Omkar : ఓంకార్ ని బండ బూతులు తిడుతున్న ఈటీవీ ప్రేక్షకులు
Omkar : తెలుగు బుల్లి తెరకు కమర్షియల్ హంగులు అద్దినది ఓంకార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఓంకార్ ఆట అనే డాన్స్ కార్యక్రమాన్ని తీసుకు వచ్చి ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడో అందరికీ తెలిసిందే. ఆ స్థాయి విజయాలను మళ్లీ ఆయన ఎన్నో అందుకున్నాడు. బుల్లి తెరపై ఓంకార్ ఒక సూపర్స్టార్గా వెలుగు వెలుగుతున్న ఈ సమయంలో ఈ టీవీ ప్రేక్షకులు ముఖ్యంగా జబర్దస్త్ అభిమానులు ఆయన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తెగ తిటేస్తున్నారు. కేవలం జబర్దస్త్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఓంకార్ అన్నయ్యని నానా మాటలు అనేస్తున్నారు.
ఇంతకు ఓంకార్ ని అంతగా తిట్టడానికి కారణం ఏంటి అంటున్నారా.. జబర్దస్త్ ఈ స్థాయి పతనానికి కారణం ఓంకార్ అంటూ ప్రతి ఒక్కరు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. గతంలో ఓంకార్ కాకుండా వేరే ఛానల్లో అదే జీ తెలుగు చానల్లో కామెడీ కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ కార్యక్రమం జబర్దస్త్ కార్యక్రమాన్ని బీట్ చేయడంలో విఫలం అయింది. అందుకే ఆ కార్యక్రమాన్ని ఆపివేశారు. ఇప్పుడు స్టార్ మా వాళ్ళు కామెడీ స్టార్స్ పేరుతో తెగ హడావుడి చేస్తున్నారు. ఆ కామెడీ స్టార్స్ ని ఓంకార్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మల్లెమాల కు ఏమాత్రం తగ్గకుండా భారీ ఎత్తున కామెడీ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా జబర్దస్త్ రేటింగ్ అత్యంత దారుణంగా తగ్గేలా చేయడంలో ఓంకార్ సఫలం అయ్యాడు.
తనకు కష్టమైనా.. లాభాలు రాకున్నా కూడా జబర్దస్త్ నుండి పెద్ద కమెడియన్స్ ని భారీ పారితోషికం ఆఫర్ చేసి లాగడం ద్వారా ఇప్పటికే ఓంకార్ ఇప్పటికే సక్సెస్ అయ్యాడు అంటూ బుల్లి తెర వర్గాల వారు అంటున్నారు. జబర్దస్త్ స్థాయి లో కచ్చితంగా కామెడీ స్టార్స్ ఉండక పోవచ్చు. జబర్దస్త్ నుండి కమెడియన్స్ వెళ్లిపోవడం వల్ల కచ్చితంగా భవిష్యత్తులో జబర్దస్త్ కార్యక్రమాన్ని నిలిపివేసే స్థాయికి రేటింగ్ పడే అవకాశం ఉంది. అప్పుడు స్టార్ మా లో వచ్చే కామెడీ స్టార్స్ ని కూడా ఆపేస్తారు. తద్వారా స్టార్ మా రేటింగ్ లో నెం.1 గా నిలుస్తుంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏదైనా కూడా జబర్దస్త్ కి ఈ పరిస్థితి రావడానికి కారణం ఓంకార్ కారణం అంటూ బలంగా బల్ల గుద్ది మరీ వారు చెబుతున్నారు.