Anasuya : యాంకర్ అనసూయ ట్రూ లవ్ స్టోరీ… నిజంగా ఆమె ఫైటర్
Anasuya : జబర్దస్త్ యాంకర్ అనసూయ లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు. ఆమె ఇంటర్ చదివే రోజుల్లోనే భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక పోవడంతో పెళ్లి ని దాచి పెట్టింది. కొన్నాళ్ళ తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసింది. ఆయన ఒప్పుకోకపోవడంతో దూరంగా వెళ్ళి పోయింది. ఇంటర్ చదివే వయస్సు అంటే చాలా చిన్న వయసు.. ఆ వయసులో ప్రేమ పెళ్లి అనేది కేవలం వ్యామోహం మాత్రమే అంటారు.
ఆ వ్యామోహంతో అనసూయ భరద్వాజ్ ను పెళ్లి చేసుకున్నా ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకొని ఇన్నాళ్ల తమ వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు. వారికి ఇద్దరు పిల్లలు.. ఆ పిల్లలతో వారిద్దరి జీవితం చాలా సంతోషంగా గడుస్తోంది. అనసూయ స్థానంలో మరెవరూ ఉన్నా కూడా కచ్చితంగా ఇన్నాళ్ళ పాటు ఆ వైవాహిక బంధం కొనసాగేది కాదు అనేది చాలా మంది అభిప్రాయం. అనసూయ ఓపిక మరియు ఆమె యొక్క కమిట్మెంట్ కారణంగానే ప్రేమ సఫలం అయింది అంటూ ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Jabardasth anchor Anasuya love story
ఇటీవల ఆమె తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియా లో పెట్టిన పోస్టు తనకు భరద్వాజ్ అంటే ఎంత ప్రేమ అభిమానం ఉందో ఆ పోస్ట్ లో చెప్పకనే చెప్పింది. చిన్నతనంలోనే పెళ్లి అయిన కూడా కష్టపడి ఈ స్థాయికి వచ్చిన అనసూయ ప్రతి ఒక్కరికి ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు అమ్మాయి అనే కాకుండా ఏ అమ్మాయికైనా కూడా అనసూయ ఆదర్శంగా ఉండాలి ప్రేమలో పడ్డ కొన్నాళ్ల తర్వాత తప్పు తెలుసుకున్నాం అంటూ విడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అనసూయ చాలా చిన్న వయస్సులోనే ప్రేమించిన కూడా ఆ ప్రేమకు కట్టుబడి ఉండి తాము అనుకున్న జీవితంలో ముందుకు సాగుతూ సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతుంది. అనసూయ భరద్వాజ్ ల సంసార జీవితం ఇలాగే కలకాలం ఉండాలని కోరుకుందాం.