Jabardasth Auditions : జబర్దస్త్ ఆడిషన్స్… అంత మంది వస్తారని అంచనా వేయలేదు, ఏం జరిగిందంటే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardasth Auditions : జబర్దస్త్ ఆడిషన్స్… అంత మంది వస్తారని అంచనా వేయలేదు, ఏం జరిగిందంటే

 Authored By prabhas | The Telugu News | Updated on :27 October 2022,2:20 pm

Jabardasth Auditions : ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో కొత్త వారు కావలెను అంటూ ఇటీవల ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన నేపథ్యంలో పదుల సంఖ్యలో ఆశావాహులు వస్తారని మల్లెమాల ఈటీవీ జబర్దస్త్ నిర్వాహకులు భావించారు. కానీ అనూహ్యంగా 3000 మంది జబర్దస్త్ ఆడిషన్స్ కోసం వచ్చారంటూ సమాచారం అందుతుంది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న చాలా మంది జబర్దస్త్ లో ఛాన్స్ కోసం ప్రయత్నించడానికి వచ్చారు. యూట్యూబ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా సెలబ్రిటీలు సామాన్యులు సినిమాల్లో ఇప్పటికే నటించిన వారు ఇంకా చాలా మంది కూడా జబర్దస్త్ ఆడిషన్స్ కి రావడంతో నిర్వాహకులు తల పట్టుకున్నారు.

ఆడిషన్స్ కోసం వచ్చిన వారికి భోజనం ఏర్పాట్లు చేయాలని ముందుగా భావించారట. కానీ చివరికి ఎక్కువ మంది రావడంతో నిర్వాహకులు ఏం చేయాలో పాలు పోక పాపం వచ్చిన వారికి కనీస ఏర్పాట్లు చేయలేక పోయారని సమాచారం అందుతుంది. ఈటీవీ జబర్దస్త్ కార్యక్రమానికి ఉన్న పాపులారిటీ నేపథ్యంలో చిన్న రోల్ రెండు మూడు ఎపిసోడ్స్ లో ఛాన్స్ దక్కినా చాలు అన్నట్లుగా చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. కొందరు తమకు పరిచయం ఉన్న టీం లీడర్స్ ద్వారా చెప్పించేందుకు ప్రయత్నించారు. కొందరు మాత్రం ఆడిషన్స్ ఇచ్చి తమ ప్రతిభను నిరూపించుకునేందుకు చూశారు. వందల సంఖ్యను మించి ఆడిషన్స్ కి వచ్చిన నేపథ్యంలో ఏం జరుగుతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆడిషన్స్ లో కనీసం ఐదు మందిని అయినా సెలెక్ట్ చేస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది. కొందరు జంటలుగా వస్తే కొందరు విడిగా వచ్చారు.

jabardasth auditions people attend so many

jabardasth auditions people attend so many

ఎక్కువ శాతం మంది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వారిగానే ఉన్నారు. సోషల్ మీడియాలో నవ్వులు పూయించారు. చాలా మంది జబర్దస్త్ పై ఆశలు పెట్టుకొని ఉన్నారు. వారికి జబర్దస్త్ లో ఒక్క ఛాన్స్ వస్తే మరింత పాపులారిటీని సొంతం చేసుకొని తమ యూట్యూబ్ ఛానల్ మరింతగా పాపులర్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. అందుకే ఒక్క ఛాన్స్ అంటూ జబర్దస్త్ ఆడిషన్స్ కి హాజరు అయ్యామని చాలా మంది అంటున్నారు. జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కంటెస్టెంట్స్ కావాల్సి ఉంటుంది. అందుకోసం సోషల్ మీడియా ద్వారా కొందరిని పరిశీలించి పిలిచి వారికి ఆడిషన్స్ నిర్వహించి, ఆ తర్వాత తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈసారి ఆడిషన్స్ కి సంబంధించి అధికారికంగా ప్రకటన చేయడంతో ఇలా వేల సంఖ్యలో వచ్చారంటూ నిర్వాహకులు చెబుతున్నారు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది