Anasuya : అనసూయతో కేసు పెట్టించుకోవలని ఉబలాటపడుతున్న పోకిరీలు… మాకు కావాలి పబ్లిసిటీ
Anasuya : జబర్దస్త్ అనసూయ ఎంత మొండి వైఖరితో.. తాను పట్టిన పట్టుదలను ముందుకు తీసుకు వెళ్తుందో అందరికీ తెలిసిందే. ఆమె అనుకున్నది సాధించే వరకు నిద్ర పోని రకం. ఎవరైనా తన గురించి సోషల్ మీడియా ద్వారా గాని, మీడియా ద్వారా కానీ మాట్లాడితే వెంటనే ఆ మాటలకు కౌంటర్ ఇచ్చే రకం. ఒక ఇండిపెండెంట్ మహిళ అయినా అనసూయ ఇటీవల తనను ఆంటీ అంటూ కొందరు ఏజ్ షేమింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియా ద్వారా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే మీకు చివరి వార్నింగ్, ఇకపై ఎవరైనా ఆంటీ అంటే కచ్చితంగా వారికి తగిన బుద్ధి చెప్తానని.. వారిపై పోలీస్ కేసులు కూడా పెట్టబోతున్నట్లుగా ప్రకటించింది.
ఇప్పటి వరకు తనను ఆంటీ అంటున్నారు అంటూ ఎవరు కేసు పెట్టకపోయినా ఉండవచ్చు.. అనసూయ మాత్రం తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆంటీ వ్యాఖ్యలకు కేసు పెట్టేలాగే ఉంది ఆమె తీరుని చూస్తూ ఉంటే కచ్చితంగా త్వరలోనే కొద్ది మందిపై అయినా కేసు పెట్టేలా ఉందంటూ నేటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఆమెతో కేసు పెట్టించుకుని మరి పబ్లిసిటీ పొందాలని కొందరు ఉబలాటపడుతున్నట్లుగా ఉన్నారు. ఆమె చివరి వార్నింగ్ అంటూ హెచ్చరించిన తర్వాత కూడా ట్విట్టర్లో ఆమె గురించి పెద్ద ఎత్తున ట్రెండు కొనసాగింది. కొందరు ఆమె పేరు ఎత్తి, కొందరామె పేరు ఎత్తకుండా ఆంటీ హ్యాష్ ట్యాగ్ ని ట్విట్టర్లో ఓ రేంజ్ లో షేర్ చేశారు. దాంతో ఆమె పేరు మరింతగా పాపులారిటీ అయింది అనడంలో సందేహం లేదు.

jabardasth Anasuya social media trolls and hashtags
ఆమె కావాలని సోషల్ మీడియాలో వివాదాన్ని రాజేసేందుకు ప్రయత్నాలు చేసిందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు ఆమెని రెచ్చగొట్టేందుకు మరింత దూకుడుగా ఆంటీ అంటూ పిలుస్తున్నారు. ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనసూయ ఈ మధ్య జబర్దస్త్ ను వీడి స్టార్ మా లో జాయిన్ అయిన విషయం తెలిసింది. అదే సమయంలో వరుసగా సినిమాల్లో నటించేందుకు అనసూయ రెడీ అవుతోంది. హీరోయిన్గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా ప్రత్యేక పాత్రల్లో నటించేందుకుగాను అనసూయ ఓకే చెబుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో రాబోతున్న పుష్ప 2 సినిమా ఆమెకు మరో ముఖ్యమైన సినిమా అవ్వబోతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.