Baba Bhaskar : కంటతడి పెట్టేసిన బాబా భాస్కర్ భార్య.. కారణం ఏంటంటే?
Baba Bhaskar : బాబా భాస్కర్… ఇతని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. కొరియోగ్రాఫర్‌గాను, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గాను ఇతను చేసిన సందడి ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది. బిగ్ బాస్ తర్వాత బాబా భాస్కర్ పలు టీవీ షోలలో తెగ సందడి చేస్తున్నాడు. తాజాగా ఆయన ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఇస్మార్ట్ జోడీ 2 షోలో పాల్గొన్నాడు. తన భార్య రేవతి కూడా ఈ షోలో పాల్గొంది. అయితే ఈ షోలో బాబా భాస్కర్ సందడి ఎక్కువగా ఉంటుంది. అయితే బిగ్ బాస్ షోలో ఓ సందర్భంలో కన్నీరు పెట్టుకున్న బాబా భాస్కర్ తాజాగా ఓంకార్ షోలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయనతో పాటు రేవతి కూడా కన్నీళ్లు పెట్టుకుంది.
ఎదుటి కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేసే క్రమంలో అవినాష్ జంటని మిర్చి ఇస్తూ నామినేట్ చేశారు. ఆ తర్వాత బాబా భాస్కర్, రేవతిని నామినేట్ చేశారు. గివ్ అప్ ఇస్తున్నారని అనిపిస్తుంది అని అనగా, నేను ఎప్పుడు గివ్ అప్ ఇచ్చా అని బాబా అంటాడు. నేను చెప్పానా లేదా అని బాబా అని మిరపయకాయ్ తింటాడు. ఇద్దరు కన్నీళ్లు పెట్టుకోవడంతో అక్కడ వాతావరణమే మారిపోతుంది. ప్రస్తుతం ప్రోమో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండగా, కార్యక్రమం కోసం ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

baba bhaskar wife emotional
Baba Bhaskar : కన్నీళ్లకి కారణం ఏంటి?
బిగ్‌బాస్ సీజన్ 3లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బాబా భాస్కర్ హౌజ్‌లో ఉన్నప్పుడు అతని కుటుంబ సభ్యులు ముగ్గురు వచ్చారు. ఇద్దరు పిల్లలు మరియు భార్య రావడంతో బాబా కళ్లలో ఆనందంకు అవదులు లేవు.మొదట ఇద్దరు పిల్లలు ఎంటర్ అవ్వగా ఆ తర్వాత ఆయన భార్య రేవతి ఎంట్రీ ఇచ్చింది. రేవతి లోనికి వచ్చిన తర్వాత అందరితో బాగా మాట్లాడింది. పలు మార్లు బాబా వారి ప్రేమాయణం గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఏదేమైన వీరిద్దరి జంట ఎంతో ఆదర్శంగా ఉంటుంది.