Ismart Jodi : ఇస్మార్ట్‌ ‘జోడీ’కి ఓంకార్‌ అన్నయ్య ఇచ్చింది ఎంత? ఆయనకు వచ్చింది ఎంత? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ismart Jodi : ఇస్మార్ట్‌ ‘జోడీ’కి ఓంకార్‌ అన్నయ్య ఇచ్చింది ఎంత? ఆయనకు వచ్చింది ఎంత?

 Authored By prabhas | The Telugu News | Updated on :18 May 2022,6:00 pm

Ismart Jodi : తెలుగు బుల్లి తెరపై యాంకర్ ఓంకార్ ది చాలా ప్రత్యేకమైన శైలి అనడంలో సందేహం లేదు. సన్‌ నెట్వర్క్ వారి ఆధిత్య మ్యూజిక్ తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఓంకార్‌ యాంకర్ గా మారాడు. ఆ సమయంలో తన మాట చాతుర్యం మరియు ప్రేక్షకులతో ఇంటరాక్ట్‌ అయ్యే విధానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. ప్రతి ఎపిసోడ్‌ లో కూడా ఆయన ఉంటే ఎంటర్ టైన్మెంట్ బాగా ఉండేది అనే అభిప్రాయం ఏర్పడింది. దాంతో ఓంకార్ అంటే అభిమానం మొదలయ్యింది. ఆ తర్వాత ఆయన స్థాయి ఏ విధంగా మారిందో అందరికి తెల్సిందే.తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు రియాల్టీ షో లు.. అందులో ఉన్న మజాను రుచి చూపించింది ఓంకార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాంటి ఓంకార్ ఇస్మార్ట్‌ జోడీ అంటూ రెండవ సీజన్ ను ముగించాడు మొదటి సీజన్ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో చాలా తక్కువ సమయంలోనే రెండవ సీజన్‌ ను కూడా తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు స్టార్‌ మా ద్వారా తీసుకు వచ్చాడు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఇస్మార్ట్‌ జోడీ సీజన్ 2 తాజాగా ముగిసింది. గ్రాండ్ ఫినాలే లో వినయ్‌ మరియు వర్ణిత లు విజేతలు గా నిలిచారు. అమ్మరాజశేఖర్ మరియు రాధమ్మ లు రన్నర్‌ లుగా నిలిచారు.ఇస్మార్ట్‌ జోడీ సీజన్ 2 లో విజేతలుగా నెగ్గిన వర్ణిత మరియు వినయ్‌ లకు ఓంకార్‌ పాతిక లక్షల చెక్కును అందజేశాడు. రన్నర్ గా నిలిచిన వారికి పది లక్షలు.. కంటెస్టెంట్స్ కు అయిదు లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది.

ismart jodi 2 winner and runner cash price and omkar profits

ismart jodi 2 winner and runner cash price and omkar profits

మొత్తం ప్రైజ్ మనీ మరియు వారి పారితోషికాలు కలిపి ఓంకార్‌ దాదాపుగా 1.25 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడని స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆయన చేసిన ఖర్చుకు గాను దాదాపు రెట్టింపు గా ఆయనకు వచ్చింది. రెండు కోట్లకు పైగానే ఆయన స్టార్‌ వారి నుండి అందుకున్నాడు. దాంతో దాదాపుగా కోటి రూపాయల లాభం ఓంకార్‌ కు వచ్చి ఉంటుందంటున్నారు. ఇక స్టార్‌ ఛానల్‌ లో టెలికాస్ట్‌ చేయడం ద్వారా వారికి ఏకంగా రెండు కోట్లకు పైగానే బ్రాండ్స్ ద్వారా ఆదాయం వచ్చిందని సమాచారం. మొత్తానికి ఓంకార్ ఏం చేసినా లాభాల పంట ఖాయం అని ఇస్మార్ట్‌ జోడీ కూడా నిరూపించింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది