Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష ఇంట విషాదం.. ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్టు!
Jabardasth Varsha : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదనుకుంట.. జబర్దస్త్ కామెడీ షోకు వచ్చాకే చాలా పాపులర్ అయింది. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టినా ప్రస్తుతం జబర్దస్త్ లేడీ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్ష.. హీరోయిన్లకు తానేం తక్కువ కాదన్నట్లు అందాలను ఆరబోస్తుంటుంది వర్ష.. తాజాగా ఈ నటి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. వర్ష సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈయన పరిస్థితి ముందు కాస్త విషమంగా ఉంది.

jabardast rain house tragedy emotional post on instagram
కానీ ప్రస్తుతం అతను కోలుకున్నాడని వర్ష సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన సోదరుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటోను కూడా జతచేసి ఎమోషనల్ అయ్యింది. సంక్రాంతి వేడుకలతో హాయిగా ఉన్న తమ కుటుంబానికి యాక్సిడెంట్ వార్త షాకిచ్చిందని బాధను వ్యక్తం చేసింది వర్ష.సోషల్ మీడియా వేదికగా అందరికీ ఓ విజ్ఞప్తి చేసింది వర్ష.

jabardast rain house tragedy emotional post on instagram
‘దయచేసి అందరినీ వేడుకుంటున్నాను. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముగ్గురు వ్యక్తులు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల నా బ్రదర్‌కి యాక్సిడెంట్ అయి హాస్పిటల్‌లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. మా ఫ్యామిలీ అంతా ఎంతగానో బాధపడ్డాం. అందుకే ఎవరైనా సరే డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ఎవరు కూడా, ఏ ఫ్యామిలీ కూడా బాధపడకుండా ఉంటారని తెలిపింది.