Anasuya : అయ్యో అనసూయ మేడం ఎంత పని చేశావ్.. మూడు సినిమాలు మిస్ పాపం
Anasuya : ఒక హీరో పై కోపం పెంచుకున్న జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ ఆ హీరో సినిమా విడుదల సందర్భంగా చేసిన ట్వీట్ ఒక రేంజ్ లో వైరల్ అయింది. ఆ సినిమా ఫ్లాప్ అయిన కూడా ఆ హీరో యొక్క అభిమానులు అనసూయ యొక్క ట్వీట్ ని తీవ్రంగా పరిగణించారు. ఆమె ట్వీట్ చేసినందుకు గాను ఆంటీ అంటూ ఆమెను రెచ్చగొడుతూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హడావుడి చేశారు. తనను ఆంటీ అంటున్నారు అంటూ అనసూయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవలే ఆమె చివరి హెచ్చరిక అంటూ వార్నింగ్ ఇచ్చి మరి తన యొక్క అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ఆమె ఇకపై తనను ఎవరు ఆంటీ అంటూ పిలిచిన కూడా పోలీస్ కేసు పెడతానంటూ హెచ్చరించడంతో నేటిజన్స్ ముఖ్యంగా ఆ హీరో అభిమానులు మరింతగా రెచ్చి పోయారు. ఆమెను మరింతగా ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ఈ సమయంలో ఆమె యొక్క క్రేజ్ కూడా తగ్గింది అంటూ పుకార్లు షికార్లు చేయడం మొదలు పెట్టాయి. కొన్ని వారాల క్రితం ఈమె సైన్ చేసిన ఒక సినిమా ను ఈ వివాదం కారణంగా క్యాన్సల్ చేసుకుంటున్నట్లుగా నిర్మాత పేర్కొన్నాడట. ఈ విషయం కూడా సోషల్ మీడియాలోనే కొందరు ప్రచారం చేస్తున్నారు.
ఆ ఒక్క సినిమా మాత్రమే కాకుండా మొత్తం మూడు సినిమాలు ఈ వివాదం కారణంగా ఆమె కోల్పోవాల్సి వచ్చిందంటూ కొందరు పుకార్లను పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ అనసూయ వరుస సినిమాలు ఈ వివాదం కారణంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనసూయ ఈ వ్యవహారంలో ఇప్పటికైనా సైలెంట్ అయితే బాగుంటుందని ఆమె యొక్క శ్రేయోభిలాషులు మరియు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆమె మాత్రం ఆంటీ అంటే ఊరుకునేది లేదు అంటూ మళ్ళీ మళ్ళీ నెటిజెన్స్ ని ముఖ్యంగా ఆ హీరో యొక్క అభిమానులను హెచ్చరిస్తూనే వార్నింగ్ ఇస్తూనే ఉంది.