Samantha : షాకింగ్.. సమంత నిర్ణయం వెనుక ఆ హీరో ఉన్నాడా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : షాకింగ్.. సమంత నిర్ణయం వెనుక ఆ హీరో ఉన్నాడా..?

 Authored By mallesh | The Telugu News | Updated on :1 December 2021,7:15 am

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్‌లోనూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఎవరు ఏమి చెప్పినా వినే పరిస్థితుల్లో తాను లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. చైతూతో ప్రేమ, వివాహా బంధాన్ని తెంచుకున్నాక చాలా డేరింగ్ స్టెప్స్ వేస్తోంది సామ్. అందులో సినిమాలు ఉండొచ్చు. వ్యక్తిగత జీవితమైనా కావొచ్చు. విడాకులు తీసుకున్న తర్వాత నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓర్పుతో ధైర్యంగా సమాధానాలు చెప్పిన సామ్.. ఏకంగా తనపై రూమర్స్ క్రియేట్ చేసిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధపడింది.
తాజాగా హాలీవుడ్‌ మూవీ ‘అరెంజ్‌మెంట్ ఆఫ్ లవ్’లో ‘బై సెక్సువల్’ నటిగా కనిపించేందుకు ఓకే చెప్పి అందరినీ షాక్‌కు గురిచేసింది సామ్..

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో సమంత ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. త్వరలోనే తాప్సీ నిర్మాణంలో ఓ సినిమా చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టేందుకు సామ్ రంగం సిద్ధం చేసుకుంటోంది. తానెంటో ప్రపంచానికి చూపించాలని కంకణం కట్టుకున్నట్టు ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు చెప్పకనే చెబుతున్నాయి. ఒక్కసారి హాలీవుడ్ బై సెక్సువల్ రోల్‌లో సామ్ ప్రేక్షకులను గనుక మెప్పించి నట్టయితే ఆమెను గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నది వాస్తవం..

is that hero behind samanthas decision

is that hero behind samanthas decision

Samantha : ఆ హీరో చెప్పడం వల్లే ఓకే చేసిందా..

అయితే, ‘అరెంట్‌మెంట్ ఆఫ్ ల‌వ్‌’ మూవీని జాన్ పిలిప్ డైరెక్ట్ చేయనున్నాడు. గురు ఫిలింస్ బ్యానర్ పై భారతీయ వుమెన్ సునీత తాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలోని ‘బై సెక్సువ‌ల్’ పాత్ర కోసం చిత్ర యూనిట్ ఆలోచన చేస్తుండ‌గా హీరో రానా ద‌గ్గుబాటి సామ్ పేరును సజెస్ట్ చేశాడట..ఆమె మాత్రమే ఈ పాత్రకు న్యాయం చేస్తుందని చెప్పడంతో మూవీ మేకర్స్ స‌మంత‌ను కలిసి స్టోరీ లైన్ వినిపించగా.. ఆమె ఓకే చెప్పినట్టు తెలిసింది. అలా సామ్ ఈ సినిమా చేయడానికి హీరో రానా ప్రమేయం ఉందని టాక్ నడుస్తోంది.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది