Sudigali Sudheer : అదీ సుడిగాలి సుధీర్ రేంజ్.. మరోసారి ఫ్రూవ్ అయిందిగా?
Sudigali Sudheer : బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సుధీర్ మెల్లిమెల్లిగా ఎదుగుతూ వచ్చాడు. కింది స్థాయి నుంచి స్టార్ వరకు ఎదిగినా కూడా ఇంకా ఒదిగే ఉంటాడు. ఎంత మంది ఎన్ని రకాలుగా మాటలు అన్నా, సెటైర్లు వేసినా, కౌంటర్లు వేసినా కూడా బరిస్తాడు.ఎన్ని రకాలు కించపరిచినా చిరు నవ్వు చిందిస్తాడు. అలా సుధీర్ సహనానికే ఎంతో మంది అభిమానులున్నారు.
మొత్తానికి సుధీర్ మాత్రం ఇప్పుడు బుల్లితెరపై మకుటం లేని మహారాజు. సుధీర్ అంటే ఇష్టపడని వ్యక్తి ఉండరు. సుధీర్ ఉంటే చాలు ఆ షో హిట్ అయినట్టే లెక్క. అందుకే ఎక్కడో రేటింగ్‌లో ఆమడ దూరంలో ఉన్న శ్రీదేవీ డ్రామా కంపెనీ షోను నిలబెట్టేందుకు సుధీర్‌ను రంగంలోకి దించారు. సుధీర్ రాకతో షో తీరే మారిపోయింది. రేటింగ్‌లో దూసుకుపోతోంది.

Jaanu Lyri On Sudigali Sudheer In Sridevi Drama Company
Sudigali Sudheer : సుధీర్‌పై జాను లిరి కామెంట్స్..
తాజాగా జాను లిరి అనే ఓ డ్యాన్సర్ దుమ్ములేపేసింది. తన కొడుకు, తన తల్లికి సుధీర్ అంటే పిచ్చి అని, సుధీర్ మామా అని ఎప్పుడూ అడుగుతుంటాడు అని జాను చెప్పుకొచ్చింది. అలా ఎంతో మంది అక్కడున్నా కూడా సుధీర్ గురించి మాత్రమే జాను చెప్పింది. తన తల్లికి సుధీర్ అంటే చాలా ఇష్టమని అందరి ముందే చెప్పేసింది. అందుకే దటీజ్ సుధీర్.. ఆయన రేంజ్ వేరే అని అంటారు.