Samantha : సమంత ఐటెం సాంగే పుష్పకు మైనస్సా.. ఊహు అంటున్నారు మావ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : సమంత ఐటెం సాంగే పుష్పకు మైనస్సా.. ఊహు అంటున్నారు మావ..!

samantha  : అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. నిన్న తెల్లవారు జామునుంచే సినిమా చూసిన వారంతా పుష్ప సినిమా ఎలా ఉందనే విషయమై యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వారి వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అల్లు అర్జున్ హార్డ్ కోర్ ఫాన్స్ అంతా థియేటర్ల వద్ద నుంచి బయటకు వచ్చిన వెంటనే సినిమా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :18 December 2021,10:20 am

samantha  : అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. నిన్న తెల్లవారు జామునుంచే సినిమా చూసిన వారంతా పుష్ప సినిమా ఎలా ఉందనే విషయమై యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వారి వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అల్లు అర్జున్ హార్డ్ కోర్ ఫాన్స్ అంతా థియేటర్ల వద్ద నుంచి బయటకు వచ్చిన వెంటనే సినిమా వేరే లెవెల్లో ఉందని అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని పొగడ్తలు కురిపిస్తున్నారు. అయితే ట్విట్టర్ ద్వారా ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. చాలామంది ఫస్టాఫ్ చాలా బాగుందని, సెకండాఫ్ డల్ అని, క్లైమాక్స్ వీక్ గా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దేవిశ్రీప్రసాద్ పాటలు అద్భుతంగా ఉన్నప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిగా అందించలేకపోయాడని కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా లాస్ట్ లో సమంత ఐటమ్ సాంగ్ అంటూ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసిన చిత్ర బృందానికి ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది.ఈ స్పెషల్ సాంగ్ అనుకున్నంత హైలెట్ కాలేదనే నెగిటివ్ టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. సమంత చేసిన ఈ స్పెషల్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని అందరూ చెప్పుకున్నారు. అయితే సినిమాలో సాంగ్ చూసిన అనంతరం ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. దేవీ, సుక్కు కాంబినేషన్‌లో ఇప్పటివరకు వచ్చిన ఐటెం సాంగ్స్ అన్నింటి కంటే ఇది అనుకున్నంత హైలెట్ కాలేదని చూసినవారు అంటున్నారు.

is samantha song minus for pushpa

is samantha song minus for pushpa

Samantha  : ప్లస్ అనుకుంటే మైనస్ అయిందా..?

అలా సినిమాకు ప్లస్ అవుతుందనుకున్న సమంత సాంగే ఇప్పుడు మైనస్ అయి కూర్చుంది.మరోవైపు సినిమాపై ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందో..అంతే నెగిటివ్ టాక్ నడుస్తోంది. సినిమా నిడివి చాలా ఎక్కువైందని కొంతమంది.. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ వంటి మంచి నటుల నుంచి నటనను రాబట్టుకోకుండా కేవలం బన్నీ ఎలివేషన్ పైనే సుకుమార్ దృష్టి పెట్టారని అంటున్నారు. ముఖ్యంగా కార్ లో బన్నీ, రష్మీక మధ్య వచ్చే చేయి సీన్… సుక్కు మార్క్ సీన్ కానీ కాదంటున్నారు. ఏది ఏమైనప్పటికి సినిమా మాత్రం భారీ వసూళ్లతో దూసుకు పోతూ ఉండటం గమనార్హం.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది