Jabardasth Appa Rao : జబర్దస్త్ అప్పారావ్‌కు అన్ని రోగాలున్నాయా..? అసలు విషయం చెప్పిన భార్య..!
Jabardasth Appa Rao : జబర్దస్త్ అప్పారావ్, ఆయన భార్య ఇద్దరూ కూడా బుల్లితెర మీద బాగానే సందడి చేస్తుంటారు. జబర్దస్త్ షోలో ఉన్న సమయంలోనే తన భార్యను తెరకు పరిచయం చేశాడు. అలా అలా తన స్కిట్లలోనూ తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు అప్పారావ్ కూడా జబర్దస్త్ షోకు దూరంగా ఉన్నాడు. అలా ఎందుకు దూరమయ్యాడో సరైన కారణం తెలియదు గానీ మొత్తానికి కనిపించడం మానేశాడు. ఈటీవీని వదిలి స్టార్ మాలో ప్రత్యక్షమయ్యాడు. అప్పట్లో ఓంకార్ షోలో జంటగా కనిపించాడు.
ఓంకార్ ఇస్మార్ట్ జోడి షోలో అప్పారావ్, ఆయన భార్య ఇద్దరూ వచ్చారు. చివరి వరకు ఉన్నారు. కానీ ట్రోఫీ మాత్రం పట్టుకోలేకపోయారు. ఆ సీజన్‌లో ప్రభాకర్, ఆయన భార్య గెలిచారు. టైటిల్ సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అప్పారావ్, ఆయన భార్య రెచ్చిపోదాం బ్రదర్ అనే షోలో వచ్చారు. రాజీవ్ కనకాలతో గ్రాండ్‌గా ప్రారంభించిన ఈ షోలో చివరకు బాబా భాస్కర్ వచ్చి సెటిల్ అయ్యాడు. రాజీవ్ కనకాల సైడ్ అయిపోయాడు.
Jabardasth Appa Rao : రెచ్చిపోదాం బ్రదర్‌లో అప్పారావ్..
అలాంటి షోలో ఇప్పుడు అప్పారావ్ తన సమస్యలను బయటపెట్టేశాడు. ఆయన మంచి తనమే ఆయన బలహీనత అని అప్పారావ్ గురించి అంటారు. అది మంచితనం కాదు.. నరాల బలహీనత అని భార్య కౌంటర్ వేసి పరువుతీస్తుంది. షుగర్, అల్సర్, బీపీ అన్నీ ఉన్నాయని చెప్పవే అంటూ తన గురించి బయటపెట్టేశాడు. నేను ఒక్క నరాల బలహీనతే అని చెప్పాను.. మీరే అన్నీ చెప్పేసుకున్నారు అంటూ మరో సెటైర్ వేసేసింది. దీంతో అప్పారావ్ దెబ్బకు సైలెంట్ అయ్యాడు.