Prabhas : ప్రభాస్ ఇంతగా నష్టపోవడానికి కారణం అదేనట.!
Prabhas : ప్రభాస్ .. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్‌గా అసాధారణమైన క్రేజ్ అండ్ పాపులారిటీని సంపాదించుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ ఇంటర్‌నేషనల్ లెవల్‌లో పెరిగిపోయింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రభాస్ రేంజ్ పెరిగిందంటే సినిమా కోసం ఎంతగా శ్రమిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి రెండు భాగాల కోసం దాదాపు నాలుగేళ్ళకి పైగా సమయం కేటాయించడం మాత్రమే కాదు ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని ఒళ్ళు హూనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

is this the reason for prabhas-loss
ఆ తర్వాత సాహో చేసిన ప్రభాస్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తన మార్కెట్ విపరీతంగా పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే నాలుగు పాన్ ఇండియన్ సినిమాలను కమిటయిన ప్రభాస్ బాలీవుడ్‌లో స్ట్రైట్ సినిమా ఆదిపురుష్ చేస్తుండటం విశేషం. పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రాధే శ్యాం చేస్తున్న ప్రభాస్ దాదాపు ఈ సినిమాను కంప్లీట్ చేశాడు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న సలార్, ఆదిపురుష్ హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.
Prabhas : ప్రభాస్ బాహుబలి సినిమాల నుంచి కొత్తగా మేకోవర్ చేసుకుంటున్నాడు.
అయితే ఇంతగా పాన్ ఇండియన్ క్రేజ్ ఉన్న ప్రభాస్‌కు ఒక బలహీనత కూడా ఉందట. అదే బద్దకం. ఈ బద్దకం వల్లే చాలా నష్టపోయాడట. ఇంత బద్దకం ఉన్న ప్రభాస్ బాహుబలి సినిమాల నుంచి ప్రతీ సినిమాకు తనని తాను కొత్తగా మేకోవర్ చేసుకునేందుకు ఆ బద్దకాన్ని పక్కన పెట్టి కష్టపడాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక ఆయన నటిస్తున్న రాధే శ్యామ్ ఈ ఏడాదే రిలీజ్ కానుండగా.. సలార్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ..ఆదిపురుష్ 2022 ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నాయి.