారర్ సినిమాల విషయం లో ఆసక్తి చూపించడం లేదు. కారణం చెప్పలేదు కానీ మహేష్ బాబు మరియు ఇతర కొందరు హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు అంటే ఆమడ దూరం లో ఉంటున్నారు. కానీ ఇప్పుడు నాగార్జున మల్టీ స్టారర్ సినిమా ప్రపోజల్ కు మహేష్ బాబు ఓకే చెప్పడంతో చాలా మంది నిజంగానే మహేష్ బాబు మనసులో నుండి నాగ్ తో నటించేందుకు ఓకే చెప్పాడా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.